'ఆపరేషన్ సిందూర్' వేళ పాక్‌కు చైనా రహస్య సాయం.. అమెరికా నివేదికలో బండారం బట్టబయలు!
Advertisement
- భారత్ ఎదుగుదలను అడ్డుకునేందుకే పాక్‌కు చైనా సాయం చేసిందన్న యూఎస్ ప్యానెల్
- ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ యుద్ధ విమానాలకు చైనా సాంకేతిక మద్దతు
- భారత సరిహద్దు మోహరింపుల సమాచారాన్ని పాక్‌కు చేరవేసిన వైనం
- రెండు వైపుల నుంచి ఒకేసారి ముప్పు పొంచి ఉందని కమిషన్ హెచ్చరిక
- భారత్‌తో నిఘా, రక్షణ భాగస్వామ్యాన్ని పెంచుకోవాలని అమెరికా ప్రభుత్వానికి సిఫార్సు
భారత్ ఎదుగుదలను అణచివేసే కుట్రలో భాగంగానే 'ఆపరేషన్ సిందూర్' సమయంలో పాకిస్థాన్‌కు చైనా సైనిక సాయం అందించిందని అమెరికా కాంగ్రెస్ కమిషన్ తన తాజా నివేదికలో కుండబద్దలు కొట్టింది. సరిహద్దుల్లో సైనిక ఒత్తిడి పెంచడం, పారిశ్రామిక సరఫరాలపై ఆంక్షలు విధించడం ద్వారా భారత్‌ను కట్టడి చేసేందుకు బీజింగ్ ప్రయత్నిస్తోందని అమెరికా-చైనా ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ రివ్యూ కమిషన్ వెల్లడించింది. ఆసియాలో చైనాకు ప్రత్యామ్నాయ శక్తిగా భారత్ ఎదుగుతోందని, దీనిని అడ్డుకునేందుకే చైనా బహుముఖ వ్యూహాలను రచిస్తోందని పేర్కొంది.
గత ఏడాది పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య జరిగిన నాలుగు రోజుల ఘర్షణల్లో చైనా నేరుగా యుద్ధంలోకి దిగకుండానే పాకిస్థాన్‌ను బలోపేతం చేసిందని నివేదిక స్పష్టం చేసింది. పాక్ వాయుసేన ఉపయోగించిన జే-10సీఈ యుద్ధ విమానాల పూర్తి స్థాయి వినియోగానికి తమ ఇంజనీర్లు అక్కడే ఉండి సాంకేతిక సహకారం అందించారని చైనా స్వయంగా అంగీకరించిన విషయాన్ని కమిషన్ ప్రస్తావించింది. భారత్ మోహరింపులకు సంబంధించిన సమాచారాన్ని కూడా చైనా ఎప్పటికప్పుడు పాక్‌కు చేరవేసిందని తెలిపింది. భవిష్యత్‌లో రెండు వైపుల నుంచి ఒకేసారి ముప్పు (టూ-ఫ్రంట్ వార్) ఎదురయ్యే ప్రమాదం దీనివల్ల భారత్‌కు మరింత పెరుగుతోందని హెచ్చరించింది.
మరోవైపు భారత్‌పై చైనా ఆర్థిక అస్త్రాన్ని కూడా ప్రయోగిస్తోందని నివేదిక స్పష్టం చేసింది. భారత ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాన్ని దెబ్బతీసేందుకు ముడిసరకుల ఎగుమతులను ఆపడం, తమ ఇంజనీర్లను వెనక్కి పిలిపించడం వంటి చర్యలకు దిగుతోందని తెలిపింది. భారత ఫార్మా, క్లీన్ ఎనర్జీ రంగాలు పుంజుకోకుండా చైనా తక్కువ ధరల వ్యూహాలను, బ్యాటరీ టెక్నాలజీ ఆంక్షలను అమలు చేస్తోందని విశ్లేషించింది. ఈ వ్యూహాలను దీటుగా ఎదుర్కొనేందుకు భారత్ తన రక్షణ రంగాన్ని ఆధునికీకరిస్తూనే దేశీయ తయారీకి పెద్దపీట వేస్తోందని, అమెరికా కూడా భారత్‌తో నిఘా, సముద్ర భద్రత, తయారీ రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించాలని ఈ కమిషన్ పిలుపునిచ్చింది.