పల్నాడులో భారీ హింసకు ప్లాన్.. బాలకృష్ణ పీఏ శ్రీనివాసరావు అరెస్ట్.. మొత్తం 66 మందిపై కేసులు
Advertisement
- పల్నాడు జిల్లాలో పంచాయతీ నామినేషన్ల వేళ హింసకు కుట్ర
- 22 కార్లు, 60 కర్రలు, 4 కత్తులను స్వాధీనం చేసుకున్న పోలీసులు
- టీడీపీలోని వర్గపోరే కారణమని వెల్లడించిన నరసరావుపేట ఏఎస్పీ
ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురిచేసేందుకు పన్నిన భారీ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామంలో ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి 66 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 22 కార్లు, 4 వేటకొడవళ్లు, 60 కర్రలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం.. తిమ్మాపురంలో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు నామినేషన్లు దాఖలు చేసేందుకు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత సహాయకుడు (పీఏ), స్థానిక టీడీపీ నేత పావులూరి శ్రీనివాసరావు వర్గీయులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ప్రత్యర్థి వర్గాన్ని బెదిరించేందుకు వీరు కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు. నరసరావుపేట ఏఎస్పీ హనుమంతరావు తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు నుంచి సుమారు 100 మందిని 22 కార్లలో ఎలాంటి అనుమతి లేకుండా శ్రీనివాసరావు తిమ్మాపురం గ్రామానికి తీసుకువచ్చారు.
స్థానికంగా ఉన్న ఒక కంపెనీలో వారికి మద్యం, భోజన వసతి కల్పించి, అనంతరం కొందరికి మారణాయుధాలు, కర్రలు ఇచ్చి సిద్ధం చేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే రంగంలోకి దిగి వాహనశ్రేణిని అడ్డగించారు. మొత్తం 66 మందిని అదుపులోకి తీసుకుని నాదెండ్ల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గ్రామంలో టీడీపీలోని వర్గ విభేదాల కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుందని ఏఎస్పీ పేర్కొన్నారు. నిందితులపై హత్యాయత్నం కేసులు నమోదు చేస్తున్నామని, పరారీలో ఉన్న మిగతా వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.