హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్ నివాసం వద్ద కలకలం

Both States
Advertisement
  • పవన్ కల్యాణ్ ఇంటి ముందు బిల్డర్ ఆత్మహత్యాయత్నం
  • అప్పులు తీర్చాలంటూ ప్లెక్సీతో నిరసన
  • అడ్డుకున్న బౌన్సర్‌పై దాడికి యత్నం
  • కత్తితో తనను తాను గాయపరుచుకున్న వ్యక్తి
  • బౌన్సర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాసం వద్ద ఓ బిల్డర్ హల్‌చల్ సృష్టించాడు. అప్పుల బాధతో ఉన్న తనను ఆదుకోవాలని కోరుతూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివ‌రాల‌ ప్రకారం.. ఖమ్మం జిల్లా బల్లేపల్లికి చెందిన బట్టు సుచేతన్ ఠాకూర్ నాయక్ అనే వ్యక్తి వృత్తిరీత్యా బిల్డర్. అతను ఈ నెల 18న జూబ్లీహిల్స్‌లోని పవన్ కల్యాణ్ ఇంటి వద్దకు వచ్చాడు. తనకున్న అప్పులు తీర్చడానికి ఆర్థిక సాయం చేయాలని కోరుతూ ఓ ప్లెక్సీని ప్రదర్శిస్తూ నిరసనకు దిగాడు. ఆదుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు.

అక్కడ విధుల్లో ఉన్న బౌన్సర్ రాంశెట్టి రాజీవ్ కుమార్ అతడిని అడ్డుకునే ప్రయత్నం చేయగా, సుచేతన్ అతనిపై దాడికి ప్రయత్నించాడు. ఆ తర్వాత తన వెంట తెచ్చుకున్న కత్తితో తన ఛాతీ, చేతులపై కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అప్రమత్తమైన బౌన్సర్, సుచేతన్ వద్ద నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై బౌన్సర్ రాంశెట్టి రాజీవ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

Pawan KalyanJubilee Hills HyderabadSuchethan Thakur NayakSuicide attemptAP Deputy CM residenceKhammam builder

More Telugu News

జడ్పీ పీఠాలపై కొలిక్కివచ్చిన కూటమి లెక్కలు.. నేడే ఎన్నిక

20 Nov, 09:24

పోలీసుల ఎన్‌కౌంటర్‌లో డి-కంపెనీ గ్యాంగ్‌స్టర్ హతం

20 Nov, 09:15

ఇంటి రుణ వసూలుకు ముందు కొనుగోలుదారు బాధ్యతను తేల్చాలి: సుప్రీంకోర్టు

20 Nov, 09:06

జడ్పీ పీఠాలకు నేడే ఎన్నిక.. టీడీపీ అభ్యర్థుల జాబితా విడుదల!

20 Nov, 08:51

రైల్వేలో 2,800కి పైగా అప్రెంటిస్ పోస్టులు.. పరీక్ష లేకుండానే ఎంపిక!

20 Nov, 08:47

విశాఖలో ‘బే-టెక్ సిటీ’.. సైబరాబాద్ తరహాలో అభివృద్ధికి సీఎం ఆదేశం

20 Nov, 08:41

కాంగ్రెస్‌లో భారీ ప్రక్షాళన.. ఏపీ, తెలంగాణలకు కొత్త కార్యదర్శులు

20 Nov, 08:38

డిసెంబర్‌లో విదేశాలకు మంత్రి లోకేశ్

20 Nov, 08:33

టెక్ వైఫల్యాల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌ను తొలగించిన ట్రంప్

20 Nov, 08:26

కొవ్వు కరుగుతుంది, కండరం కాదు.. ఊబకాయ చికిత్సలో కొత్త ఆశలు!

20 Nov, 08:11

అణుయుద్ధం వద్దు.. ఉమ్మడి ప్రకటన విడుదల చేసిన ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్

20 Nov, 08:06

కెప్టెన్సీ దక్కలేదనే అసంతృప్తి.. రాజస్థాన్ రాయల్స్‌కు జైస్వాల్ గుడ్ బై?

20 Nov, 08:02

సొంత ఎమ్మెల్యేలకు పిచ్చికుక్కలు కరిచాయా?.. రేవంత్ రెడ్డి ఫైర్

20 Nov, 07:52

తొలి టెస్టు: 368 పరుగులకు న్యూజిలాండ్ ఆలౌట్

20 Nov, 07:46
..More Telugu News