ఆన్‌లైన్‌లో యాంటీ డ్రోన్ గన్ విక్రయం.. ఎయిర్‌వన్ రోబోటిక్స్ కు రూ.10 లక్షల జరిమానా

Business
Advertisement
  • ఎయిర్‌వన్ రోబోటిక్స్ సంస్థపై సీసీపీఏ సీరియస్
  • ఇండియామార్ట్ ప్లాట్‌ఫామ్‌లో అనుమతులు లేకుండా యాంటీ డ్రోన్ గన్ విక్రయానికి యత్నం
  • రూ.8.3 లక్షల ధరకు ఇన్‌స్టాక్ అంటూ పూర్తి వివరాలు పొందుపరిచిన కంపెనీ
  • డమ్మీ పరికరమంటూ సంస్థ చెప్పిన వాదనను తిరస్కరించిన రెగ్యులేటర్
  • చట్టబద్ధ నిబంధనలు పాటిస్తూ 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం
ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఇండియామార్ట్‌లో ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా యాంటీ డ్రోన్ గన్‌ను అమ్మకానికి ఉంచిన ఎయిర్‌వన్ రోబోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) కఠిన చర్యలు చేపట్టింది. వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తూ, అనుచిత వాణిజ్య విధానాలకు పాల్పడినందుకు గాను ఆ సంస్థకు రూ.10 లక్షల జరిమానా విధించింది.

ఎయిర్‌వన్ రోబోటిక్స్ సంస్థ "యాంటీ డ్రోన్ గన్ VKSP03-PRO" అనే పరికరాన్ని ఇండియామార్ట్‌లో రూ.8.3 లక్షల ధరకు లిస్ట్ చేసింది. దీనికి సంబంధించి పూర్తి సాంకేతిక వివరాలను జోడించడంతో పాటు, 'ఇన్ స్టాక్' (అందుబాటులో ఉంది) అని పేర్కొంది. చట్టపరమైన నిబంధనలు పాటించకుండా, నియంత్రణలు ఉన్న ఇలాంటి పరికరాలను ప్రచారం చేయడం వినియోగదారుల హక్కులను ఉల్లంఘించడమేనని సీసీపీఏ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

అయితే, తాము ప్రదర్శించిన పరికరం కేవలం డమ్మీ మాత్రమేనని, అసలైన వినియోగానికి ఉద్దేశించినది కాదని ఎయిర్‌వన్ రోబోటిక్స్ వాదించింది. ఈ వివరణను సీసీపీఏ పూర్తిగా తోసిపుచ్చింది. షోకాజ్ నోటీసు ఇచ్చిన తర్వాతే సంస్థ ఈ మాట చెబుతోందని, లిస్టింగ్‌లో పేర్కొన్న వివరాలకు, సంస్థ ఇచ్చే వివరణకు పొంతన లేదని తేల్చింది. ఆ ఉత్పత్తిని విక్రయించారా లేదా అనేదానితో సంబంధం లేకుండా, తప్పుడు ప్రకటనలు ఇచ్చి వినియోగదారులను గందరగోళానికి గురిచేసినందుకు బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేసింది.

జామర్లు, ఇతర టెలికాం పరికరాలకు సంబంధించి కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ మార్గదర్శకాలను పాటించకపోవడం నేరమని రెగ్యులేటర్ పేర్కొంది. భవిష్యత్తులో ఇచ్చే ప్రకటనలన్నీ చట్టబద్ధంగా ఉండాలని, తప్పుడు సమాచారం ఇవ్వకూడదని స్పష్టం చేస్తూ, 15 రోజుల్లోగా అమలు నివేదికను సమర్పించాలని ఎయిర్‌వన్ రోబోటిక్స్‌ను ఆదేశించింది.
Advertisement

సంబంధిత వార్తలు

AirOne RoboticsAnti Drone Gun SaleCCPA FineIndiaMART Online SaleCentral Consumer Protection AuthorityDrone Gun Penalty

More Telugu News

యలహంక ప్యాలెస్ కు వెళ్లకుండా షర్మిలను అడ్డుకున్న పోలీసులు... వీడియో ఇదిగో!

22 Nov, 20:06

ఏసీసీ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్: దంచికొట్టిన పాక్ బ్యాటర్లు.. భారత్ ముందు భారీ టార్గెట్

22 Nov, 19:53

కాలేజీ లిఫ్ట్‌లో రాత్రంతా చిక్కుకున్న విద్యార్థిని.. 12 గంటల తర్వాత గుర్తించారు!

22 Nov, 19:40

"అలెక్స్, ఎక్కడున్నావు?".. ఎగిరిపోయిన చిలుక కోసం ఓ కుటుంబం ఆవేదన!

22 Nov, 19:32

ఆంధ్రప్రదేశ్‌లో లీగల్ ఏఐ ప్లాట్‌ఫామ్.. రైల్‌టెల్‌కు కీలక ప్రాజెక్ట్

22 Nov, 19:24

దేశంలో 13 కోట్ల ఓట్లు తొలగించారు: కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలన్న రేవంత్ రెడ్డి

22 Nov, 19:20

స్విట్జర్లాండ్‌లో సాహసోపేతంగా ల్యాండైన ఖతార్ రాజకుటుంబ విమానం.. 'క్రాబ్ అప్రోచ్'తో విమానాన్ని దించిన పైలట్లు

22 Nov, 19:11

ముగియనున్న జేఈఈ మెయిన్ రిజిస్ట్రేషన్ గడువు.. 13 లక్షలు దాటిన దరఖాస్తులు

22 Nov, 19:05

సిరాజ్ కు తుదిజట్టులో దక్కని చోటు.. సొంత పార్టీ నేతకు కాంగ్రెస్ నేత ముంతాజ్ పటేల్ కౌంటర్

22 Nov, 19:01

సత్యసాయి జిల్లాలో ఆసక్తికర పరిణామం.. తనను ఏకగ్రీవ సర్పంచ్ చేస్తే రూ.1.5 కోట్లు ఇస్తానన్న స్వామీజీ

22 Nov, 18:39

నాలుగోసారి.. కార్ల ధరలు మళ్లీ పెంచిన మారుతి!

22 Nov, 18:20

బంగారం కొనుగోళ్లు వాయిదా వేయాలన్న మోదీ సలహాకు వ్యాపార సంఘం కృతజ్ఞతలు.. కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలన్న బీజేపీ

22 Nov, 18:06

బెంగళూరు చేరుకున్న షర్మిల.. యలహంక ప్యాలెస్ వద్ద పోలీసుల మోహరింపు

22 Nov, 17:54

బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్.. ఏది ఏ సమయంలో తినాలి? నిపుణులు చెబుతున్నదేమిటి?

22 Nov, 17:43
..More Telugu News