ఏపీలో రెండు నకిలీ వర్సిటీలు.. దేశవ్యాప్తంగా 32 ఫేక్ యూనివర్సిటీలపై యూజీసీ బాంబు!

National
Advertisement
  • క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ వర్సిటీకి అనుమతులు లేవు
  • బైబిల్ ఓపెన్ వర్సిటీ ఆఫ్ ఇండియా కూడా ఫేక్
  • అత్యధికంగా ఢిల్లీలోనే 12 దొంగ వర్సిటీలు
  • అడ్మిషన్ల ముందు గుర్తింపు తనిఖీ చేయాలని సూచన
ఉన్నత చదువులు చదివి బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలనుకునే విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా గుర్తింపు లేకుండా నడుస్తున్న 32 నకిలీ విశ్వవిద్యాలయాల జాబితాను విడుదల చేసిన యూజీసీ, ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రెండు సంస్థలను కూడా ఫేక్ వర్సిటీలుగా తేల్చింది. 

ఏపీలోని 'క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ', 'బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా'లకు ఎలాంటి అధికారిక గుర్తింపు లేదని స్పష్టం చేసింది. తెలంగాణలో ప్రస్తుతం ఎలాంటి నకిలీ వర్సిటీలు జాబితాలో లేనప్పటికీ, తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఇతర ప్రాంతాల్లో ప్రవేశాలు పొందే సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని కమిషన్ సూచించింది.

దేశవ్యాప్తంగా నకిలీ విశ్వవిద్యాలయాల జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ ఏకంగా 12 నకిలీ సంస్థలతో అగ్రస్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్‌లో నాలుగు వర్సిటీలు ఫేక్‌గా తేలాయి. యూజీసీ చట్టం 1956 ప్రకారం అధికారం లేని సంస్థలు ప్రదానం చేసే డిగ్రీలు ఉన్నత చదువులకు గానీ, ప్రభుత్వ-ప్రైవేట్ ఉద్యోగాలకు గానీ ఎంతమాత్రం చెల్లవని కమిషన్ తేల్చిచెప్పింది. ఏవైనా విద్యాసంస్థల్లో చేరే ముందు వాటి చట్టబద్ధమైన గుర్తింపు, యూజీసీ నిబంధనల ప్రకారం డిగ్రీలు ఇచ్చే అధికారం ఉందా లేదా అన్నది అధికారిక వెబ్‌సైట్ ద్వారా క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచించింది.

ఢిల్లీ

  • మౌంటెన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ టెక్నాలజీ
  • వరల్డ్ పీస్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ
  • ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ ఇంజినీరింగ్
  • నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్
  • ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్ స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీ
  • కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్
  • యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ
  • వొకేషనల్ యూనివర్సిటీ
  • ఏడీఆర్-సెంట్రిక్ జ్యురిడికల్ యూనివర్సిటీ
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్
  • విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్
  • ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయ
ఉత్తరప్రదేశ్
  • గాంధీ హిందీ విద్యాపీఠ్, ప్రయాగ్‌రాజ్
  • నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఓపెన్ యూనివర్సిటీ
  • భారతీయ శిక్షా పరిషత్
  • మహామాయ టెక్నికల్ యూనివర్సిటీ
కర్ణాటక

  • గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ
  • సర్వ భారతీయ శిక్షా పీఠ్
కేరళ
  • ఇంటర్నేషనల్ ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ ప్రొఫెటిక్ మెడిసిన్
  • సెయింట్ జాన్స్ యూనివర్సిటీ, కిషనట్టం

Advertisement

సంబంధిత వార్తలు

UGCFake Universities List 2024Andhra Pradesh Fake UniversitiesUGC Warning for StudentsIllegal Educational Institutions IndiaBible Open University of India

More Telugu News

పసిడి ధరలకు భారీ బ్రేక్.. బంగారం మళ్లీ రూ.1 లక్షకు వస్తుందా?

20 Nov, 21:53

రైళ్లలో ఫోన్లో గట్టిగా మాట్లాడితే జైలు శిక్ష.. కఠిన నిబంధనలు తెచ్చిన రైల్వే

20 Nov, 21:47

ఏఐ తెచ్చిన తంటా.. డిసెంబరు నాటికి స్మార్ట్‌ఫోన్ల ధరలు 30 శాతం పైకి!

20 Nov, 21:24

23 ఏళ్ల కుర్రాడి ఏఐ కంపెనీ రూ.40 వేల కోట్లకు సేల్.. ఎవరీ భారత సంతతి స్టార్టప్ హీరో యశ్ పాటిల్?

20 Nov, 21:09

డైరెక్టర్‌గా హిట్ కొట్టాడు.. లైఫ్‌లో సెటిలై కోరుకున్న అమ్మాయిని పెళ్లాడిన జబర్దస్త్ బాబు

20 Nov, 21:04

హాల్‌మార్క్ బంగారం స్వచ్ఛమేనా? రీనియం కల్తీపై బీఐఎస్‌కు ఐబీజేఏ ఫిర్యాదు

20 Nov, 20:56

'తులాభారం' నుంచి క్రేజీ అప్‌డేట్.. కృష్ణవేణిగా ప్రియాంక మోహన్ లుక్ చూశారా?

20 Nov, 20:41

తెలంగాణలో బీజేపీ అసలైన ఆట మొదలైంది: కిషన్‌ రెడ్డి

20 Nov, 20:26

తాజ్‌మహల్, దర్గా చూస్తానన్న పాక్ మంత్రి.. దిమ్మతిరిగే షాకిచ్చిన మోదీ సర్కార్!

20 Nov, 20:15

మెస్సీని తీసుకొచ్చాం.. త్వరలో రొనాల్డోను రప్పిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

20 Nov, 20:10

ఫైనల్‌ ఆడకుండానే పాక్‌కు ట్రోఫీ.. ఆసియా కప్‌ ప్రజెంటేషన్‌ను బాయ్‌కాట్‌ చేసిన భారత అంధుల క్రికెట్‌ జట్టు

20 Nov, 20:02

అర్నబ్, మురసు తుపానుల విధ్వంసం.. ఉద్యాన పంటల పునరుద్ధరణకు రూ.96 కోట్ల సాయం కోరిన సీఎం చంద్రబాబు

20 Nov, 19:46

మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కిమ్స్‌కు కొనకళ్ల నారాయణ తరలింపు

20 Nov, 19:44

ఏపీలో చిన్న అణు రియాక్టర్లతో విద్యుత్: ఎస్ఎంఆర్ సాంకేతికతపై ప్రభుత్వ దృష్టి

20 Nov, 19:30
..More Telugu News