హైదరాబాద్‌లో విషాద ఘటన: సెప్టిక్ ట్యాంక్‌లో విషవాయువులు.. క్లీనింగ్ కు దిగి ముగ్గురు మృతి
- బాచుపల్లి దినేష్ ఆరిక్ అపార్ట్‌మెంట్‌లో ఘటన
- సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ చేస్తూ ముగ్గురు కార్మికులు మృతి
- విషవాయువులు పీల్చి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన వైనం
- మృతులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారిగా గుర్తింపు
- మృతదేహాలను బయటకు తీసిన హైడ్రా, ఫైర్ సిబ్బంది
హైదరాబాద్‌లోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ అపార్ట్‌మెంట్‌లోని సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు లోపలికి దిగిన ముగ్గురు కార్మికులు విషవాయువులు పీల్చి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
బాచుపల్లి పరిధిలోని ఏపీఆర్ ఎన్‌క్లేవ్, దినేష్ ఆరిక్ అపార్ట్‌మెంట్‌లో ఈ దుర్ఘటన జరిగింది. మృతులను శ్రీకాకుళం జిల్లాకు చెందిన పవన్ యల్లా (20), కె.షణ్ముఖరావు అలియాస్ సుమన్ (26), సురేష్ (24)గా గుర్తించారు. బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన ముగ్గురు యువకులు ఇలా అర్ధాంతరంగా మృతి చెందడంతో వారి కుటుంబాల్లో తీవ్ర శోకం అలుముకుంది.
దినేష్ ఆరిక్ అపార్ట్‌మెంట్ యాజమాన్య సంఘానికి, 'హెచ్‌ఆర్ ఇన్విరో' అనే ప్రైవేట్ కాంట్రాక్టు సంస్థకు మధ్య సెప్టిక్ ట్యాంక్ శుభ్రపరిచే పనులకు సంబంధించి ఒప్పందం ఉంది. అపార్ట్‌మెంట్ ప్రతినిధుల అభ్యర్థన మేరకు సదరు సంస్థ సిబ్బంది తరచూ ఇక్కడ క్లీనింగ్ పనులు నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా హెచ్‌ఆర్ ఇన్విరో సంస్థకు చెందిన ముగ్గురు కార్మికులు సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేయడానికి అపార్ట్‌మెంట్‌కు వచ్చారు. పని ప్రారంభించే క్రమంలో ఒకరి తర్వాత ఒకరు ట్యాంకు లోపలికి దిగారు. అయితే ట్యాంక్ లోపల తీవ్రమైన విషవాయువులు పేరుకుపోయి ఉండటంతో వారు ఊపిరాడక స్పృహతప్పి పడిపోయారు. ఎంతసేపటికీ వారు బయటకు రాకపోవడంతో తోటి సిబ్బంది, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురై పోలీసులకు, అత్యవసర విభాగాలకు సమాచారం అందించారు.
సమాచారం అందిన వెంటనే హైడ్రా ఎస్ఎఫ్ఓ శ్రీనివాస్ నేతృత్వంలోని డీఆర్ఎఫ్ (డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) బృందాలు, అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్యాంక్ లోపల దట్టమైన విషవాయువులు వ్యాపించి ఉండటంతో సహాయక చర్యలు క్లిష్టంగా మారాయి. అయినప్పటికీ హైడ్రా, ఫైర్ సిబ్బంది సంయుక్తంగా శ్రమించి, పాతాళకాంత వంటి ప్రత్యేక రెస్క్యూ పరికరాల సాయంతో ముగ్గురి మృతదేహాలను ట్యాంక్ నుంచి బయటకు తీశారు.
సెప్టిక్ ట్యాంక్‌లో నిల్వ ఉన్న ప్రమాదకరమైన విషపూరిత వాయువులను పీల్చడం వల్లే ఊపిరాడక వారు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. సమాచారం అందుకున్న బాచుపల్లి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఈ పనుల్లో భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.