వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. వెంటనే అప్‌డేట్ చేసుకోండి.. లేదంటే..!
Advertisement
- వాట్సాప్‌లో తీవ్ర భద్రతా లోపాలున్నట్లు కేంద్ర సంస్థ హెచ్చరిక
- ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్‌లలోని ఫోన్లపై హ్యాకర్ల కన్ను
- అనుమానాస్పద మెసేజ్ క్లిక్ చేస్తే ఫైల్స్ డిలీట్ అయ్యే ముప్పు
- ఐపీ అడ్రస్ చోరీ, ఫోన్ యాక్సెస్ పొందే అవకాశం గుర్తింపు
- యాప్‌ను వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని సెర్ట్-ఇన్ ఆదేశం
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారులకు భారత ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. వాట్సాప్‌లో ఉన్న తీవ్రమైన భద్రతా లోపాల కారణంగా యూజర్ల ఫోన్లు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్-ఇన్) హెచ్చరించింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్, మ్యాక్, విండోస్ ప్లాట్‌ఫామ్‌లలోని యాప్‌లలో ఈ లోపాలు ఉన్నాయని అత్యున్నత స్థాయి తీవ్రతతో కూడిన అడ్వైజరీని విడుదల చేసింది.
హ్యాకర్లు పంపే ప్రత్యేక సందేశాలు, అనుమానాస్పద లింకులు లేదా ఫైల్స్ ద్వారా ఫోన్‌పై పూర్తి నియంత్రణ సాధించే అవకాశముందని కేంద్ర సైబర్ భద్రతా విభాగం తెలిపింది. ఆండ్రాయిడ్ యూజర్లకు ఆర్డర్ డిటైల్స్ పేరిట వచ్చే మెసేజ్‌లను క్లిక్ చేస్తే లోకల్‌గా ఉన్న వాట్సాప్ ఫైల్స్ పూర్తిగా డిలీట్ అయ్యే ప్రమాదం ఉంది. మరోవైపు మెటా ఏఐ సర్టిఫికెట్ వ్యాలిడేషన్ లోపం ద్వారా డివైజ్‌ను హ్యాక్ చేయవచ్చని, ప్రకటనల యూఆర్‌ఎల్‌ల ద్వారా బాధితుల ఐపీ అడ్రస్‌లను నేరగాళ్లు సేకరించే వీలుందని వివరించింది.
విండోస్ వినియోగదారులకు పంపే కొన్ని అటాచ్‌మెంట్లు సాధారణ ఫైల్స్‌లా కనిపించినా ఓపెన్ చేయగానే ప్రమాదకర సాఫ్ట్‌వేర్‌లుగా మారుతాయని నిపుణులు గుర్తించారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ రిప్లైల ద్వారా సైబర్ దాడి చేసే మరో లోపం కూడా ఉందని వెల్లడించారు. ఈ సమస్యల నుంచి సురక్షితంగా ఉండాలంటే వెంటనే అన్ని డివైజ్‌లలోని వాట్సాప్ యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సెర్ట్-ఇన్ సూచించింది.
ఇటీవలే వాట్సాప్ వెబ్ వినియోగదారులను కూడా కేంద్ర సైబర్ విభాగం (ఐ4సీ) అప్రమత్తం చేసింది. బ్రౌజర్ ట్యాబ్‌ను మూసివేసినంత మాత్రాన వాట్సాప్ లాగౌట్ కాదని, నేరగాళ్లు చాటింగ్‌లను యాక్సెస్ చేసి మోసాలకు పాల్పడే ముప్పు ఉందని హెచ్చరించింది. పబ్లిక్ కంప్యూటర్లలో వాట్సాప్ వెబ్ వాడినప్పుడు మాన్యువల్‌గా లాగౌట్ అవ్వాలని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా సైబర్ దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు పిలుపునిచ్చారు.