పసుపు
మన ఆధ్యాత్మిక జీవన విధానంలో 'పసుపు' ప్రధాన పాత్రను పోషిస్తోంది. వంటకాల్లోనే కాకుండా ప్రతి శుభ కార్యంలోను పసుపును వాడుతుండటం జరుగుతోంది. కొత్త బట్టలు ధరించేటప్పుడు ... కొత్త వస్తువులు వాడకం మొదలు పెట్టేటప్పుడు పసుపుబొట్లు పెట్టడం ఈ నాటికీ ఆనవాయతీగా వస్తోంది. ఇక కొన్ని శుభకార్యాలు పసుపు కొట్టడంతోనే మొదలవుతుంటాయి. కాబట్టి పసుపును పవిత్రంగానే కాదు, శుభ సూచకంగా కూడా భావిస్తూ వుంటారు.
ముఖ్యంగా స్త్రీ జీవితంతో పసుపు అనేది పెనవేసుకుపోయింది. ప్రతి ఉదయం ముఖానికి పసుపు రాసుకుని స్నానం చేసి, ఆ తరువాత పాదాలకు పసుపు రాసుకునే అలవాటు చాలామంది స్త్రీలలో కనిపిస్తుంది. ఇక ఇంటిని శుద్ధి చేయడానికి ... వివాహాది శుభకార్యాల సమయంలోను ... నోములు - వ్రతాల సమయంలోను అతిథులుగా వచ్చిన స్త్రీల పాదాలకి పసుపు రాస్తూ వుంటారు. వివాహ సమయంలో పసుపుకి సున్నం చేర్చి పారాణిగా వధూ వరుల పాదాలకు పెడుతుంటారు. అక్షింతలను కూడా పసుపుతోనే కలుపుతుంటారు.
దైవ కార్యాలలోను ... శుభకార్యాలలోను పసుపు వాడకానికి ఇంతటి ప్రాధాన్యత పెరిగిపోవడానికి కారణం, దానిలో వుండే క్రిమి సంహారక శక్తి అని చెప్పవచ్చు. అందువల్లనే చిన్నపాటి గాయమైతే వెంటనే అక్కడ పసుపు పెడుతుంటారు. అంటూ వ్యాధులు ప్రబలకుండా, చర్మ సంబంధమైన వ్యాధులు ఒకరి నుంచి ఒకరికి సోకకుండా పసుపు కాపాడుతూ వుంటుంది. మూత్ర సంబంధమైన వ్యాధులను నివారించడంలో కూడా పసుపు ప్రముఖ పాత్రను పోషిస్తుంది. అందాన్ని ... ఆరోగ్యాన్ని కాపాడుతుందనే కారణంగానే మన పూర్వీకులు పసుపు వాడకాన్ని పూజల్లో ఒక నియమంగా చేశారని చెప్పొచ్చు.