రావణుడిగా యశ్ విశ్వరూపం.. అద్భుత నటనతో కట్టిపడేసిన రాకింగ్ స్టార్.. రామాయణలో యాక్టింగ్‌కు ప్రేక్ష‌కులు ఫిదా!

Entertainment
Advertisement
  • రామాయణ చిత్రంలో రావణుడిగా యశ్ నటనకు విశేష స్పందన
  • అధికారం, గర్వం, సంక్లిష్టత కలగలిసిన పాత్రలో అద్భుతమైన హావభావాలు
  • జటాయువుతో పోరాట ఘట్టం భారతీయ సినిమాకు ఓ కొత్త బెంచ్‌మార్క్
  • కమర్షియల్ ఫార్ములాను పక్కనపెట్టి సంక్లిష్టమైన పాత్రను ఎంచుకున్న వైనం
  • నటుడిగానే కాకుండా నిర్మాతగానూ భారతీయ కథలను ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం
Advertisement
ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘రామాయణ’ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంటోంది. ఈ సినిమాలో ఎన్నో అద్భుత ఘట్టాలు ఉన్నప్పటికీ, ఒక నటన మాత్రం ప్రేక్షకుల మదిలో బలంగా నిలిచిపోతోంది. ఆ పాత్రే రావణుడు. ఆ పాత్రలో జీవించిన నటుడే యశ్. 'కేజీఎఫ్' సిరీస్‌ చిత్రాలతో పాన్-ఇండియా సూపర్‌స్టార్‌గా ఎదిగిన యశ్, రావణుడి పాత్రలో తన స్క్రీన్ ప్రెజెన్స్, నటనలోని లోతుతో మరోసారి తన సత్తా ఏమిటో నిరూపించుకున్నాడు. కేవలం స్టార్‌డమ్‌తో తెరను శాసించడమే కాదు, ప్రతి సినిమాతో తన నటనలోని సరిహద్దులను చెరిపేస్తున్న అద్భుతమైన నటుడని మరోసారి చాటిచెప్పాడు.

తెరపై కనిపించిన మొదటి క్షణం నుంచే యశ్ తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన‌ట్లు తెలుస్తోంది. రావణుడిలోని అధికారం, ఆకాంక్ష, గర్వం, సంక్లిష్టత వంటి విభిన్న కోణాలను అద్భుతంగా ఆవిష్కరించాడ‌నేది ప్రేక్ష‌కుల మాట‌. ఒకవైపు తపస్సు చేసే రుషిగా సంయమనం పాటిస్తూనే, మరోవైపు ముల్లోకాలను ఏలే చక్రవర్తిగా రాజసాన్ని ప్రదర్శించాడని చెబుతున్నారు. ముఖ్యంగా పది తలల రావణుడిగా కనిపించే సన్నివేశాల్లో, ప్రతి తలకూ ఒక్కో భావాన్ని పలికిస్తూ పాత్రలోని గాంభీర్యాన్ని, వ్యక్తిత్వంలోని వైవిధ్యాన్ని అద్భుతంగా చూపించాడని అంటున్నారు. అతని హావభావాలు, బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రెజెన్స్ కలిసి రావణుడి పాత్రకు ప్రాణం పోశాయని చెబుతున్నారు.

ఈ చిత్రంలోని అత్యంత కీలక ఘట్టాలు యశ్ నటనతో మరో స్థాయికి వెళ్లాయి. కుబేరుడితో ఘర్షణ, ఇంద్రుడితో యుద్ధం, ముఖ్యంగా జటాయువుతో జరిగే పోరాట ఘట్టం సినిమాకే హైలైట్‌గా నిలిచాయి. జటాయువు-రావణుడి మధ్య వచ్చే ఆ పోరాట సన్నివేశం.. దాని స్కేల్, విజువల్స్, తీవ్రత పరంగా భారతీయ సినిమాకు ఒక కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసిందనడంలో ఎలాంటి సందేహం లేద‌ంటున్నారు. ఆ సన్నివేశాల్లో యశ్ నటన చూసి ప్రేక్షకులు అబ్బురపడ్డారని తెలుస్తోంది.  

ఒక నటుడిగా యశ్ ప్రస్థానంలో రావణుడి పాత్ర ఎంతో ప్రత్యేకం. తన కెరీర్ పతాకస్థాయిలో ఉన్న ఈ దశలో, కేవలం కమర్షియల్ ఫార్ములా చిత్రాలకే పరిమితం కాకుండా, రావణుడి వంటి సంక్లిష్టమైన, చాలెంజింగ్ పాత్రను ఎంచుకోవడం నటుడిగా అతనికున్న తపనకు, ధైర్యానికి నిదర్శనం. ఇది ఆయన కెరీర్‌లో ఒక సాహసోపేతమైన నిర్ణయం.

నటనకు అతీతంగా, ఈ చిత్రానికి సహ నిర్మాతగా యశ్ అందించిన సహకారం కూడా ఎంతో విలువైంది. నమిత్ మల్హోత్రాతో కలిసి నిర్మాతగా మారి, కేవలం తన స్టార్‌డమ్‌నే కాకుండా భారతీయ సినిమాపై తనకున్న దార్శనికతను కూడా ఈ ప్రాజెక్టులో చూపించాడు. భారతీయ సంస్కృతి, పురాణాల్లోని కథలను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరవేయాలనే వారి లక్ష్యం ఈ సినిమా నిర్మాణంలో స్పష్టంగా కనిపిస్తుంది. నటుడిగా, నిర్మాతగా సినిమా స్కేల్, కథనం, దాని శక్తిపై యశ్‌కు ఉన్న పట్టు అమోఘం.

'రామాయణ' చిత్రంతో యశ్ తనలోని నటుడికి కొత్త సవాళ్లను విసురుతూ, భారతీయ సినిమా స్థాయిని పెంచడంలో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. రావణుడి పాత్రలో, ప్రేక్షకులు ఒక సూపర్‌స్టార్‌ను మాత్రమే కాదు, నిరంతరం పరిణామం చెందుతూ, ప్రయోగాలు చేస్తూ, తన నటనతో ఆశ్చర్యపరిచే ఒక గొప్ప నటుడిని చూస్తారు. యశ్ కేవలం ఫ్రేమ్‌లోకి రాడు, ఫ్రేమ్‌ను శాసిస్తాడు అని విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

YashRamayana movieRavana roleRocking Star YashYash acting performanceIndian epic cinema

More Telugu News

పరిషత్ పోలింగ్‌లో ఉద్రిక్తత.. బ్యాలెట్ బాక్సును బద్దలుకొట్టిన వైసీపీ నేతలు!

05 Nov, 14:18

'యు కాంట్ సీ మీ'.. జాన్ సేనా స్టైల్‌లో కివీస్ బ్యాటర్‌ను ఆటపట్టించిన కోహ్లీ.. వీడియో వైరల్!

05 Nov, 14:08

తిరుమల లడ్డూ కేసు విచారణ ఏపీలోనే.. బదిలీ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు

05 Nov, 13:56

ముంబయి ఇండియన్స్‌లో హార్దిక్‌ ఒంటరిగా ఫీలయ్యాడా? అంబటి రాయుడు కీలక వ్యాఖ్యలు

05 Nov, 13:53

సీజేపీకి విదేశీ నిధులు.. దేశంలో అశాంతికి కుట్ర: కేంద్రం సంచలన ఆరోపణలు

05 Nov, 13:46

‘ఆర్ఆర్‌ ట్యాక్స్‌’ నిజమే అయితే చర్యలేవి? మోదీ, షాలకు కేటీఆర్‌ ప్రశ్న

05 Nov, 13:37

అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘జైలర్‌ 2’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

05 Nov, 13:09

రూ.1020 కోట్ల కొకైన్ స్మగ్లింగ్ యత్నం.. టీ కోసం లారీ డ్రైవర్ ఆగడంతో బ‌య‌ట‌ప‌డ్డ‌ కుట్ర!

05 Nov, 13:01

గొడవలతో నష్టపోయేది కార్యకర్తలే.. మేం బాగానే వుంటాం: జేసీ ప్రభాకర్‌రెడ్డి

05 Nov, 12:58

రాత్రి, ఉదయం వేళల్లో గాలిలో కాలుష్యం ఎందుకు పెరుగుతుంది?

05 Nov, 12:56

'రామాయణం - పార్టు 1' (మూవీ రివ్యూ)

05 Nov, 12:53

సెంచరీలు కాదు.. 43 పరుగుల ఇన్నింగ్సే బెస్ట్‌.. కోహ్లీ ఎంపిక వెనుక ఆసక్తికర కారణం

05 Nov, 12:40

ఓటేసిన పరిటాల కుటుంబం.. వైసీపీపై సునీత విమర్శలు

05 Nov, 12:37

ఏపీ పరిషత్ ఎన్నికల్లో ఓటు వేసిన బోయపాటి శ్రీను

05 Nov, 12:24
..More Telugu News