సీఎం చంద్రబాబును కలిసిన వైఎస్ షర్మిల.. కుమార్తె వివాహానికి ఆహ్వానం

Andhra
Advertisement
  • సీఎం చంద్రబాబును ఆయన నివాసంలో కలిసిన ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
  • కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను అందజేసిన షర్మిల
  • కాబోయే దంపతులను ఆశీర్వదించాలని కోరినట్లు సోషల్ మీడియాలో పోస్ట్
  • ఇప్పటికే పలువురు కీలక రాజకీయ ప్రముఖులను స్వయంగా ఆహ్వానించిన షర్మిల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్వయంగా కలిశారు. తన కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి వివాహ మహోత్సవానికి హాజరుకావాల్సిందిగా కోరుతూ ఆయనకు వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. చంద్రబాబు నివాసానికి వెళ్లిన ఆమె, పెళ్లి కార్డును అందించి నూతన వధూవరులను ఆశీర్వదించాలని ఆహ్వానించారు.

ఈ సందర్భంగా తన కుమార్తె అంజిలి రెడ్డి, కాబోయే అల్లుడు సోమల రఘురామ్ రెడ్డిల వివాహానికి సంబంధించిన వివరాలను చంద్రబాబుకు షర్మిల వివరించారు. పెళ్లికి తప్పనిసరిగా విచ్చేయాలని ఆమె కోరారు.

సీఎం చంద్రబాబును కలిసిన అనంతరం వైఎస్ షర్మిల ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. చంద్రబాబుకు వెడ్డింగ్ కార్డు అందజేస్తున్న ఫొటోను పోస్ట్ చేస్తూ.. "ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని తన నివాసంలో కలిసి నా కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి - సోమల రఘురామ్ రెడ్డి ల వివాహ మహోత్సవానికి విచ్చేసి కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ వివాహ ఆహ్వాన పత్రికను అందించడం జరిగింది" అని పేర్కొన్నారు.

కుమార్తె వివాహాన్ని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్న వైఎస్ షర్మిల.. రాజకీయాలకు అతీతంగా పలువురు ప్రముఖులను స్వయంగా కలిసి ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులకు ఆమె వివాహ ఆహ్వాన పత్రికలను అందజేశారు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబును కలిసి ఆహ్వానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

షర్మిల కుమార్తె వివాహం నవంబరు 25న జరగనుండగా, డిసెంబరు 5న రిసెప్షన్ నిర్వహించనున్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

మీ కోసం మరిన్ని

YS SharmilaChandrababu NaiduYS Anjali Reddy weddingAP PCC chief SharmilaAndhra Pradesh politicsSharmila meets Chandrababu

More Telugu News

మేయర్, మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన పవన్ కల్యాణ్

15 Nov, 19:46

లేఆఫ్‌లో వెళ్లిపోతానన్నాడు.. 15 నెలల జీతం ఇచ్చి మహారాజులా సాగనంపారు!

15 Nov, 19:20

బ్రేకులు పనిచేయకపోయినా 463 కిలోమీటర్లు ప్రయాణించిన వందే భారత్.. విచారణకు ఆదేశం

15 Nov, 18:53

నిత్యావసరాల ధరలు పెంచి విజన్ కబుర్లు చెబుతారా?: ధర్మాన

15 Nov, 18:47

బంగాళాఖాతంలో తీవ్రరూపం దాల్చిన వాయుగుండం.. ఏపీకి 'అక్వాన్' గండం

15 Nov, 18:21

స్వగ్రామంలో ముగిసిన గిరిబాబు అంత్యక్రియలు.. అశ్రునయనాల మధ్య ఆఖరి వీడ్కోలు

15 Nov, 18:07

ఇంత జర్నీ ఎందుకు అంటే.. సొంతూరికి ఏదైనా చేయాలనేవాడు: గిరిబాబుకు మోహన్ బాబు నివాళి

15 Nov, 17:49

సెహ్వాగ్.. సెహ్వాగ్ అంటూ పాక్ అభిమానుల నినాదాలు.. కుమారుడు ఆర్యవీర్‌తో వీరేంద్ర సెహ్వాగ్ భావోద్వేగ వీడియో కాల్

15 Nov, 17:32

ఏపీలో మేయర్, చైర్ పర్సన్ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థులు వీరే!

15 Nov, 17:14

మైదానంలోనే యుద్ధం.. బయట స్నేహంగా ఉంటాం: శ్రేయస్ అయ్యర్

15 Nov, 16:55

ఒక్క మ్యాచ్ ఓడినా మళ్లీ కోహ్లీనే కెప్టెన్‌ను చేయాలంటారు: డుప్లెసిస్

15 Nov, 16:42

సీరియల్స్ లో అవకాశాల పేరుతో వల.. నగ్న చిత్రాలతో వేధింపులు!

15 Nov, 16:36

రాహుల్ గాంధీకి సీఎం బాడీగార్డ్‌లా వ్యవహరిస్తున్నారు: కేటీఆర్ విమర్శలు

15 Nov, 16:28

ఫోన్ ఇవ్వకుండా ఈఎంఐలు కట్ చేసిన ఎలక్ట్రానిక్స్ స్టోర్‌కు భారీ జరిమానా

15 Nov, 16:23
..More Telugu News