ఏపీపీఎస్సీ గ్రూప్-1 స్కామ్.. ఏపీ, తెలంగాణలో ఈడీ మెరుపుదాడులు
Advertisement
- ఏపీపీఎస్సీ గ్రూప్-1 కేసులో ఈడీ దూకుడు
- మాజీ ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు నివాసంలోనూ సోదాలు
- మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు
Advertisement
ఏపీపీఎస్సీ గ్రూప్-1 కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. ఈ ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తోంది.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఏపీపీఎస్సీ మాజీ కార్యదర్శి, మాజీ ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు నివాసంతో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాలు, మంగళగిరి సమీపంలోని హాయ్‌ల్యాండ్ రిసార్ట్ సహా మొత్తం ఏడు చోట్ల ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ఆంజనేయులు, క్యామ్‌సైన్ మీడియా, ఇతర ప్రైవేట్ సంస్థల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు దృష్టి సారించారు.
గత ప్రభుత్వ హయాంలో 2018లో 169 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 2020లో మెయిన్స్ పరీక్ష నిర్వహించారు. అయితే, జవాబు పత్రాల మూల్యాంకనంలో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై విచారణ జరిపిన సిట్... మంగళగిరి వద్ద హాయ్‌ల్యాండ్ రిసార్ట్‌లో 84 రోజుల పాటు మూల్యాంకనం చేశారని, అర్హత లేని 66 మందితో జవాబు పత్రాలను దిద్దించారని తన నివేదికలో తేల్చింది.
ఈ మూల్యాంకనం కోసం క్యామ్‌సైన్ మీడియాకు రూ.1.14 కోట్లు, ఇతర సంస్థలకు రూ.1.38 కోట్లు చెల్లించినట్టు సిట్ గుర్తించింది. ఈ నివేదిక ఆధారంగా 2025 ఏప్రిల్‌లో పోలీసులు కేసు నమోదు చేయగా, గతంలో పీఎస్ఆర్ ఆంజనేయులు, క్యామ్‌సైన్ మీడియా డైరెక్టర్‌ను అరెస్ట్ చేశారు. సిట్ దర్యాప్తు నివేదిక ఆధారంగానే, ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద కేసు నమోదు చేసి, తాజాగా సోదాలు చేపట్టింది.