రెనియం పౌడర్ తో బంగారం కల్తీ.. సాధారణ పరీక్షలకు దొరకదు!
Advertisement
- బంగారంలో రెనియం పౌడర్ కలిపి హాల్‌మార్క్ పొందుతున్న వైనం వెలుగులోకి
- సాధారణ ఎక్స్‌ఆర్‌ఎఫ్ స్వచ్ఛత పరీక్షల్లోనూ బయటపడని కల్తీ లోహం
- జోధ్‌పూర్‌లో జరిపిన ప్రయోగంలో 20 క్యారెట్ల బంగారం 22 క్యారెట్లుగా గుర్తింపు
- చైనా నుంచి గుట్టుచప్పుడు కాకుండా సరఫరా అవుతున్న రెనియం పౌడర్
- బంగారం ధర రూ.1.5 లక్షలు ఉంటే తులంపై దాదాపు రూ.14,700 నష్టం
బంగారంలో సరికొత్త కల్తీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పసిడి ఆభరణాల్లో 'రెనియం' అనే లోహపు పొడిని కలిపితే సాధారణ స్వచ్ఛత పరీక్షల్లో అది బయటపడటం లేదని, సులభంగా 22 క్యారెట్ల హాల్‌మార్క్ కూడా లభిస్తోందని తాజాగా తేలింది.
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో నిర్వహించిన ఓ పరిశీలనలో ఈ మోసం బయటపడింది. 7.830 గ్రాముల 24 క్యారెట్ల బంగారంలో 1 గ్రాము రెనియం పౌడర్‌తో పాటు 0.75 గ్రాముల ఇతర లోహాన్ని కలిపి మొత్తం 9.580 గ్రాముల ఆభరణాన్ని తయారు చేశారు. దీనిని పరీక్షా కేంద్రాలు, బ్రాండెడ్ షోరూమ్‌లలో పరీక్షించగా.. 22 క్యారెట్ల (916) హాల్‌మార్క్ ఇచ్చేశారు. ఓ మెషీన్ పరీక్షలో 93.70 శాతం బంగారం, 5.39 శాతం వెండి ఉన్నట్లు తేలింది తప్ప రెనియం ఉనికి బయటపడలేదు. అయితే వాస్తవానికి ఆ ఆభరణంలో అసలైన బంగారం కేవలం 81.7 శాతం (దాదాపు 20 క్యారెట్లు) మాత్రమే ఉంది.
రెనియం సాంద్రత (దాదాపు 21 g/cm³) బంగారం సాంద్రత (19.3 g/cm³) కంటే ఎక్కువగా ఉండటంతో సాధారణ డెన్సిటీ, ఎక్స్‌ఆర్‌ఎఫ్ (XRF) పరీక్షల్లో ఇది పట్టుబడటం లేదు. చైనాలోని షెన్‌జెన్ కేంద్రంగా సాగుతున్న సరఫరా ద్వారా ముంబై ఏజెంట్ల సాయంతో ఈ పౌడర్ మార్కెట్లోకి వస్తున్నట్లు తెలిసింది. గతంలో ఇండోర్ సరాఫా బజార్ వంటి ప్రాంతాల్లో రుథీనియం, ఇరీడియం, ఆస్మియం వంటి లోహాలతోనూ ఇలాంటి మోసాలు జరిగాయి.
ఈ కల్తీ వల్ల కొనుగోలుదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. బంగారం ధర రూ.1.5 లక్షలు ఉన్నప్పుడు, తులం (దాదాపు 11.66 గ్రాములు) నగలపై దాదాపు రూ.14,700 వరకు నష్టం వాటిల్లుతుందని అంచనా. యాసిడ్, గీత పరీక్షలు లేదా సాధారణ ఎక్స్‌ఆర్‌ఎఫ్ ద్వారా దీనిని గుర్తించలేమని, అధునాతన ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ లేదా ఫైర్ అస్సే పరీక్షల ద్వారానే ఈ కల్తీని పట్టుకోగలమని నిపుణులు చెబుతున్నారు. దీంతో హాల్‌మార్క్ ఉన్నంత మాత్రాన పూర్తి నమ్మకం లేని పరిస్థితి ఏర్పడింది.