ఎమర్జెన్సీపై ఇన్నాళ్లకు కీలక వ్యాఖ్యలు.. ఇందిర గురించి సోనియా ఏం చెప్పారంటే?
Advertisement
- ఎమర్జెన్సీ అకృత్యాలపై ఇందిర క్షమాపణలు చెప్పారని సోనియా వెల్లడి
- సంజయ్ ఒక్కడినే బాధ్యుడిగా చూడకూడదని వ్యాఖ్య
- ఇందిరపై సీనియర్ నేతల ఒత్తిడి ఉండేదని వెల్లడి
- రాజీవ్ ప్రజల ఫిర్యాదులను తల్లి దృష్టికి తీసుకెళ్లేవారని వివరణ
- 1977 మార్చిలో ఇందిరే ఎన్నికలకు పిలుపునిచ్చారని వ్యాఖ్య
Advertisement
ఎమర్జెన్సీ సమయంలో జరిగిన అకృత్యాలపై మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తర్వాతి కాలంలో పశ్చాత్తాపం వ్యక్తం చేశారని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ తెలిపారు. ఆ ఘటనలకు బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పారని వెల్లడించారు. ఎమర్జెన్సీకి సంజయ్‌గాంధీ ఒక్కరినే బాధ్యుడిగా చూడకూడదని స్పష్టం చేశారు.
'ది హిందూ' పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనియా ఈ విషయాలు వెల్లడించారు. ఎమర్జెన్సీ అనగానే ప్రజలకు సంజయ్‌గాంధీ గుర్తుకొస్తారని అన్నారు. కానీ అప్పట్లో ఇందిరాగాంధీపై సీనియర్ నేతల నుంచి కూడా ఒత్తిడి ఉండేదని చెప్పారు. ఆమె చుట్టూ భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేసినవారిలో రాజీవ్‌గాంధీ కూడా ఉన్నారని తెలిపారు. ప్రజలు చెప్పిన సమస్యలు, ఫిర్యాదులను రాజీవ్ తన తల్లి దృష్టికి తీసుకెళ్లేవారని పేర్కొన్నారు.
ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్య హక్కులు నిలిపివేశారని సోనియా అంగీకరించారు. హేబియస్ కార్పస్ హక్కును కూడా రద్దు చేశారని చెప్పారు. అయితే అప్పటి పరిస్థితులు ఇందిరాగాంధీని తీవ్ర ఒత్తిడికి గురిచేశాయని వివరించారు. హింసాత్మక ఆందోళనలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా రవాణా వ్యవస్థపై దాడులు జరిగాయని గుర్తుచేశారు. ప్రభుత్వ అధికారులు, సాయుధ దళాలు ఆదేశాలను ధిక్కరించాలన్న పిలుపులు కూడా వచ్చాయని తెలిపారు.
తర్వాత పరిస్థితులను అర్థం చేసుకున్న ఇందిరాగాంధీనే 1977 మార్చిలో ఎన్నికలకు పిలుపునిచ్చారని సోనియా గుర్తుచేశారు.
నవంబరు 10న సోనియా రాసిన 'బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్' పుస్తకం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ ఇంటర్వ్యూను రాహుల్‌గాంధీ ఎక్స్‌లో పంచుకున్నారు. ప్రజా జీవితంలో ఆరు దశాబ్దాలు గడిచినా తన తల్లి వ్యక్తిత్వం మారలేదని, ఆమె తన తల్లి కావడం గర్వంగా ఉందని పేర్కొన్నారు.