మున్సిపల్ ఎన్నికల ఫలితాలే పరిషత్ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతాయి: మంత్రి బాల వీరాంజనేయస్వామి

Andhra
Advertisement
  • ఏపీలో కొనసాగుతున్న పరిషత్ ఎన్నికల పోలింగ్
  • టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో ఓటు వేసిన వీరాంజనేయ స్వామి
  • వైసీపీ నేతలను జగన్ బలవంతంగా ఎన్నికల బరిలో నిలబెట్టారని విమర్శ
Advertisement
ఆంధ్రప్రదేశ్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. కొన్ని చోట్ల మినహా మిగిలిన అన్ని చోట్ల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలోని పోలింగ్ కేంద్రంలో మంత్రి బాల వీరాంజనేయ స్వామి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... మున్సిపల్ ఎన్నికల ఫలితాలే పరిషత్ ఎన్నికల్లోనూ పునరావృతం కాబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఏకపక్షంగా కూటమి పార్టీలకు ఓట్లు వేస్తున్నారని మంత్రి తెలిపారు. గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్ బలవంతంగా ఆ పార్టీ నాయకులను ఎన్నికల బరిలో నిలబెట్టారని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో పోటీ చేసి ఆర్థికంగా నష్టపోయామని వైసీపీ అభ్యర్థులే వాపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల తీర్పు చూసైనా ఆ పార్టీ నేతలు బుద్ధి తెచ్చుకోవాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 28 జెడ్పీల్లో 582 జడ్పీటీసీ స్థానాలకు, 659 ఎంపీపీల్లో 7,767 ఎంపీటీసీ స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. జడ్పీటీసీ స్థానాలకు 2,169 మంది, ఎంపీటీసీ స్థానాలకు 18,843 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

ఉదయం 9 గంటల సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 4.8 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 9.44 శాతం, అత్యల్పంగా బాపట్ల జిల్లాలో 1.38 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు.
Advertisement

సంబంధిత వార్తలు

Bala Veeranjaneya SwamyAndhra Pradesh Parishad ElectionsZPTC MPTC PollingPrakasam District NewsAP Local Body ElectionsYSRCP vs Alliance

More Telugu News

ఏపీ పరిషత్ ఎన్నికల్లో ఓటు వేసిన బోయపాటి శ్రీను

05 Nov, 12:24

ఒంటిపై పాములు, త్రిశూలాలు.. యశ్‌ 'రావణ' పాత్ర ఆభరణాల ప్రత్యేకతలివే!

05 Nov, 12:23

ఒబామా తర్వాత డెమోక్రాట్ల ఆశాకిరణం.. 2028 అధ్యక్ష రేసులో జాన్ ఒసాఫ్‌ పేరు!

05 Nov, 12:21

హత్య కేసు నిందితుడికి బెయిల్.. బైక్ ర్యాలీతో హీరోలా స్వాగతం!

05 Nov, 12:17

బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి హౌస్ అరెస్ట్.. శబరిని ఎందుకు వదిలేశారంటూ వైసీపీ ప్రశ్న

05 Nov, 12:01

చాహల్‌పై ఆర్‌జే మహ్వష్ ఆరోపణలు చేశారా?.. వైరల్ క్లిప్‌లోని అసలు నిజమిదే!

05 Nov, 11:58

విమానం బాత్రూంలో ఇమడలేకపోయిన పొడగరి.. కానీ నెటిజన్లు ఫోకస్ వేరే!

05 Nov, 11:50

భారతదేశంలోనే ‘మినీ ఇజ్రాయెల్‌’.. హిమాలయాల్లో దాగున్న ఈ గ్రామం ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

05 Nov, 11:45

పులివెందుల ఎర్రిపల్లెలో పెట్రోల్ బాంబులతో దాడులు.. తీవ్ర ఉద్రిక్తత

05 Nov, 11:42

అంతర్జాతీయ పరిణామాలతో దూసుకెళ్లిన పసిడి.. ఒక్కరోజే రూ.5,000 పెరిగిన బంగారం

05 Nov, 11:41

ప్రవళిక మృతితో ఆర్టీసీ కీలక నిర్ణయం.. డోర్లు మూస్తేనే బస్సు ముందుకు!

05 Nov, 11:24

రామాయణం చివర్లో సన్నీ డియోల్ ఎంట్రీ... హనుమంతుడిగా అదుర్స్

05 Nov, 11:23

కూటమి బలాన్ని తట్టుకుని పోరాడాం: జీవీఎంసీ ఓటమిపై వరుదు కల్యాణి

05 Nov, 11:21

ఖాళీ గదిలో మాట్లాడితే శబ్దం ఎందుకు ఎక్కువగా వస్తుంది?.. సైన్స్ ఏం చెబుతోంది?

05 Nov, 11:20

వైభవ్‌ సూర్యవంశీకి వైస్‌ కెప్టెన్సీ.. సచిన్‌ ఏమన్నారంటే..!

05 Nov, 11:18
..More Telugu News