Advertisement

పవన్ కల్యాణ్ కు 4 పెళ్లిళ్లు అయ్యే యోగం ఉంది: వేణు స్వామి పాత వ్యాఖ్యలు వైరల్

Both States
Advertisement
  • విడిపోతున్నట్టు ప్రకటించిన పవన్ కల్యాణ్, అన్నా లెజినోవా
  • పవన్, అన్నా విడిపోతారని 2023లో ప్రకటించిన వేణు స్వామి
  • పవన్ దంపతులు విడిపోవడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వేణు స్వామి
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆయన సతీమణి అన్నా లెజినోవా తమ 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికారు. పరస్పర అంగీకారంతో తాము విడిపోతున్నట్లు ఈ దంపతులు అధికారికంగా ప్రకటించారు.

"పరస్పర అంగీకారం, అవగాహనతో విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం. జీవితంలో ఎంతోకాలం కలిసి ప్రయాణించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం. మా వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నాం. విడిపోయినా మంచి స్నేహితులుగా కొనసాగుతాం. పిల్లల తల్లిదండ్రులుగా మా బాధ్యతలు కొనసాగిస్తాం. పిల్లల సంతోషం, భవిష్యత్తే మా ఇద్దరి ఉమ్మడి ప్రాధాన్యత. ఈ వ్యక్తిగత పరిణామంలో మా గోప్యతను గౌరవించాలని కోరుకుంటున్నాం. మా ప్రయాణంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు" అని తెలిపారు.

పవన్ కల్యాణ్, అన్నా లెజినోవా 2013 సెప్టెంబర్‌లో వివాహం చేసుకున్నారు. వీరికి మార్క్ శంకర్ పవనోవిచ్, పొలెనా అంజనా పవనోవా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతూ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలైనట్లు సమాచారం.

ఈ పరిణామంతో... ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గతంలో చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో సమంత, నాగచైతన్య విడిపోతారని చెప్పి వార్తల్లో నిలిచిన వేణు స్వామి... 2023లో పవన్ కల్యాణ్ మూడో వివాహం కూడా నిలవదని జోస్యం చెప్పారు. అయితే ఆయన చెప్పిన మూడేళ్ల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. పవన్ జాతకంలో గురువు నీచ స్థానంలో 6వ ఇంట్లో ఉండడం వల్లే ఇలా జరుగుతుందని, ఆ గ్రహ స్థితి ఆధారంగానే ఆయన మరో వివాహం చేసుకుంటారని అనడం గమనార్హం. ఏదేమైనప్పటికీ పవన్, అన్నా విడిపోవడంతో... వేణు స్వామి మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

మీ కోసం మరిన్ని

Venu SwamyPawan KalyanAnna LezhnevaPawan Kalyan divorceVenu Swamy predictionPawan Kalyan marriages

More Telugu News

తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత.. 29 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

10 Nov, 11:22

‘‘నేను ప్రధాని కావడం రాహుల్‌, ప్రియాంకలకు ఇష్టం లేదు’’.. సోనియా ఆసక్తికర విషయాలు

10 Nov, 11:18

క్వాంటాస్‌లో ఏఐ కలకలం.. 850 మందికి ఉద్వాసన.. భారత్‌కు ఉద్యోగాల తరలింపు

10 Nov, 11:14

‘‘నన్ను చూస్తే చూపు తిప్పుకుంటారు’’.. తన పుస్తకంలో మోదీపై సోనియా ఆసక్తికర వ్యాఖ్యలు!

10 Nov, 11:01

మూడేళ్ల బాలుడి పునర్జన్మ కథ.. సైన్స్‌కు అందని రహస్యం.. పరిశోధకులను సైతం ఆశ్చర్యపరిచిన ఘటన!

10 Nov, 10:58

ఫామ్‌లోకి వచ్చిన జైస్వాల్, పడిక్కల్.. డ్రాగా ముగిసిన భారత్-ఏ సిరీస్

10 Nov, 10:46

ధైర్యంగా కోలుకుంటోంది.. రాప్తాడు బాలిక ఆరోగ్యంపై లోకేశ్ ట్వీట్

10 Nov, 10:44

పాక్ క్రికెట్‌లో సంచలనం.. అరంగేట్రంలోనే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు!

10 Nov, 10:40

పవన్ కల్యాణ్‌తో విడాకులకు సంబంధించి ముందే హింట్ ఇచ్చిన అన్నా కొణిదెల?

10 Nov, 10:38

టీబీ చికిత్సలో కొత్త ఆశలు.. హైదరాబాద్ సీసీఎంబీ శాస్త్రవేత్తల కీలక ముందడుగు!

10 Nov, 10:34

మమత కాళీ పూజ వెలవెల.. తగ్గిన రాజకీయ వైభవం!

10 Nov, 10:14

నిద్రలేచాక ఎన్ని గంటల్లో టిఫిన్‌ చేయాలి? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే!

10 Nov, 10:12

ప్రకాశం జిల్లాలో కాలి బూడిదైన ప్రైవేట్ బస్సు.. డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం

10 Nov, 10:10

హైదరాబాద్‌లో లోన్ యాప్ వేధింపులకు కానిస్టేబుల్ బలి

10 Nov, 10:08
..More Telugu News