తుపాకీ నక్సలిజం పోయింది.. 'దిమాగీ నక్సల్స్' తయారయ్యారు: ప్రధాని మోదీ
Advertisement
- దేశంలో సాయుధ నక్సలిజం అంతమైందన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
- సంస్థల్లో తిష్ఠవేసిన 'దిమాగీ నక్సల్స్'తో ఇప్పటికీ ముప్పు పొంచి ఉందని హెచ్చరిక
- గత 12 ఏళ్లలో దేశంలో 50 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని వెల్లడి
- నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో భారీగా రోడ్లు, మొబైల్ టవర్లు, ఏకలవ్య పాఠశాలల నిర్మాణం
- బస్తర్‌లో తుపాకులు పట్టిన చేతులు నేడు క్రీడల్లో రాణిస్తున్నాయన్న ప్రధాని
దేశంలో సాయుధ నక్సలిజం (మావోయిజం) పూర్తిగా అంతమైనప్పటికీ, ‘దిమాగీ నక్సల్స్’ (మేధో నక్సలైట్లు) నుంచి ముప్పు ఇంకా పొంచి ఉందని, దేశ భద్రత కోసం వారిని ఓడించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో భద్రతా దళాలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, గత 12 ఏళ్ల కాలంలో భారత్ నక్సలిజం, వేర్పాటువాదంపైనే కాకుండా పేదరికంపై కూడా చారిత్రక విజయం సాధించిందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రపంచ బ్యాంకు తాజా నివేదికను ప్రధాని ప్రస్తావించారు. గత కొన్నేళ్లలో భారత్‌లో దాదాపు 50 కోట్ల మంది తీవ్ర పేదరికం నుంచి బయటపడ్డారని, దశాబ్దాల తరబడి ఇచ్చిన ‘గరీబీ హటావో’ నినాదాలతో సాధ్యం కాని పనిని తమ ప్రభుత్వం చేసి చూపించిందని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ఆయన ‘రంగోలి’తో పోల్చారు. రంగోలిలో చిన్న చిన్న ముగ్గులు కలిసి చివరకు ఒక అందమైన చిత్రాన్ని ఆవిష్కరించినట్లుగానే, అనేక పథకాలు కలిసి పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాయని వివరించారు.
జన్ ధన్ యోజన ద్వారా కోట్లాది మందిని బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావడం, పీఎం ఆవాస్ యోజనతో పక్కా ఇళ్లు, హామీ లేని ముద్రా రుణాలు, స్వనిధి పథకం, ఆయుష్మాన్ భారత్ ద్వారా ఉచిత వైద్యం, ఉచిత రేషన్, స్వచ్ఛ భారత్, హర్ ఘర్ జల్ వంటి పథకాలు పేదల కనీస అవసరాలను తీర్చి వారిని ఆర్థికంగా నిలబెట్టాయని తెలిపారు.
పేదరికంపై పోరాటానికి, నక్సలిజంపై చేపట్టిన చర్యలకు అవినాభావ సంబంధం ఉందని మోదీ అన్నారు. గతంలో నక్సల్స్ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధిని అడ్డుకోవడమే తీవ్రవాదుల ప్రధాన ఎజెండాగా ఉండేదని చెప్పారు. పాఠశాలలు తెరవకుండా అడ్డుకోవడం, వాటిని తగులబెట్టడం, ఆసుపత్రులు, వైద్యులు రాకుండా చేయడం, పోలియో వ్యాక్సినేషన్‌ను నిలిపివేయడం, మొబైల్ టవర్లు పెట్టనీయకపోవడం, రైల్వే ట్రాక్‌లను పేల్చివేయడం వంటి చర్యలకు పాల్పడ్డారని తెలిపారు. ఫలితంగా లక్షలాది మంది పేదలు, యువత తీవ్ర పేదరికంలో ఉండిపోయి, అభివృద్ధి అవకాశాలకు దూరమయ్యారని పేర్కొన్నారు.
నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో కేవలం భద్రతా చర్యలే కాకుండా ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిందని మోదీ వివరించారు. భద్రతా దళాల పర్యవేక్షణలో 15,000 కిలోమీటర్లకు పైగా రోడ్లు నిర్మించామని, 9,000కు పైగా మొబైల్ టవర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. గిరిజన ప్రాంతాల పిల్లల కోసం సుమారు 200 ఏకలవ్య మోడల్ పాఠశాలలు, 50 ఐటీఐలు, స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలు నెలకొల్పినట్లు వెల్లడించారు.
పీఎం-జన్‌మన్ పథకం ద్వారా మారుమూల గిరిజన గ్రామాలకు తొలిసారిగా తాగునీరు, విద్యుత్, రోడ్డు కనెక్టివిటీ కల్పించామన్నారు. లొంగిపోయిన నక్సలైట్లకు పునరావాసం కల్పించడంతో హింసాత్మక ఘటనలు ఆగిపోయాయని, బస్తర్ యువత ఇప్పుడు తుపాకులు వదిలి క్రీడలు, ఒలింపిక్స్‌లో పాల్గొనే స్థాయికి ఎదిగారని ప్రశంసించారు.
అయితే, ఈ ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని ప్రధాని హెచ్చరించారు. "అడవుల నుంచి సాయుధ నక్సలైట్లను తుడిచిపెట్టాం. కానీ ఈ మేధో నక్సలైట్లు అనేక సంస్థల్లో తిష్టవేశారు. ఇప్పటికీ వారు దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థలకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొడుతున్నారు. ఈ దిమాగీ నక్సల్స్ అనేక రాజకీయ పార్టీలు, ఇతర సంస్థల్లోకి చొరబడ్డారు. వారి కుట్రలను గుర్తించి, వారిని పూర్తిగా ఓడించి దేశాన్ని రక్షించుకోవాలి" అని ప్రధాని పిలుపునిచ్చారు.