కంగ్రాట్స్ చంద్రబాబు టీమ్!: జగన్
Advertisement
- మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన వైసీపీ అధినేత జగన్
- చంద్రబాబు, పోలీసులు, ఎస్ఈసీకి కంగ్రాట్స్ అంటూ వ్యంగ్యం
- ఇవి ఎన్నికలు కాదని, ఏకపక్షంగా జరిగిన సెలక్షన్లని ఆరోపణ
- నామినేషన్ల నుంచి కౌంటింగ్ వరకు ప్రక్రియను హైజాక్ చేశారని విమర్శ
- ఎన్నికల సంస్కరణల ఆవశ్యకత స్పష్టమైందని వ్యాఖ్య
Advertisement
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి ప్రభంజనం సృష్టిస్తున్న వేళ, వైసీపీ అధినేత జగన్ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. ఎన్నికల ప్రక్రియ ఏకపక్షంగా జరిగిందని ఆరోపిస్తూ, ఇవి ఎలక్షన్లు కావని, సెలెక్షన్లు అని ఆయన వ్యంగ్యం ప్రదర్శించారు.
చంద్రబాబు, పోలీసులు, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఉద్దేశించి జగన్ వ్యంగ్యంగా అభినందనలు తెలిపారు. "ప్రతిపక్షానికి పోటీ చేసే అవకాశమే ఇవ్వకుండా ఎన్నికల్లో అద్భుతంగా ఎలా గెలవచ్చో నిరూపించినందుకు చంద్రబాబు టీమ్, పోలీసులు, ఎస్ఈసీకి కంగ్రాట్స్!" అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.
నామినేషన్ల దగ్గరి నుంచి మొదలుకొని స్క్రూటినీ, నామినేషన్ల ఉపసంహరణ, పోలింగ్ ఏజెంట్ల నియామకం, పోలింగ్ సరళి, పోలింగ్ శాతం, చివరకు కౌంటింగ్ వరకు ప్రతీ దశను అధికార పక్షం హైజాక్ చేసిందని జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. అభ్యర్థులను ప్రజలు ఎన్నుకోలేదని, అధికార పార్టీయే వారిని సెలెక్ట్ చేసిందని ఎద్దేవా చేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో దేశంలో ఎన్నికల సంస్కరణలు ఎంత అవసరమో స్పష్టమవుతోందని జగన్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా వెలువడుతున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయం దిశగా దూసుకెళుతుండగా, వైసీపీ అనేకచోట్ల పరాజయం పాలవుతున్న నేపథ్యంలో జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.