‘‘సుప్రియా చూసుకుంటారు.. ఇక మీరు విశ్రాంతి తీసుకోండి’’: శరద్ పవార్‌తో ఫోన్‌లో ప్రధాని మోదీ
Advertisement
- అనారోగ్యంతో బాధపడుతున్న శరద్ పవార్‌ను ఫోన్ చేసి పలకరించిన మోదీ
- దేశ బాధ్యతలను సుప్రియా చూసుకుంటుందని ప్రధాని అన్నట్లు పార్టీల వర్గాల సమాచారం
- దీంతో ఎన్సీపీ వర్గాల విలీనం, సుప్రియా సూలేకు కేంద్ర మంత్రివర్గంలో చోటు వంటి అంశాలపై ఊహాగానాలు
- 2023లో అజిత్ పవార్ తిరుగుబాటుతో రెండు వర్గాలుగా విడిపోయిన ఎన్సీపీ
- రాజకీయంగా మోదీ ఫోన్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందన్నది ఆసక్తికరం
Advertisement
మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి పవార్ కుటుంబం చుట్టూ చర్చ మొదలైంది. ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేయడం ఆసక్తికర పరిణామాలకు దారితీసింది. ఆయన కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే ప్రస్తావన రావడం రాజకీయ వర్గాల్లో మరింత చర్చకు కారణమైంది. ‘‘సుప్రియా సిద్ధంగా ఉన్నారు. దేశ బాధ్యతలను ఆమె చూసుకుంటారు. మీరు విశ్రాంతి తీసుకోండి’’ అని మోదీ చెప్పినట్లు శరద్ పవార్ సన్నిహితుడు విఠల్ మణియార్ వెల్లడించారు. దీంతో ఎన్సీపీ వర్గాల విలీనం, సుప్రియా సూలేకు కేంద్ర మంత్రివర్గంలో చోటు వంటి అంశాలపై ఊహాగానాలు ఊపందుకున్నాయి.
శరద్ పవార్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు బుధవారం ఉదయం మోదీ ఫోన్ చేసినట్లు మణియార్ తెలిపారు. ఇటీవల దగ్గు, ఛాతీ నొప్పితో నవంబర్ 2న పుణెలోని రూబీ హాల్ క్లినిక్‌లో పవార్ చేరారు. అక్కడ వైద్య పరీక్షలు పూర్తయ్యాక డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో తదుపరి పరీక్షల కోసం చేరారు. మోదీ ఫోన్‌లో విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు మణియార్ చెప్పారు.
2023లో అజిత్ పవార్ తిరుగుబాటుతో ఎన్సీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వంలో అజిత్ వర్గం కొనసాగింది. 2026 జనవరిలో విమాన ప్రమాదంలో అజిత్ మరణించడంతో విలీన చర్చలు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఆయన భార్య సునేత్ర పవార్ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఇటీవల అజిత్ వర్గానికి చెందిన నేతలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమవడం కూడా చర్చకు దారితీసింది.
ముంబయిలో జరిగిన కోర్ కమిటీ సమావేశం అనంతరం రెండు వర్గాల విలీనానికి అవకాశం లేదని మహారాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడు సునీల్ తట్కరే ప్రకటించారు. సునేత్ర పవార్ నాయకత్వంలోనే పనిచేస్తామని స్పష్టం చేశారు. అయితే అమిత్ షాతో జరిగిన సమావేశంలో విలీన అంశం ప్రస్తావనకు వచ్చిందని తెలిపారు. మరోవైపు శరద్ పవార్ గతంలో ఎన్డీయేకు అనుకూలంగా ఉన్న ఎన్సీపీ వర్గంతో విలీనం ఉండదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మోదీ ఫోన్ రాజకీయంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.