Advertisement

పవన్ కల్యాణ్‌తో విడాకులకు సంబంధించి ముందే హింట్ ఇచ్చిన అన్నా కొణిదెల?

Both States
Advertisement
  • 13 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికిన పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల
  • పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్లు అధికారికంగా ఉమ్మడి ప్రకటన విడుదల
  • అక్టోబర్ చివర్లోనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసిన అన్నా
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా కొణిదెల తమ 13 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలికారు. పరస్పర అంగీకారం, గౌరవంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఈ దంపతులు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఉమ్మడి ప్రకటనను మీడియాకు విడుదల చేశారు. 2013 సెప్టెంబర్‌లో పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల వివాహం జరిగిన సంగతి తెలిసిందే.

తమ ప్రకటనలో పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల స్పందిస్తూ... "జీవితంలో ఎంతో ముఖ్యమైన ప్రయాణాన్ని పంచుకున్న తర్వాత, పరస్పర అవగాహన, గౌరవంతో విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం. మా వివాహ బంధం ముగిసినప్పటికీ, మంచి స్నేహితులుగా, మా పిల్లలకు బాధ్యతగల తల్లిదండ్రులుగా కొనసాగుతాం. పిల్లల ఆనందం, వారి భవిష్యత్తు, శ్రేయస్సే మా ఉమ్మడి ప్రాధాన్యత. జీవితంలో చోటుచేసుకున్న ఈ వ్యక్తిగత మార్పు సమయంలో మా నిర్ణయాన్ని అర్థం చేసుకుని, మా గోప్యతను గౌరవించాలని కోరుతున్నాం. ఇప్పటివరకు మా ప్రయాణంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు" అని తెలిపారు. ఈ దంపతులకు కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్, కుమార్తె పొలెనా అంజనా పవనోవా ఉన్నారు.

మరోవైపు, గత అక్టోబర్ నెలాఖరులో అన్నా కొణిదెల తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను అకస్మాత్తుగా డీయాక్టివేట్ చేయడం అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ఆమె ఖాతా కనిపించకపోవడంతో రకరకాల ఊహాగానాలు వినిపించినప్పటికీ, అప్పట్లో ఎలాంటి స్పష్టత రాలేదు. తాజాగా వీరి విడాకుల ప్రకటన వెలువడటంతో, అన్నా కొణిదెల అప్పట్లో సోషల్ మీడియాకు దూరమవడానికి కారణం ఇదేనంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

మీ కోసం మరిన్ని

Anna KonidelaPawan KalyanPawan Kalyan divorceAnna Konidela InstagramPawan Kalyan wife

More Telugu News

‘‘నేను ప్రధాని కావడం రాహుల్‌, ప్రియాంకలకు ఇష్టం లేదు’’.. సోనియా ఆసక్తికర విషయాలు

10 Nov, 11:18

క్వాంటాస్‌లో ఏఐ కలకలం.. 850 మందికి ఉద్వాసన.. భారత్‌కు ఉద్యోగాల తరలింపు

10 Nov, 11:14

పవన్ కల్యాణ్ కు 4 పెళ్లిళ్లు అయ్యే యోగం ఉంది: వేణు స్వామి పాత వ్యాఖ్యలు వైరల్

10 Nov, 11:12

‘‘నన్ను చూస్తే చూపు తిప్పుకుంటారు’’.. తన పుస్తకంలో మోదీపై సోనియా ఆసక్తికర వ్యాఖ్యలు!

10 Nov, 11:01

మూడేళ్ల బాలుడి పునర్జన్మ కథ.. సైన్స్‌కు అందని రహస్యం.. పరిశోధకులను సైతం ఆశ్చర్యపరిచిన ఘటన!

10 Nov, 10:58

ఫామ్‌లోకి వచ్చిన జైస్వాల్, పడిక్కల్.. డ్రాగా ముగిసిన భారత్-ఏ సిరీస్

10 Nov, 10:46

ధైర్యంగా కోలుకుంటోంది.. రాప్తాడు బాలిక ఆరోగ్యంపై లోకేశ్ ట్వీట్

10 Nov, 10:44

పాక్ క్రికెట్‌లో సంచలనం.. అరంగేట్రంలోనే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు!

10 Nov, 10:40

టీబీ చికిత్సలో కొత్త ఆశలు.. హైదరాబాద్ సీసీఎంబీ శాస్త్రవేత్తల కీలక ముందడుగు!

10 Nov, 10:34

మమత కాళీ పూజ వెలవెల.. తగ్గిన రాజకీయ వైభవం!

10 Nov, 10:14

నిద్రలేచాక ఎన్ని గంటల్లో టిఫిన్‌ చేయాలి? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే!

10 Nov, 10:12

ప్రకాశం జిల్లాలో కాలి బూడిదైన ప్రైవేట్ బస్సు.. డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం

10 Nov, 10:10

హైదరాబాద్‌లో లోన్ యాప్ వేధింపులకు కానిస్టేబుల్ బలి

10 Nov, 10:08

పంచాయతీ ఎన్నికలకు మోగిన నగారా.. తిరుపతి జిల్లాలో 2 విడతల్లో పంచాయతీ పోరు

10 Nov, 10:06
..More Telugu News