తక్కువ ఈఎంఐ చూసి వెహికల్ కొంటున్నారా? ఈ ఖర్చుల గురించి తెలుసా?
Advertisement
- ఈఎంఐతో పాటు ఇతర ఖర్చులనూ లెక్కించుకోవాలంటున్న నిపుణులు
- డౌన్‌పేమెంట్, రిజిస్ట్రేషన్, బీమా, ఇంధనం, నిర్వహణ వ్యయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిందే
- కనీసం మూడు నెలల ఈఎంఐలకు సరిపడా అత్యవసర నిధి ఉంటే బెటర్
- రుణాల మధ్య APR ఆధారంగా పోలిక చూసుకుంటే మేలు
- వాహనం విలువ తగ్గడం, బీమా నిబంధనలు, క్రెడిట్ చరిత్రపై ప్రభావం వంటి అంశాలూ ముఖ్యమే
కొత్త కారు లేదా బైక్ కొనాలనే ఆలోచన వచ్చినప్పుడు చాలామంది ముందుగా చూసేది నెలవారీ ఈఎంఐ ఎంత ఉంటుందని. తక్కువ ఉంటే చాలు.. వాహనం కొనేయొచ్చని భావిస్తుంటారు. కానీ వాహన రుణం తీసుకోవడంలో అసలు లెక్కలు ఈఎంఐతోనే పూర్తికావు. డౌన్‌పేమెంట్, రిజిస్ట్రేషన్, బీమా, ఇంధనం, నిర్వహణ ఖర్చులు కూడా జేబుపై ప్రభావం చూపుతాయి. అంతేకాదు.. ఆదాయం తగ్గినా, అనుకోని ఖర్చులు ఎదురైనా రుణ వాయిదాలు చెల్లించగలమా? అన్నది ముందే అంచనా వేసుకోవాలి. తొలిసారి వాహన రుణం తీసుకునేవారు ఆరు కీలక విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
1. ఈఎంఐ మాత్రమే వాహనం ఖర్చు కాదు
వాహనం కొనుగోలు చేయడానికి డౌన్‌పేమెంట్‌తో పాటు రిజిస్ట్రేషన్, పన్నులు, బీమా కోసం డబ్బు అవసరం. రోడ్డుపైకి వచ్చిన తర్వాత ఇంధనం, సర్వీసింగ్, టైర్లు, మరమ్మతుల రూపంలో అదనపు ఖర్చులు ఉంటాయి. కాబట్టి రుణం ఎంత తీసుకోవాలనే నిర్ణయానికి ముందు వాహన నిర్వహణ సహా మొత్తం ఖర్చును లెక్కించాలి.
2. రుణం మంజూరైతే చెల్లించగలమని కాదు
బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ రుణం మంజూరు చేసిందంటే దాన్ని సులభంగా తిరిగి చెల్లించగలమని అర్థం కాదు. వైద్య అత్యవసర పరిస్థితులు, ఉద్యోగం కోల్పోవడం, ఆదాయం తగ్గడం వంటి పరిణామాలు వాయిదాల చెల్లింపుపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా వాణిజ్య వాహనాల యజమానులకు ఈ ముప్పు ఎక్కువ. వర్షాకాలంలో ట్రిప్పులు తగ్గడం, ఇంధన ధరలు పెరగడం, సరకు రవాణా చెల్లింపులు ఆలస్యం కావడం వల్ల ఆదాయం తగ్గొచ్చు. అందుకే కనీసం మూడు నెలల ఈఎంఐలకు సరిపడా మొత్తాన్ని అత్యవసర నిధిగా ఉంచుకోవాలి.
3. తక్కువ ఈఎంఐ అంటే తక్కువ ఖర్చు కాదు
నెలవారీ వాయిదా తగ్గుతుందని రుణ కాలపరిమితిని పెంచుకుంటే మొత్తం చెల్లించే వడ్డీ పెరుగుతుంది. ప్రాసెసింగ్ ఫీజులు, రుణంతో కలిపి ఇచ్చే బీమా కూడా ఖర్చును పెంచుతాయి. అందువల్ల తక్కువ ఈఎంఐని మాత్రమే చూసి రుణాన్ని ఎంచుకోవద్దు. అన్ని ఖర్చులతో కూడిన వార్షిక శాతం రేటు (APR) ఆధారంగా వివిధ రుణాలను పోల్చాలి. 2024 అక్టోబర్ నుంచి రిటైల్, ఎంఎస్‌ఎంఈ టర్మ్ లోన్లకు సంబంధించి రుణదాతలు కీ ఫ్యాక్ట్స్ స్టేట్‌మెంట్ (KFS) ఇవ్వాలని ఆర్బీఐ నిబంధన విధించింది. ఇందులో ఏపీఆర్, చెల్లింపు షెడ్యూల్, ఆలస్య రుసుములు, ముందస్తు రుణ ముగింపు ఛార్జీల వివరాలు ఉంటాయి.
4. కాలం గడిచేకొద్దీ వాహనం విలువ తగ్గుతుంది
వాహనాల రీసేల్ వాల్యూ కాలక్రమంలో తగ్గుతుంది. తక్కువ డౌన్‌పేమెంట్‌తో వాహనం కొనుగోలు చేసి, రుణం పూర్తికాకముందే అమ్మాల్సి వస్తే కొత్త చిక్కులు ఎదురుకావచ్చు. ఎందుకంటే అమ్మకం ద్వారా వచ్చే మొత్తం కంటే బకాయి రుణం ఎక్కువగా ఉండొచ్చు. వాహనం దొంగతనానికి గురైనా, పూర్తిగా దెబ్బతిన్నా బీమా పరిహారాన్ని బట్టి ఇదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. వీలైనంత ఎక్కువ డౌన్‌పేమెంట్ చెల్లించడం, మంచి పునఃవిక్రయ విలువ ఉన్న వాహనాన్ని ఎంచుకోవడం ఈ ముప్పును తగ్గిస్తాయి.
5. బీమా పాలసీలో ఏం కవర్ అవుతుంది?
బీమా తీసుకోవడమే కాదు.. పాలసీలో ఏయే ప్రమాదాలకు రక్షణ ఉందో, ఎలాంటి మినహాయింపులు ఉన్నాయో తెలుసుకోవాలి. వాహనాన్ని వ్యక్తిగత అవసరాలకు వాడుతున్నారా? వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారా? అన్న విషయాన్ని బీమా సంస్థకు సరిగ్గా తెలియజేయాలి. ముఖ్యంగా వాణిజ్య వాహనాల విషయంలో ఈ జాగ్రత్త అవసరం. బీమా క్లెయిమ్ తిరస్కరణకు గురైనా, మరమ్మతులకు ఎక్కువ సమయం పట్టినా ఆదాయం నిలిచిపోవచ్చు. కానీ రుణ వాయిదాలు మాత్రం కొనసాగుతాయి.
6. ఒక్క ఈఎంఐ మిస్ అయినా ప్రభావం ఉంటుంది
సమయానికి రుణ వాయిదాలు చెల్లించడం వల్ల క్రెడిట్ చరిత్ర మెరుగ్గా ఉంటుంది. ఒక్కోసారి ఈఎంఐలు చెల్లించకపోతే క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది. భవిష్యత్తులో రుణాలు పొందడం కష్టమవ్వొచ్చు. ఒకవేళ వాయిదా చెల్లించడం కష్టంగా మారితే రుణదాతను ముందుగానే సంప్రదించాలి. రిమైండర్లు వచ్చే వరకు వేచి చూడటం లేదా బకాయిలు పేరుకుపోయేలా చేయడం మంచిది కాదు.