అరుదైన హనుమయ్య క్షేత్రం
జీవితంలో ఆనందంగా ఉండాలంటే ... ఆరోగ్యంగా ఉండాలి. సంతోషంగా ఉండాలంటే ... సమస్యలు లేకుండా ఉండాలి. ఓ వైపున అనారోగ్య సమస్యలు ... మరోవైపున గ్రహ సంబంధమైన దోషాలు జీవితాన్ని ఛిన్నాభిన్నం చేస్తుంటాయి. అలాంటి పరిస్థితుల్లో అందరూ నమ్ముకునే దేవుడు ... ఆంజనేయుడు. ఆదరించడంలోను ... ఆదుకోవడంలోను ఆంజనేయుడు ఎప్పుడూ ముందే ఉంటాడు.
ఎలాంటి కష్టంలో పరిగెత్తుకు వచ్చినా ఆంజనేయుడు అభయముద్రలో దర్శనమిస్తూ అనుగ్రహిస్తుంటాడు. సాధారణంగా హనుమంతుడు వివిధ క్షేత్రాల్లో వీరాంజనేయుడుగా ... ప్రసన్నాంజనేయుడుగా ... అభయాంజనేయుడుగా దర్శనమిస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో ఆయన వివిధ నామాలతో ... ముద్రలతో భక్తులను అనుగ్రహించే క్షేత్రం మనకు ప్రకాశం జిల్లా 'ఒంగోలు' లో కనిపిస్తుంది. అత్యంత విశిష్టమైనదిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రంలో హనుమంతుడు అష్టవిధ రూపాలతో కనువిందు చేస్తుంటాడు.
తొమ్మిదవ రూపంగా ... ప్రధాన మూలమూర్తిగా 'పంచముఖ హనుమంతుడు' కొలువైవుంటాడు. హనుమంతుడి ప్రతిమలు అన్నీ కూడా జీవం ఉట్టిపడుతూ కుదురుగా కనిపిస్తుంటాయి. హనుమంతుడి పరాక్రమానికి ప్రతీకగా కనిపించే ఈ క్షేత్రంలో అడుగుపెట్టడం వల్లనే అన్ని రకాల వ్యాధులు ... పీడలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. విశేషమైన పర్వదినాల్లో స్వామివారిని పెద్ద సంఖ్యలో భ్యక్తులు దర్శించుకుంటూ ఉంటారు. ఆ స్వామి కృపా కటాక్షాలకు పాత్రులవుతుంటారు.