రష్యాలో హైదరాబాద్ వ్యాపారి అరెస్టు.. కేంద్రం జోక్యం కోరుతున్న కుటుంబం

Telangana
Advertisement
  • వ్యాపారం కోసం రష్యా వెళ్లిన హైదరాబాద్ వ్యాపారి
  • నవంబర్ 2 నుంచి పోలీసుల అదుపులో ఉన్న ఆదిల్
  • అరెస్టుకు గల కారణాలపై అందని సమాచారం
  • విడిపించాలని కేంద్ర ప్రభుత్వానికి కుటుంబ సభ్యుల విజ్ఞప్తి
వ్యాపార నిమిత్తం రష్యాకు వెళ్లిన హైదరాబాద్‌ వ్యాపారవేత్తను అక్కడి పోలీసులు అరెస్టు చేయడం కలకలం సృష్టిస్తోంది. నవంబర్ 2వ తేదీ నుంచి జైలులోనే మగ్గుతుండటంతో, ఆయనను సురక్షితంగా విడిపించాలని బాధితుడి కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌ పాత మౌలాలీకి చెందిన మహమ్మద్ ఆదిల్ మొహియుద్దీన్ (36) కుషాయిగూడలో మెడికల్ స్టోర్ నిర్వహిస్తున్నారు. తన వ్యాపారాన్ని విస్తరించడంతో పాటు వైద్య పరికరాల కొనుగోలు నిమిత్తం అక్టోబర్ 26న ఆయన సందర్శక వీసాపై రష్యాకు వెళ్లారు. ఉల్యానోవ్స్క్ ప్రాంతంలోని ఒక హోటల్‌లో బస చేస్తున్న ఆదిల్‌ను నవంబర్ 2న స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను అక్కడి ప్రీ-ట్రయల్ డిటెన్షన్ సెంటర్‌కు తరలించినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.

అయితే, ఆదిల్‌ను ఏ కారణంతో అరెస్టు చేశారు? ఆయనపై మోపిన అభియోగాలు ఏమిటి? అనే విషయాలపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఆయన మొబైల్ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ రావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదిల్ కుటుంబ సభ్యులు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్‌కు లేఖ రాశారు.

మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ద్వారా రష్యా అధికారులతో సంప్రదింపులు జరిపి, అరెస్టుకు గల కారణాలను తెలుసుకోవాలని వారు కోరారు. ఆదిల్‌కు అవసరమైన న్యాయ సహాయం అందించడంతో పాటు, ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం దౌత్యపరంగా జోక్యం చేసుకుని, తమ కుటుంబ సభ్యుడిని సురక్షితంగా భారత్‌కు తీసుకురావాలని వారు వేడుకుంటున్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

Mohammed Adil MohiuddinHyderabad businessman arrested in RussiaIndian Embassy MoscowS Jaishankar External Affairs MinistryRussia Pre Trial Detention CenterMedical equipment business trip

More Telugu News

లక్షల డాలర్లకు ఆశపడి.. దేశ రహస్యాలు అమ్మేసిన చైనా అధికారికి మరణశిక్ష!

24 Nov, 07:32

కృష్ణా నీళ్ల పంచాయితీ.. రేవంత్‌పై కవిత ఫైర్

24 Nov, 07:19

రూ.1.27 కోట్ల ప్యాకేజీ.. పెళ్లికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తిప్పలు!

24 Nov, 07:16

26న తిరుమలలో సీఎం చంద్రబాబు పర్యటన

24 Nov, 07:00

కృష్ణా జలాలను బీఆర్ఎస్ ఏపీకి తాకట్టు పెట్టింది.. 2022 జీవోను బయటపెట్టిన రేవంత్

24 Nov, 06:57

ఎలాన్ మస్క్ ఏఐ 'గ్రోక్'పై దావా.. అశ్లీల చిత్రాలు సృష్టిస్తోందని ఆరోపణ

24 Nov, 06:51

హింస వీడండి, జనజీవనంలో కలవండి: మావోయిస్టు అగ్రనేతలకు డీజీపీ పిలుపు

24 Nov, 06:44

పుణ్య పరీక్షలో ఫెయిల్!.. ఏనుగు విగ్రహం కింద ఇరుక్కుపోయిన భక్తుడు.. వైరల్ వీడియో

24 Nov, 06:38

500 ప్రాజెక్టులను ఓడించిన తెలంగాణ పదో తరగతి బాలికల స్మార్ట్ హెల్మెట్

24 Nov, 06:24

హైదరాబాద్‌లో 'ట్రాఫిక్ రద్దీ ఛార్జీలు'?.. ఐటీ కారిడార్‌లో పైలట్ ప్రాజెక్టు?

24 Nov, 06:19

దుబాయ్‌లో చీరకట్టులో సైక్లింగ్, రన్నింగ్ చేసిన మహిళా వ్యాపారవేత్త.. నెటిజన్ల ప్రశంసలు

23 Nov, 23:20

క్లీంకారను స్కూల్‌లో చేర్పించిన రామ్ చరణ్, ఉపాసన దంపతులు.. వీడియో వైరల్

23 Nov, 23:07

షేవింగ్ చేసుకుంటుండగా నీళ్లు బంద్.. దేశాధ్యక్షుడి భవనంలోనూ తప్పని తిప్పలు

23 Nov, 22:54

అంతర్జాతీయ మార్కెట్లలో జోరు.. భారీగా లాభపడిన పసిడి, వెండి

23 Nov, 22:54
..More Telugu News