అక్వాన్ ఎఫెక్ట్.. నెల్లూరులో 200 మీటర్లు ముందుకొచ్చిన సముద్రం

Andhra
Advertisement
  • బంగాళాఖాతంలో కొనసాగుతున్న 'అక్వాన్' తుపాను
  • సాయంత్రానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం
  • విశాఖకు 670 కి.మీ, మచిలీపట్నానికి 660 కి.మీ దూరంలో కేంద్రీకృతం
  • గడిచిన 6 గంటల్లో గంటకు 3 కిలోమీటర్ల వేగంతో కదలిక
  • కృష్ణపట్నం పోర్టులో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ
దక్షిణ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన 'అక్వాన్' తుపాను మరింత బలపడుతోంది. గడిచిన ఆరు గంటల్లో గంటకు 3 కిలోమీటర్ల వేగంతో కదిలిన ఈ తుపాను, మంగళవారం సాయంత్రానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ వెల్లడించారు. ప్రస్తుతానికి ఇది చెన్నైకి 610 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 660 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 670 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 790 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ముంచుకొస్తున్న తుపాను ముప్పును దృష్టిలో ఉంచుకుని రైతులు వ్యవసాయ పనుల్లో ముందస్తు జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరించారు.

తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లా తీరంలో సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారింది. గంటగంటకూ అలల ఉద్ధృతి పెరుగుతోంది. పలుచోట్ల సముద్రపు నీరు 50 మీటర్ల నుంచి 200 మీటర్ల వరకు ముందుకు చొచ్చుకువచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు సముద్రంలోకి చేపలవేటను తక్షణమే నిలిపివేశారు. జువ్వలదిన్నె హార్బర్‌లో 80కి పైగా మరబోట్లను సురక్షితంగా లంగరు వేశారు. తీర ప్రాంతంలో కృష్ణపట్నం పోర్టులో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికార యంత్రాంగం పటిష్ఠ రక్షణ చర్యలు చేపట్టింది. మరోవైపు ఈ తుపాను వర్షాలతో సోమశిల, కండలేరు జలాశయాలు నిండితే తాగు, సాగునీటి కష్టాలు తీరుతాయని స్థానిక ప్రజలు ఆశిస్తున్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

Cyclone AkwanNellore Sea SurgeAndhra Pradesh Cyclone AlertBay of Bengal StormKrishna Patnam PortAP Disaster Management

More Telugu News

తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ అందిస్తే చెట్టాపట్టాల్ అంటారా?: షర్మిల

17 Nov, 16:15

తెలంగాణ ఇచ్చింది సోనియమ్మే అయితే.. ఆత్మకథలో ఎందుకు రాయలేదు?: కేటీఆర్

17 Nov, 16:03

అశ్విన్ విశ్లేషణ అక్షరాలా నిజమైంది.. ధోనీ రిటైర్మెంట్‌పై మాజీ స్పిన్నర్ ఊహించినట్లే జరిగింది!

17 Nov, 15:59

సమ్మక్క సాగర్‌ బ్యారేజీకి ఎన్‌ఓసీ ఇవ్వండి: ఛత్తీస్‌గఢ్‌ సీఎంకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

17 Nov, 15:49

ఐఫోన్ డ్యూయో కోసం కొత్త ఫీచర్లు.. యాపిల్ నుంచి సూపర్ అప్‌డేట్!

17 Nov, 15:48

భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో కీలక మార్పులు.. ఆ కంటెంట్‌కు చెక్!

17 Nov, 15:35

మనిషి మొహంలో పిల్లి రూపం కనిపిస్తోంది: బ్రెయిన్ సర్జరీ తర్వాత యువకుడికి వచ్చిన వింత వ్యాధి!

17 Nov, 15:30

'ప్రేమద ఊరలి' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

17 Nov, 15:26

ఐపీఎల్ కు గుడ్ బై చెప్పిన ధోనీ.. ఇది కూడా కూల్ గా చెప్పేశాడు!

17 Nov, 15:24

మహీంద్రా ఎలక్ట్రిక్ కారు సరికొత్త రికార్డ్.. భారత్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టుల్లో 5-స్టార్ రేటింగ్

17 Nov, 15:03

చిన్న గొడవకే ప్రాణం తీశారు.. భద్రాచలం లాడ్జిలో యువకుడి హత్య!

17 Nov, 14:59

అమెరికా గడ్డపైనే ‘డర్టీ బాంబ్’ బ్లాస్ట్?.. వాషింగ్టన్‌ను వణికిస్తున్న ఇరాన్ మాస్టర్ ప్లాన్!

17 Nov, 14:56

అమెరికాలో నిలిచిన బ్యాంకింగ్ లావాదేవీలు... కారణం ఇదే!

17 Nov, 14:50

ఆసీస్ క్రికెట్‌లో 'శాండ్‌పేపర్‌ గేట్‌'పై మళ్లీ దుమారం.. అభిమానులకు సమాధానం చెప్పాలన్న హేడెన్

17 Nov, 14:49
..More Telugu News