టీడీపీ పోలింగ్ ఏజెంట్లను బయటకు తోసేసిన వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి
Advertisement
- ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌లో ఉద్రిక్తతలు
- పల్నాడు, కడప, పులివెందులలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణలు
- కడప జిల్లా గుండ్లకుంట పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత
Advertisement
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌లో పలుచోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా కడప, పల్నాడు, పులివెందుల ప్రాంతాల్లో ఉద్రిక్త ఘటనలు నమోదయ్యాయి.
కడప జిల్లా పెద్దముడియం మండలం గుండ్లకుంట పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ పోలింగ్ ఏజెంట్లను బూత్ నుంచి వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి బలవంతంగా బయటకు తోసేశారు. ఈ ఘటనతో అక్కడ ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
మరోవైపు పల్నాడు జిల్లా, ముప్పాళ్ల మండలం లంకెలకూరపాడు గ్రామంలో నిన్న అర్ధరాత్రి టీడీపీ కార్యకర్తలపై దాడి జరిగింది. వైసీపీ వర్గీయులు కర్రలతో దాడి చేయడంతో ముగ్గురు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదేవిధంగా పులివెందులలోని ఆర్.తుమ్మలపల్లిలో కూడా ఇరు పార్టీల వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది.