హైదరాబాద్‌లో దారుణం.. ముంబై వ్యాపారవేత్తపై అత్యాచారం, భారీ మోసం

Telangana
Advertisement
  • పెళ్లి పేరుతో ముంబై వ్యాపారవేత్తను మోసం చేసిన హైదరాబాద్ వ్యాపారి
  • వ్యాపార లావాదేవీల పేరుతో రూ.5.09 కోట్ల మోసం
  • హైదరాబాద్ హోటళ్లలో పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు
  • ప్రైవేట్ ఫొటోలతో బ్లాక్‌మెయిల్ చేసినట్లు బాధితురాలి ఫిర్యాదు
  • పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వ్యాపార లావాదేవీల పేరుతో ఓ మహిళా వ్యాపారవేత్తను రూ.5 కోట్లకు పైగా మోసం చేయడమే కాకుండా, ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన దారుణ ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. ముంబైకి చెందిన బాధితురాలి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు హైదరాబాద్ కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ మనీశ్ భాటి సహా పలువురిపై కేసు నమోదు చేశారు.

పోలీసుల కథనం ప్రకారం, ముంబైలో దిగుమతి వస్తువుల వ్యాపారం చేసే మహిళకు 2024 జులైలో మనీశ్ భాటితో వ్యాపార రీత్యా పరిచయం ఏర్పడింది. తొలుత పిస్తా, లవంగాల వ్యాపారం కోసం సరుకులు తీసుకుని, నమ్మకం కలిగించేందుకు సకాలంలో డబ్బులు చెల్లించాడు. ఆ తర్వాత 2024 నవంబరు నుంచి చెల్లింపుల్లో జాప్యం చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో తన సోదరుడు పవన్ భాటితో పాటు మహ్మద్ రషీద్, జీషాన్ అహ్మద్, నదీమ్ జుమానీ, ఇర్ఫాన్ భాడా వంటి వారిని పరిచయం చేసి, వారి సంస్థల పేరుతో కూడా భారీగా సరుకులు తీసుకుని బకాయిలు పెట్టారు.

బాధితురాలు బకాయిల కోసం నిలదీసినప్పుడల్లా, మనీశ్ భాటి ప్రేమ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చేవాడు. తాను అవివాహితుడినని, తప్పకుండా పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. వీడియో కాల్స్ మాట్లాడే సమయంలో ఆమెకు తెలియకుండా ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు రికార్డు చేశాడు. గత ఏడాది ఆగస్టు 5న హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత సెప్టెంబరు 9, 11 తేదీల్లో కూడా వేర్వేరు హోటళ్లలో మద్యం తాగించి, పెళ్లి పేరుతో నమ్మిస్తూ అత్యాచారం చేశాడు.

బకాయిలు చెల్లించాలని గట్టిగా అడిగితే, ఆమె ప్రైవేట్ ఫొటోలను వ్యాపారుల వాట్సాప్ గ్రూపుల్లో పెడతానని బ్లాక్‌మెయిల్ చేశాడు. దీంతో బాధితురాలు ముంబైలోని మహిమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, అక్కడ జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, నవంబరు 13న కేసును పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. తన ఫిర్యాదులో, నిందితులు తనకు మొత్తం రూ.5,09,81,914 బాకీ ఉన్నారని బాధితురాలు పేర్కొన్నారు. ఇందులో మనీశ్ భాటి సంస్థలు రూ.1.67 కోట్లు, ఇర్ఫాన్ భాడా రూ.1.97 కోట్లు, నదీమ్ జుమానీ రూ.1.17 కోట్లు, జీషాన్ అహ్మద్ రూ.25.79 లక్షలు, పవన్ భాటి రూ.6.25 లక్షలు బకాయి ఉన్నట్లు వివరించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

మీ కోసం మరిన్ని

Manish BhatiHyderabad crime newsMumbai businesswoman fraudPunjagutta police caseRape and financial fraudHyderabad Kirana Merchants Association

More Telugu News

హర్మూజ్ జలసంధిలో కలకలం.. మైన్లు తగిలి 3 ఆయిల్ ట్యాంకర్లకు మంటలు!

15 Nov, 08:52

అంతరిక్షంలో అద్భుతం.. స్టార్‌షిప్‌ను ఒడిసిపట్టిన స్పేస్‌ఎక్స్.. ఏళ్ల నాటి కల సాకారం!

15 Nov, 08:47

అమెరికాలో ఆగని విమానయాన సంక్షోభం.. నేడు కూడా వేలల్లో విమానాల రద్దు

15 Nov, 08:15

'వాట్ ఏ మ్యాచ్'.. 'స్టార్ బాయ్' ఆర్యవీర్‌ అంటూ వైభ‌వ్ ఆస‌క్తిక‌ర పోస్ట్‌!

15 Nov, 08:05

చైనా ఎలక్ట్రిక్ విమానం సీఈ-25ఏ తొలి ప్రయాణం విజయవంతం

15 Nov, 08:02

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫైనల్ ఛార్జ్‌షీట్.. కేసీఆర్, కేటీఆర్‌లకు బిగుస్తున్న ఉచ్చు!

15 Nov, 07:58

అండర్-19 ఆసియా కప్ గెలిచిన భారత్.. చంద్రబాబు, లోకేశ్ అభినందనలు

15 Nov, 07:45

టోల్ వసూళ్లలో ఆల్ టైమ్ రికార్డ్.. అక్టోబర్‌లో జాతీయ రహదారులపై రూ.6,640 కోట్ల ఆదాయం!

15 Nov, 07:42

నా దగ్గర డబ్బుల్లేవ్.. నా మెట్రో టికెట్‌ను కూడా మోదీనే కొన్నారు: డీకే శివకుమార్

15 Nov, 07:37

టాస్ గెలిచిన కివీస్‌.. భార‌త జ‌ట్టులోకి కొత్త ఆట‌గాడి ఎంట్రీ

15 Nov, 07:28

కొండగట్టులో భారీ కుంభకోణం.. రూ.23 కోట్ల నిధులు గోల్‌మాల్?

15 Nov, 07:27

జెన్సన్ హువాంగ్ కోసం ఆన్‌లైన్ ఉద్యమం.. లక్ష దాటిన సంతకాలు.. మద్దతుగా మస్క్!

15 Nov, 07:20

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త సారథి.. మీనాక్షి స్థానంలో బీఎం సందీప్

15 Nov, 07:10

భారత్ దాడుల భయం.. హఫీజ్, అజార్‌లను రహస్య ప్రాంతాలకు తరలించిన పాక్ ఐఎస్ఐ!

15 Nov, 07:08
..More Telugu News