'వాట్ ఏ మ్యాచ్'.. 'స్టార్ బాయ్' ఆర్యవీర్‌ అంటూ వైభ‌వ్ ఆస‌క్తిక‌ర పోస్ట్‌!

Sports
Advertisement
  • చివరి బంతికి గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకున్న యువ జట్టు
  • 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌'గా నిలిచిన సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్
  • ఆర్యవీర్‌ను 'స్టార్ బాయ్' అంటూ ప్రశంసించిన యువ వైభవ్ సూర్యవంశీ
  • 'కంగ్రాచ్యులేషన్స్.. వాట్ ఏ మ్యాచ్!' అంటూ వైభ‌వ్ ఆస‌క్తిక‌ర పోస్ట్‌
నిన్న జరిగిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై భారత యువ జట్టు ఉత్కంఠభరిత విజయం సాధించింది. చివరి బంతి వరకు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. మ్యాచ్ చాలా సమయం పాకిస్థాన్ నియంత్రణలోనే ఉన్నప్పటికీ, ఆఖర్లో భారత ఆటగాళ్లు అద్భుతంగా పుంజుకుని విజయాన్ని అందుకున్నారు. గ్రూప్ దశలో పాక్ చేతిలో ఓటమి పాలైన టీమిండియా, ఫైనల్‌లో ప్రతీకారం తీర్చుకుని కప్‌ను సొంతం చేసుకుంది.

ఈ అద్భుత విజయంపై 15 ఏళ్ల యువ భారత బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ స్పందించాడు. ఓ సాధారణ అభిమానిలా మారిపోయిన వైభవ్, ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఆనందాన్ని పంచుకున్నాడు. "కంగ్రాచ్యులేషన్స్, ఓ మ్యాన్... వాట్ ఏ మ్యాచ్!" అంటూ మ్యాచ్ లోని ఉత్కంఠ‌ను తన పోస్టులో పేర్కొన్నాడు.

మరో స్టోరీలో, టోర్నీ హీరోగా నిలిచిన వీరేందర్ సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్‌పై ప్రత్యేక ప్రశంసలు కురిపించాడు. "స్టార్ బోయ్, ఆర్యవీర్ సెహ్వాగ్" అని పోస్ట్ చేశాడు. ఈ టోర్నీలో అత్యధికంగా 361 పరుగులు చేసిన ఆర్యవీర్, 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'‌గా నిలిచాడు. ఫైనల్‌లోనూ ఓపెనర్‌గా బరిలోకి దిగి 61 బంతుల్లో 58 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Advertisement

సంబంధిత వార్తలు

మీ కోసం మరిన్ని

Aryaveer SehwagIndia vs Pakistan U19 FinalVaibhav SuryavanshiU19 Asia Cup WinnerPlayer of the TournamentIndia Under 19 Cricket Team

More Telugu News

అమెరికాలో ఆగని విమానయాన సంక్షోభం.. నేడు కూడా వేలల్లో విమానాల రద్దు

15 Nov, 08:15

చైనా ఎలక్ట్రిక్ విమానం సీఈ-25ఏ తొలి ప్రయాణం విజయవంతం

15 Nov, 08:02

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫైనల్ ఛార్జ్‌షీట్.. కేసీఆర్, కేటీఆర్‌లకు బిగుస్తున్న ఉచ్చు!

15 Nov, 07:58

అండర్-19 ఆసియా కప్ గెలిచిన భారత్.. చంద్రబాబు, లోకేశ్ అభినందనలు

15 Nov, 07:45

టోల్ వసూళ్లలో ఆల్ టైమ్ రికార్డ్.. అక్టోబర్‌లో జాతీయ రహదారులపై రూ.6,640 కోట్ల ఆదాయం!

15 Nov, 07:42

నా దగ్గర డబ్బుల్లేవ్.. నా మెట్రో టికెట్‌ను కూడా మోదీనే కొన్నారు: డీకే శివకుమార్

15 Nov, 07:37

టాస్ గెలిచిన కివీస్‌.. భార‌త జ‌ట్టులోకి కొత్త ఆట‌గాడి ఎంట్రీ

15 Nov, 07:28

కొండగట్టులో భారీ కుంభకోణం.. రూ.23 కోట్ల నిధులు గోల్‌మాల్?

15 Nov, 07:27

జెన్సన్ హువాంగ్ కోసం ఆన్‌లైన్ ఉద్యమం.. లక్ష దాటిన సంతకాలు.. మద్దతుగా మస్క్!

15 Nov, 07:20

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త సారథి.. మీనాక్షి స్థానంలో బీఎం సందీప్

15 Nov, 07:10

భారత్ దాడుల భయం.. హఫీజ్, అజార్‌లను రహస్య ప్రాంతాలకు తరలించిన పాక్ ఐఎస్ఐ!

15 Nov, 07:08

తెలంగాణను వణికిస్తున్న చలి.. కోహీర్‌లో 11 డిగ్రీలు

15 Nov, 06:49

మా బౌలింగే కొంపముంచింది.. భార‌త్ ఆట‌ను మెచ్చుకోవాల్సిందే: పాక్‌ కెప్టెన్ ఫర్హాన్

15 Nov, 06:42

గుడి కట్టడానికి సర్పంచ్ పదవి వేలం.. రూ. 29 లక్షలు పలికిన పోస్ట్

15 Nov, 06:28
..More Telugu News