ఈ ఏడాది 'రామోజీ ఎక్సలెన్స్ అవార్డులు' అందుకున్నది ఎవరంటే..!
Advertisement
- విజయవాడలో రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవం
- మొత్తం తొమ్మిది మంది విశిష్ట వ్యక్తులకు పురస్కారాలు
- పురస్కార గ్రహీతల్లో ఐదుగురు మహిళలు
- వేడుకకు హాజరైన కేంద్ర మంత్రి అమిత్ షా, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
విజయవాడ వేదికగా ప్రతిష్ఠాత్మక ‘రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2026’ ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. రామోజీ గ్రూప్ వ్యవస్థాపకుడు దివంగత రామోజీరావు పేరిట ఏర్పాటు చేసిన ఈ పురస్కారాలను వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన తొమ్మిది మంది ప్రముఖులకు అందజేశారు. ఈ ఏడాది అవార్డులు పొందిన వారిలో ఐదుగురు మహిళలు ఉండటం విశేషం.
ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రామోజీ గ్రూప్ సీఎండీ సి.హెచ్. కిరణ్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. సమాజ నిర్మాణంలో నిస్వార్థంగా సేవలందిస్తున్న వ్యక్తులను గుర్తించి సత్కరించడం అభినందనీయమని ప్రముఖులు కొనియాడారు.
రామోజీ ఎక్సలెన్స్ అవార్డు గ్రహీతలు:
1. కళలు, సాంస్కృతిక రంగం: వైకోం విజయలక్ష్మి
2. గ్రామీణాభివృద్ధి: పొదిలి రాజశేఖరరాజు
3. మహిళా సాధికారత: డాక్టర్ వి.రుక్మిణీరావు
4. జర్నలిజం: ఎం.సుచిత్ర
5. సైన్స్ అండ్ టెక్నాలజీ: డా.అర్జున్ అరుణాచలం
6. వైద్య-ఆరోగ్య పరిరక్షణ: డాక్టర్ జెమ్మా జె.ఎడాసెరీ
7. సామాజిక సేవ: దేవేంద్ర కుమార్ గుప్తా
8. విద్యా రంగం: మైత్రేయి జిచ్‌కర్
9. యూత్ ఐకాన్: డా.గణేశ్ బరయ్యా
సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తూ, తమ రంగాల్లో విశేష సేవలందించిన ఈ ప్రముఖులను అవార్డులతో ఘనంగా సత్కరించారు. రామోజీరావు ఆశయాలకు అనుగుణంగా సమాజ హితం కోసం నిరంతరం శ్రమిస్తున్న వ్యక్తులను ప్రోత్సహించడమే ఈ పురస్కారాల ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. పురస్కారాలు అందుకున్న విజేతలను సభలోని ప్రముఖులు, ఆహుతులు మనస్ఫూర్తిగా అభినందించారు.