ఎడమచేతి ముగ్గు ?

ఎడమచేతి ముగ్గు ?

ఎడమచేతి ముగ్గు ?
ముగ్గు అనేది మన ఆచార వ్యవహారాలను ... సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ వుంటుంది. ఇల్లు ... ఆ ఇంట్లోని వారి పద్ధతులను వాకిట్లో ముగ్గే సగం వరకూ చెప్పేస్తుంటుంది. ఇంటి ముంగిట్లో అందంగా ముగ్గువేయడమనేది ఒక కళ. పూర్వం ఆడపిల్లలు నేర్చుకునే మొదటి కళగా ముగ్గుని గూర్చి చెప్పుకునే వాళ్లు. ఇక అత్తవారింటికి వెళ్లిన ఆడపిల్లలకి ఆమె నుంచి తొలి ప్రశంసని తెచ్చి పెట్టేది ముగ్గే. అందుకే ఆడపిల్లలు వివిధ రకాల ముగ్గులు వేయడం నేర్చుకోవడానికి ఆసక్తిని కనబరుస్తుంటారు.

ముగ్గు ... లక్ష్మీదేవి నివాస స్థానంగా చెప్పబడుతోంది. అందువల్లనే ముగ్గుని పవిత్రంగా చూడాలనీ ... కాళ్లతో తొక్కకూడదని అంటూ వుంటారు. ఇక ఈ ముగ్గుని చాలామంది ఆడపిల్లలు కుడి చేత్తో వేస్తూ వుండగా, కొంతమంది ఆడపిల్లలు ఎడమ చేత్తో వేస్తుంటారు. సాధారణంగా ఈ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఇక పట్టణాల్లో అయితే కొత్త కోడలు ఉదయాన్నే నిద్రలేచి వాకిట్లో ముగ్గుపెట్టే పరిస్థితి చాలా తక్కువగా వుంటుంది.

పల్లెటూళ్లలో ... కాస్త ఆచార వ్యవహారాలు పాటించే వారి కుటుంబాల విషయంలో మాత్రం ఎడమ చేత్తో ముగ్గు పెట్టడాన్ని తప్పుబడతారు. ఇలాంటి వారి ఇంటికి వచ్చిన కొత్త కోడలికి ఎడమచేయి వాటమైతే ... వాకిట్లో ముగ్గు పెట్టే విషయంలో కాస్త ఇబ్బంది తప్పదనే చెప్పాలి. కుడి చేయి మాత్రమే పవిత్రమైనదని చెప్పబడుతోన్న కారణంగా, ఎడమ చేత్తో ముగ్గు పెట్టడాన్ని చాలా కుటుంబాలు అంగీకరించవు ... చూసే వాళ్లు కూడా ఆక్షేపిస్తారు.

అంతే కాకుండా తాంత్రిక విద్యల్లో మాత్రమే ముగ్గు వేయడానికి ఎడమ చెయ్యిని ఉపయోగిస్తుంటారు. ఈ కారణంగా కూడా వాకిట్లో ఎడమ చేత్తో ముగ్గు వేయడాన్ని దోషంగా పరిగణిస్తారు. శాస్త్రం కూడా ఎడమ చేత్తో వాకిట్లో ముగ్గుపెట్టడం మంచిది కాదనే చెబుతోంది. అందువలన సాధ్యమైనంత వరకూ కుడి చేత్తోనే ముగ్గు పెట్టడం నేర్చుకోవాలి ... ఎడమ చేత్తో ముగ్గుపెట్టే అలవాటు వుంటే మానుకోవాలి ... కుదరని పక్షంలో ఆ పనిని మరొకరికి అప్పగించాలని అంటోంది.

More Bhakti Articles