శ్రీరాముడి వనవాసం 14 ఏళ్లే.. నాకు మాత్రం ఇంకా ముగియలేదు: రేణూ దేశాయ్

Entertainment
Advertisement
  • పవన్ కల్యాణ్‌తో విడాకులపై 14 ఏళ్ల తర్వాత రేణూ దేశాయ్ ఆవేదన
  • శ్రీరాముడి వనవాసంతో తన పరిస్థితిని పోల్చుకున్న నటి
  • విడాకుల తర్వాత తన విజయాలను ఎవరూ గుర్తించడం లేదని ఆవేదన
  • సోషల్ మీడియా ట్రోలింగ్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన రేణూ దేశాయ్
  • తన జీవితం 'బద్రి' సినిమాతోనే మొదలైనట్లు చూడటం బాధాకరమన్న రేణూ
Advertisement
నటుడు, ఏపీ డిప్యూటీ పవన్ కల్యాణ్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్ తన గుర్తింపు, వ్యక్తిగత జీవితంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్‌తో విడాకులు తీసుకుని 14 ఏళ్లు పూర్తయినా, ప్రజలు ఇప్పటికీ తనను ఆయనతో ముడిపెట్టి చూడటంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీరాముడి వనవాసం 14 ఏళ్లకే ముగిసిందని, కానీ తన 'వనవాసం' ఎప్పుడు ముగుస్తుందోనని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.

ఇటీవల ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడిన రేణూ దేశాయ్.. తెలుగు ప్రజల దృష్టిలో తన జీవితం 1999లో 'బద్రి' సినిమాతోనే మొదలైనట్లుగా చూస్తారని, అంతకుముందు తనకంటూ ఒక ఉనికి లేనట్లుగా వ్యవహరిస్తారని అన్నారు. 

"నా జీవితం 1999 జూన్‌లో బద్రి సినిమా కోసం వచ్చినప్పుడే మొదలైనట్లు ప్రజలు భావిస్తారు. దానికి ముందు నాకు జీవితం లేదా? 14 ఏళ్లు గడిచాయి. సాక్షాత్తూ శ్రీరాముడికే 14 ఏళ్లకే వనవాసం ముగిసింది. నా ఈ వనవాసం ఎప్పుడు ముగుస్తుంది?" అని ఆమె ఆవేదనతో ప్రశ్నించారు.

2012లో విడాకులు తీసుకున్న తర్వాత తాను సాధించిన విజయాలను ఎవరూ గుర్తించడం లేదని రేణూ వాపోయారు. "విడాకుల తర్వాత మరాఠీలో ఒక సూపర్ హిట్ సినిమా నిర్మించాను. మరొక చిత్రానికి రచన, దర్శకత్వం చేసి, నిర్మించాను. ఒక డ్యాన్స్ షోలో పాల్గొన్నాను, కవిత్వం రాస్తున్నాను, ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటిస్తున్నాను. నేనేమీ కాకపోతే నన్ను పనుల కోసం ఎందుకు పిలుస్తారు?" అని ఆమె నిలదీశారు.

సోషల్ మీడియాలో తాను ఎదుర్కొంటున్న ట్రోలింగ్‌పై కూడా ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. "నేను ఒక కుక్క పిల్లను కాపాడితే కూడా నన్ను తిడుతున్నారు. పవన్ లేకుండా ఆమె బతకకూడదు అన్నట్లుగా దూషిస్తున్నారు" అని తన ఆవేదనను పంచుకున్నారు.

పవన్ కల్యాణ్, రేణూ దేశాయ్ 2012లో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పవన్ జనసేన పార్టీ అధ్యక్షుడిగా, ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. రేణూతో విడాకుల అనంతరం ఆయన అన్నా లెజ్‌నెవాను వివాహం చేసుకున్నారు. 

పవన్-రేణూ దంపతులకు కుమారుడు అకీరా, కుమార్తె ఆద్య ఉండగా.. పవన్-అన్నా దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. కాగా, రేణూ దేశాయ్ 'బద్రి', 'జానీ' చిత్రాల్లో నటించకముందే ముంబైలో మోడల్‌గా రాణించి, పలు వాణిజ్య ప్రకటనలలో, ప్రముఖ 'బ్రీత్‌లెస్' మ్యూజిక్ వీడియోలో కూడా కనిపించారు.
Advertisement

సంబంధిత వార్తలు

Renu DesaiPawan KalyanRenu Desai InterviewAkira NandanTollywood NewsRenu Desai Comments

More Telugu News

'సీన్' - మూవీ రివ్యూ!

06 Nov, 14:09

మీ బట్టలు త్వరగా పాడవుతున్నాయా?.. ఈ తప్పులే కారణం కావచ్చు!

06 Nov, 13:48

దీపావళి కానుకలతోనూ కాలుష్యం పెరుగుతోంది.. ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!

06 Nov, 13:32

ప్రపంచకప్‌కు ఇది రిహార్సల్.. కివీస్ సిరీస్‌పై కెప్టెన్ గిల్ కీలక వ్యాఖ్యలు

06 Nov, 13:27

ప్రకాశం తీరంలో విషాదం.. తమిళ మత్స్యకారుల మృతిపై చంద్రబాబు దిగ్భ్రాంతి

06 Nov, 13:21

5 అడుగుల 3 అంగుళాల గడ్డంతో గిన్నిస్ రికార్డ్.. ఈయన కథే వేరు!

06 Nov, 13:15

ఒక్క ఎకరం అమ్మినట్టు నిరూపించినా ఊడిగం చేస్తా: ప్రభుత్వానికి మాధవరం కృష్ణారావు సవాల్

06 Nov, 13:06

కాంగ్రెస్‌లో అంతర్గత వివాదం.. పిలిచినా రాని మంత్రి? అధిష్ఠానికి పీసీసీ చీఫ్‌ నివేదిక?

06 Nov, 13:05

‘‘రూ.250 కోట్లు ఖర్చు చేశాం.. ఇది మోసం కాదు’’: రూ.85 వేల టెంపుల్‌ గ్యాడ్జెట్‌పై దీపిందర్‌ గోయల్‌!

06 Nov, 12:57

వన్ మినిట్ వీడియోలతో విష ప్రచారం చేస్తున్నారు: బీద రవిచంద్ర

06 Nov, 12:33

బంగారం Vs వెండి Vs గోల్డ్‌ ఈటీఎఫ్‌లు.. ధనత్రయోదశి వేళ ఏది కొనాలి?

06 Nov, 12:30

హైదరాబాద్‌కు రసాయనాలతో తయారు చేసిన కల్తీ పాల సరఫరా.. రంగారెడ్డి జిల్లాలో గుట్టురట్టు!

06 Nov, 12:27

రాముడు, రావణుడి అసలైన వైభవాన్ని, శక్తిని చూడాలంటే తప్పకుండా 'రామాయణ' చూడాలి: సందీప్ వంగా

06 Nov, 12:06

వాట్సాప్‌లో ఇక బ్లూ టిక్స్‌ భయం లేదు.. చాట్‌ ఓపెన్‌ చేయకుండానే మెసేజ్‌లు చదవొచ్చు!

06 Nov, 12:04
..More Telugu News