దిల్జిత్ కచేరీలో వివాదం.. పాటలపై ఆంక్షలకు కవితతో అదిరిపోయే జవాబు
Advertisement
- ఇండోర్ కచేరీలో దిల్జిత్ దోసాంజ్ పాటలపై అధికారుల ఆంక్షలు
- పిల్లలపై ప్రభావం చూపుతాయంటూ నాలుగు పాటల నిషేధం
- వేదికపైనే రాహత్ ఇందోరి కవితతో స్పందించిన దిల్జిత్
ప్రముఖ పంజాబీ గాయకుడు, నటుడు దిల్జిత్ దోసాంజ్ ఇండోర్ కచేరీలో వినూత్న రీతిలో తన నిరసనను వ్యక్తం చేశారు. తన పాటల ప్రదర్శనపై అధికారులు విధించిన ఆంక్షలకు ప్రతిస్పందనగా, దివంగత ఉర్దూ కవి రాహత్ ఇందోరి రాసిన ప్రసిద్ధ కవితను వేదికపైనే ఉటంకించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
వివరాల్లోకి వెళితే.. ఆదివారం ఇండోర్‌లో జరిగిన ‘ఆరా ఇండియా టూర్’ సంగీత కచేరీలో దిల్జిత్ పాల్గొన్నారు. అయితే, ఆయన పాడే ప్రసిద్ధ గీతాలైన ‘పటియాలా పెగ్’, ‘5 తారా’, ‘కేస్’, ‘జట్ ఉతే ఫైర్ కర్దా’ వంటి నాలుగు పాటలను ప్రదర్శించవద్దని జిల్లా బాలల సంరక్షణ అధికారి నిర్వాహకులను ఆదేశించారు. ఆయా పాటల్లో మద్యం, సంబంధిత అంశాల ప్రస్తావన ఉండటంతో, కచేరీకి హాజరయ్యే చిన్నారులపై అవి ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ ఆంక్షలపై దిల్జిత్ వేదికపైనే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. "ఇది పాడొద్దు, అది చేయకూడదు.. అంటూ ఆంక్షలు విధిస్తున్నారు" అని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ఇందోర్‌కు చెందిన ప్రముఖ కవి రాహత్ ఇందోరి రాసిన కవితను చదివి వినిపించారు. ‘సభీ కా ఖూన్ హై షామిల్ యహా కీ మిట్టీ మే, కిసీ కే బాప్ కా హిందుస్థాన్ థోడీ హై’ (ఈ దేశపు మట్టిలో అందరి రక్తం కలిసి ఉంది, హిందుస్థాన్ ఎవరి తండ్రి జాగీరు కాదు) అన్న పంక్తులు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇండోర్‌లో దిల్జిత్ ఇలా రాహత్ ఇందోరి కవితను ప్రస్తావించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. గతంలో 2024 డిసెంబర్ 8న జరిగిన కచేరీ సందర్భంగా స్థానికంగా నిరసనలు వ్యక్తమైనప్పుడు కూడా ఆయన ఇదే కవితను చదివారు. కాగా, అహ్మదాబాద్‌లో జరగనున్న ఆయన తదుపరి షోలోనూ కొన్ని పాటలపై ఇలాంటి అభ్యంతరాలే వ్యక్తమవుతున్నట్లు సమాచారం.