డేటా అక్కర్లేదా?.. ఇకపై వాయిస్, ఎస్ఎంఎస్ ప్లాన్లు మాత్రమే తీసుకోవచ్చు!

Business
Advertisement
  • మొబైల్ డేటా వాడని యూజర్ల కోసం ట్రాయ్ కొత్త నిబంధనలు
  • వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ మాత్రమే ఉండే ప్లాన్లను అందించాలని ఆదేశం
  • జియో, ఎయిర్‌టెల్, వీఐ నుంచి అందుబాటులోకి వచ్చిన కొత్త ప్లాన్లు
  • ప్రతి నెలా ఒకే తేదీన రెన్యువల్ చేసుకునేలా క్యాలెండర్ నెల ప్లాన్ సౌకర్యం
  • డేటాతో కూడిన ప్లాన్ల కంటే తక్కువ ధరకే కొత్త ప్లాన్లు
మొబైల్ డేటా పెద్దగా అవసరం లేని వినియోగదారులకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఊరట కల్పించింది. కేవలం వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ సేవలు మాత్రమే కోరుకునే వారి కోసం ప్రత్యేక ప్లాన్లను అందుబాటులోకి తేవాలని టెలికాం సంస్థలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (వీఐ) వంటి ప్రధాన ఆపరేటర్లు డేటా ప్రయోజనం లేని కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టాయి.

సెప్టెంబర్ 22న ట్రాయ్ జారీ చేసిన సవరించిన నిబంధనల (TCPR 2026) ప్రకారం, టెలికాం కంపెనీలు తప్పనిసరిగా కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. డేటాతో కూడిన బండిల్డ్ ప్లాన్‌లతో పోలిస్తే, కేవలం వాయిస్, ఎస్ఎంఎస్ ప్లాన్‌ల ధర తక్కువగా ఉండాలని ట్రాయ్ స్పష్టం చేసింది. అంతేకాకుండా, ప్రతి నెలా ఒకే తేదీన రీఛార్జ్ పునరుద్ధరించుకునేలా కనీసం ఒక "క్యాలెండర్ మంత్ వ్యాలిడిటీ" ప్లాన్‌ను అందించాలని సూచించింది. ఈ ప్లాన్లను యాప్, వెబ్‌సైట్లలో సులభంగా గుర్తించేలా ప్రత్యేకంగా చూపాలని కూడా ఆదేశాల్లో పేర్కొంది.

ట్రాయ్ ఆదేశాల మేరకు కంపెనీలు పలు కొత్త ప్లాన్లను తమ యూజర్లకు అందుబాటులోకి తెచ్చాయి.
ఎయిర్‌టెల్: రూ.185 (28 రోజులు), రూ.203 (30 రోజులు), రూ.206 (క్యాలెండర్ నెల) వంటి ప్లాన్లను 'ఎయిర్‌టెల్ థ్యాంక్స్' యాప్‌లో పరిచయం చేసింది.
జియో: రూ.147 ప్రారంభ ధరతో వాయిస్/SMS ప్లాన్లను అందిస్తోంది.
వొడాఫోన్ ఐడియా (వీఐ): రూ.179, రూ.185, రూ.203, రూ.206 ధరలతో వాయిస్-ఓన్లీ ప్లాన్లను అందుబాటులో ఉంచింది.

అయితే, ఈ కొత్త నిబంధనల వల్ల ప్రస్తుతం ఉన్న 28 రోజుల ప్లాన్లు రద్దు కావని, వినియోగదారులకు అదనపు ఎంపికలు మాత్రమే అందుబాటులోకి వస్తాయని ట్రాయ్ స్పష్టత ఇచ్చింది. రీఛార్జ్ చేసుకునే ముందు, వినియోగదారులు తమకు వర్తించే సర్కిల్ ధరలు, ఎస్ఎంఎస్ పరిమితులను ఆయా టెలికాం యాప్‌లలో ఒకసారి సరిచూసుకోవడం మంచిది.
Advertisement

సంబంధిత వార్తలు

TRAITelecom Recharge PlansJio Airtel ViVoice Only PlansSMS Only PlansMobile Recharge News

More Telugu News

జడేజా, సిరాజ్‌లను ఎలా పక్కనబెడతారు? టీమిండియా సెలక్షన్స్‌పై మాజీ కెప్టెన్‌ విమర్శలు

27 Nov, 08:22

పార్లమెంట్‌లో మ్యాజిక్ ఫిగర్‌పై ఉత్కంఠ: డీఎంకే, ఎన్సీపీ, వైసీపీలే కీలకం.. లెక్కలు తేలేదెలా?

27 Nov, 08:07

స్మార్ట్ 2 EV: రూ.5 లక్షల ప్రచారంలో నిజమెంత?.. అసలు ధర తెలిస్తే షాకవుతారు!

27 Nov, 07:50

ఆర్టీసీ బస్సులో ఊహించని ఘటన.. 73 మంది ప్రాణాలను కాపాడిన ప్రయాణికుడు!

27 Nov, 07:33

అదొక్కటే మా పాలిట చెడ్డ రోజు.. ఓటమిపై కెప్టెన్ తిలక్ వర్మ కీలక వ్యాఖ్యలు

27 Nov, 07:19

పసిడి పతనం.. గోల్డ్ లోన్ మార్కెట్‌కు గండం!.. వేలం, రికవరీల వైపు సంస్థల చూపు

27 Nov, 07:02

భారత్-కివీస్ రెండో టెస్ట్.. అరంగేట్రంలోనే వికెట్ తీసిన బ్రార్

27 Nov, 06:46

పీటర్సన్ స్పీడ్ ఛాలెంజ్‌లో స్మృతి మంధాన విధ్వంసం.. 37 బంతుల్లోనే సెంచరీ!

27 Nov, 06:33

317 కొట్టినా దక్కని విజయం: రైజింగ్ స్టార్స్ సెమీస్‌లో భారత్‌కు షాక్.. ఫైనల్లోకి శ్రీలంక!

26 Nov, 22:48

త్వరలో 25 వేల సర్కారీ కొలువులు.. సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన

26 Nov, 22:35

నెలకు రూ.5 వేల నిరుద్యోగ భృతి.. రూ.5కే భోజనం.. 10 లక్షల కొలువులు: సమాజ్‌వాదీ పార్టీ మేనిఫెస్టో

26 Nov, 22:30

జాతీయ అవార్డుల జ్యూరీ ఛైర్మన్‌గా నందమూరి బాలకృష్ణ, సభ్యుడిగా అల్లు అరవింద్

26 Nov, 22:22

ముంబైలో రూ.1,500 క్యాబ్‌ ఛార్జీ రూ. 79కి తగ్గిందిలా.. ప్రయాణికుడి అదిరిపోయే ఐడియా

26 Nov, 22:11

మార్కెట్లోకి వివో ఎక్స్500 ఫ్లాగ్‌షిప్ సిరీస్: 200 ఎంపీ కెమెరా.. అదిరిపోయే ఫీచర్లు, ధరలివే!

26 Nov, 22:00
..More Telugu News