సముద్రంలో గల్లంతైన కాకినాడ మత్స్యకారులు.. 10 రోజులుగా లభించని ఆచూకీ

Andhra
Advertisement
  • ఈ నెల 11న సముద్రంలో వేటకు వెళ్లిన సుబ్బంపేట వాసులు
  • నవంబర్ 14 తర్వాత కుటుంబ సభ్యులతో తెగిపోయిన ఫోన్ సంబంధాలు
  • గత 10 రోజులుగా ఆచూకీ లేకపోవడంతో కుటుంబాల్లో తీవ్ర ఆందోళన
కాకినాడ జిల్లాలో సముద్రంలో వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. గత 10 రోజులుగా వారి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో వారి ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

వివరాల్లోకి వెళితే... కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం సుబ్బంపేట గ్రామానికి చెందిన ఏడుగురు మత్స్యకారులు ఈ నెల 11న వేట నిమిత్తం బోటులో సముద్రంలోకి వెళ్లారు. వేటకు వెళ్లిన తర్వాత వారు నవంబర్ 14 వరకు ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ అందుబాటులోనే ఉన్నారు. అయితే ఆ తర్వాతి నుంచి వారి ఫోన్లు కలవకపోవడం, ఎలాంటి సమాచారం అందకపోవడంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.

నవంబర్ 14 తర్వాత వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, ఇప్పటివరకు తిరిగి రాకపోవడంతో దాదాపు 10 రోజులుగా మత్స్యకారుల పరిస్థితి ఏంటనేది తెలియరాలేదు. "ఈనెల 14 వరకు ఫోన్‌ ద్వారా మాతో అందుబాటులో ఉన్నారు. ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి సమాచారం లేదు" అని బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సముద్రంలో ప్రతికూల వాతావరణం వల్ల చిక్కుకున్నారా లేక బోటులో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తిందా అనే విషయాలు తెలియాల్సి ఉంది. రోజుల తరబడి ఆచూకీ లభించకపోవడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. తమ వారిని క్షేమంగా తీసుకురావాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

Kakinada fishermenMissing fishermenKakinada districtU KothapalliAndhra Pradesh fishermen

More Telugu News

గోదావరి పుష్కరాలు-2027: లోగో, ట్యాగ్‌లైన్ పోటీలు ప్రారంభం, బహుమతుల వివరాలివే

24 Nov, 17:12

వందే భారత్ రైలు ఎక్కేముందు ఇవి తప్పక తెలుసుకోండి.. వీడ్కోలు చెప్పేవారికి, సామాన్లు సర్దేవారికి అలర్ట్!

24 Nov, 17:05

ఆస్తులు తీసుకొని తల్లిదండ్రులను రోడ్డున పడేస్తే మూడేళ్ల జైలు: కేరళం సీఎం సంచలన నిర్ణయం

24 Nov, 17:01

ప్రతి హామీని నెరవేరుస్తున్నాం.. వృద్ధుల పెన్షన్ రూ. 4 వేలకు పెంచాం: గల్లా మాధవి

24 Nov, 16:47

బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం.. ఏపీలో రేపు కూడా వర్షాలు

24 Nov, 16:40

ఆకాశంలో నేడు అద్భుతం: రాత్రి 8:23 గంటలకు బీవర్ సూపర్‌మూన్.. ప్రత్యేకతలేంటో తెలుసా?

24 Nov, 16:39

లోన్ కాదు, ఈఎంఐ లేదు.. క్రెడిట్ కార్డులతోనే రూ. 85 లక్షల కారు కొన్నాడు!

24 Nov, 16:20

రూ.2.75 లక్షలకే 500సీసీ బైక్ తెచ్చిన హోండా.. పూర్తి ఫీచర్లు ఇవే!

24 Nov, 16:19

ఏపీలో ఈ రైల్వే లైన్ పూర్తయితే బెంగళూరుకు గంటన్నర సమయం ఆదా!

24 Nov, 16:18

రేణిగుంట ఆంజనేయస్వామి ఆలయం తొలగింపుపై రాజకీయ దుమారం.. ఆలయ పూజారి వివరణ

24 Nov, 16:18

బంతికి ఉమ్మి: శుభ్‌మన్ గిల్ విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఐసీసీ!

24 Nov, 16:12

తెలంగాణ మహిళలకు చిలకపచ్చ చీరలు.. ఈ నెల 26న ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి

24 Nov, 15:56

బౌల్ట్‌ను వదిలేసి అర్ష్‌దీప్‌ను తీసుకోవడం కరెక్టేనా?: ముంబయి ఇండియన్స్ మాస్టర్ ప్లాన్‌పై ఇర్ఫాన్ పఠాన్ విశ్లేషణ!

24 Nov, 15:53

ఆస్కార్ రేసులో మన సినిమా.. అర్హత సాధించిన 'గోంధళ్'

24 Nov, 15:49
..More Telugu News