గూగుల్‌ ఫొటోస్‌లో కీలక మార్పు.. డిలీట్‌ చేసిన ఫొటోలు 30 రోజులే!

Technology
Advertisement
  • గూగుల్‌ ఫొటోస్‌ బిన్‌ గడువు 60 నుంచి 30 రోజులకు తగ్గింపు
  • 2026 డిసెంబర్‌ 5 నుంచి కొత్త విధానం అమలు
  • అప్పటికే బిన్‌లో ఉన్న ఫొటోలకు పాత గడువే వర్తింపు
  • గడువు దాటితే ఫొటోలు శాశ్వతంగా తొలగింపు
  • పోస్టర్ల నుంచి ఈవెంట్‌ వివరాలను గుర్తించే ఏఐ ఫీచర్‌
Advertisement
గూగుల్‌ ఫొటోస్‌ వినియోగదారులకు కీలక సమాచారం. యాప్‌లో డిలీట్‌ చేసిన ఫొటోలు, వీడియోలను తిరిగి పొందేందుకు ప్రస్తుతం ఇస్తున్న 60 రోజుల గడువును గూగుల్‌ 30 రోజులకు తగ్గించనుంది. ఈ కొత్త విధానం డిసెంబర్‌ 5 నుంచి అమల్లోకి రానుంది. మరోవైపు ఫొటోల్లోని ఈవెంట్‌ వివరాలను గుర్తించి నేరుగా గూగుల్‌ క్యాలెండర్‌లో నమోదు చేసే కొత్త ఫీచర్‌ను కూడా తీసుకొచ్చేందుకు సంస్థ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

డిసెంబర్‌ 5 నుంచి బిన్‌లోకి వెళ్లే కొత్త ఫైళ్లకు మాత్రమే ఈ మార్పు వర్తిస్తుంది. అంతకు ముందే బిన్‌లో ఉన్న ఫొటోలు, వీడియోలకు మాత్రం పాత 60 రోజుల గడువే కొనసాగుతుంది. నిర్దేశిత గడువు ముగిసిన తర్వాత అవి శాశ్వతంగా తొలగిపోతాయి. ఆ తర్వాత బిన్‌ నుంచి తిరిగి పొందడం సాధ్యం కాదు. కాబట్టి పొరపాటున ఫొటోలు తొలగించినవారు ఆలస్యం చేయకుండా వాటిని రికవర్‌ చేసుకోవడం మంచిది.

మరోవైపు గూగుల్‌ ఫొటోస్‌లో త్వరలో కొత్త ఫీచర్‌ అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఫొటోల్లో ఉన్న ఈవెంట్‌ పోస్టర్లు, ప్రకటనలను గుర్తించి వాటిలోని వివరాలతో నేరుగా క్యాలెండర్‌లో ఈవెంట్‌ నమోదు చేసుకునే సదుపాయాన్ని తీసుకొస్తున్నట్లు ఆండ్రాయిడ్‌ అథారిటీ కథనం వెల్లడించింది.

గూగుల్‌ ఫొటోస్‌ 8.0 యాప్‌ కోడ్‌ను పరిశీలించినప్పుడు 'యాడ్‌ టు క్యాలెండర్‌' అనే ఆప్షన్‌ కనిపించినట్లు తెలిపింది. గూగుల్‌ ఏఐ ఆధారిత 'ఆస్క్‌ ఫొటోస్‌' ఫీచర్‌ సాయంతో పోస్టర్‌లోని కార్యక్రమం పేరు, తేదీ, సమయం, వివరణను గుర్తించి క్యాలెండర్‌లో నమోదు చేసేలా దీన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం వినియోగదారులు క్యాలెండర్‌ యాక్సెస్‌కు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఆటోమేటిక్‌గా రూపొందించిన క్యాలెండర్‌ ఎంట్రీలో అసలు పోస్టర్‌ ఫొటోకు లింక్‌ కూడా ఉంటుందని సమాచారం.
Advertisement

సంబంధిత వార్తలు

Google PhotosGoogle Photos Trash RecoveryGoogle Photos 30 Days PolicyGoogle Photos Calendar FeatureGoogle Photos AI UpdateGoogle Photos Trash Limit

More Telugu News

కనిపించకుండా పోయిన చిలుక ఆచూకీ చెప్పండి.. లక్ష రివార్డ్ పొందండి!

05 Nov, 18:45

'హోం రాడికలైజేషన్'.. యువత తల్లిదండ్రులే ఉగ్రవాదుల కొత్త ఆయుధం!

05 Nov, 18:17

ఏపీలో ముగిసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్.. ఎల్లుండి కౌంటింగ్

05 Nov, 18:11

బీసీ సంఘాలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. ఆత్మగౌరవ భవనాలకు భారీగా నిధులు

05 Nov, 17:57

బాబర్ ఆజంతో ఇబ్బంది లేదు.. అతడి అభిమానులే విషపూరితం: అజామ్ ఖాన్

05 Nov, 17:50

కొఠియా గ్రామాల్లో ఓటర్లను అడ్డుకుంటున్న ఒడిశా పోలీసులు.. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వార్నింగ్

05 Nov, 17:20

ఫుట్‌బాల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో రిటైర్‌.. 23 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు

05 Nov, 17:17

ఫలితాలు తేడాగా వస్తాయని చంద్రబాబుకు భయం పట్టుకుంది: వల్లభనేని వంశీ

05 Nov, 17:11

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.. ఓటమి భయంతోనే వైసీపీ అరాచకాలు: పల్లా

05 Nov, 16:45

ఈ సినిమాలో యాక్టర్లందరికీ మంచి పేరొస్తుంది: 'సమ్మర్ హాలిడేస్' దర్శకుడు శ్రీకర్ నయన్

05 Nov, 16:34

మురిసిన మార్కెట్లు.. మదుపర్లకు రూ.8 లక్షల కోట్ల లాభం!

05 Nov, 16:30

కల్యాణదుర్గం ఎమ్మెల్యేపై దాడికి వైసీపీ యత్నం.. గన్‌మన్‌కు గాయాలు

05 Nov, 16:15

"సాయన్న పేరులోనే సాయముందిరా!".. పార్టీ సన్నాహక గీతం పంచుకున్న విజయసాయిరెడ్డి

05 Nov, 16:13

ఉద్యోగులకు స్వచ్ఛంద నిష్క్రమణ ఆఫర్‌.. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ బాటలో మెటా!

05 Nov, 16:13
..More Telugu News