అమెరికాతో డీల్‌పై భారత్ ఆచితూచి అడుగులు.. కలిసిరానున్న ఎన్నికల ఫలితాలు!
Advertisement
- అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై భారత్‌కు తగ్గిన తొందర
- రిపబ్లికన్లకు పట్టు తగ్గడంతో సుంకాల విషయంలో కలిసి రావొచ్చని అంచనా
- ఈ పరిణామం భారత ఆర్థిక వ్యవస్థకు సానుకూలమన్న ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్
- ఇకపై అదనపు సుంకాలు విధించాలంటే సెక్షన్ 301, 232 కింద విచారణలు తప్పనిసరి
- దీంతో భారత్‌కు అకస్మాత్తుగా సుంకాల షాక్ తగిలే ప్రమాదం తగ్గుతుందని అంచనా
Advertisement
అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలన్న భారత్ తొందర తగ్గిందని ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తాజా నివేదిక వెల్లడించింది. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లు కాంగ్రెస్‌పై పూర్తి ఆధిపత్యం కోల్పోవడంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ కొంత తగ్గిందని విశ్లేషించింది. దీంతో భారత్‌పై సుంకాల విషయంలో ఆకస్మిక ఒత్తిళ్లు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. ఈ పరిణామం భారత ఆర్థిక వ్యవస్థకు సానుకూలమని తెలిపింది.
అమెరికా గతంలో ప్రకటించిన 18 శాతం సుంకాల విధానం అమల్లోకి రాలేదు. ప్రస్తుతం భారత వస్తువులపై 10 శాతం సెక్షన్ 301 సుంకం మాత్రమే అమలవుతోందని నివేదిక వివరించింది. అంతేకాకుండా, అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (ఐఈఈపీఏ) ద్వారా ట్రంప్‌కు ఉన్న ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం కూడా తగ్గిందని పేర్కొంది. ఇకపై అదనపు సుంకాలు విధించాలంటే సెక్షన్ 301, 232 కింద విచారణలు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ ప్రక్రియకు ఎక్కువ సమయం పడుతుంది. దీంతో భారత్‌కు అకస్మాత్తుగా సుంకాల షాక్ తగిలే ప్రమాదం తగ్గుతుందని అంచనా వేసింది.
అయితే వాణిజ్య రంగంలో అనిశ్చితి పూర్తిగా తొలగిపోలేదని నివేదిక హెచ్చరించింది. ఫార్మా, ఎలక్ట్రానిక్స్ రంగాలపై సెక్షన్ 232 కింద అదనపు సుంకాలు విధించే ప్రమాదం ఉందని పేర్కొంది. రష్యా, ఇరాన్‌తో దౌత్య సంబంధాల్లో ప్రతికూల పరిణామాలు ఎదురైతే.. భారత్ చమురు దిగుమతులపై మళ్లీ ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని తెలిపింది. 2028 ఎన్నికలకు ముందు వినియోగదారులకు ధరల ఉపశమనం కల్పించాల్సిన రాజకీయ అవసరం ట్రంప్‌పై ఉంటుందని విశ్లేషించింది.
మరోవైపు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడం భారత్‌కు ఊరటనిస్తోంది. అక్టోబర్ 2026లో నమోదైన గరిష్ఠ స్థాయులతో పోలిస్తే బ్రెంట్ క్రూడ్ ధర 19 శాతం తగ్గి బ్యారెల్‌కు 95 డాలర్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు భారత్ చమురు దిగుమతుల బిల్లు 24 శాతం పెరిగింది. ఈ నేపథ్యంలో ధరల తగ్గుదల విదేశీ మారక నిల్వలపై ఒత్తిడిని తగ్గించనుంది.
చమురు ధరలు తగ్గడం, డాలర్ బలహీనపడటం రూపాయి స్థిరత్వానికి దోహదపడతాయని నివేదిక పేర్కొంది. అయితే ఆర్బీఐ వద్ద 239 బిలియన్ డాలర్ల ఫార్వర్డ్ డాలర్ బాధ్యతలు ఉండటంతో రూపాయి మరింత బలపడటానికి పరిమితులు ఉండొచ్చని అంచనా వేసింది. మరోవైపు అమెరికాలో ద్రవ్యోల్బణం అధికంగానే కొనసాగితే వడ్డీ రేట్లు త్వరగా తగ్గకపోవచ్చని తెలిపింది. దీంతో ఆర్బీఐ అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుందని నివేదిక వివరించింది.