సొంత ఖర్చుతోనే సింధు, లక్ష్యసేన్ విజయాలు.. భారత షట్లర్లకు నిధుల కష్టాలు!
Advertisement
- యూరప్ పర్యటనకు నిధులు విడుదల చేయని సాయ్
- ఆటగాళ్లే ప్రయాణం, భోజనం, వసతి ఖర్చులు భరించిన వైనం
- కొందరు ఆటగాళ్లు కోచ్‌లు లేకుండానే పోటీల్లో పాల్గొన్న దుస్థితి
- గడువులోగా ప్రతిపాదన ఇవ్వలేదని సాయ్ వివరణ
- ఆసియా క్రీడల ఫలితాల వల్లే నిధులు ఆగాయన్న వాదనను ఖండించిన సాయ్
Advertisement
భారత బ్యాడ్మింటన్ స్టార్లు పీవీ సింధు, లక్ష్యసేన్ యూరప్ పర్యటనలో టైటిళ్లు గెలిచి సత్తా చాటారు. అయితే ఆ టోర్నీలకు వెళ్లేందుకు అవసరమైన ఖర్చుల విషయంలో వాళ్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫిన్లాండ్, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీల్లో జరిగిన నాలుగు టోర్నీలకు భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) నిధులు విడుదల చేయలేదని సమాచారం. 'ఇండియన్ ఎక్స్ ప్రెస్'ను ఉటంకిస్తూ ‘ఇండియా టుడే’ కథనం ప్రకారం.. ప్రయాణం, భోజనం, వసతి ఖర్చులను ఆటగాళ్లే భరించాల్సి వచ్చింది. నిధులు అందకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన సింధు.. కొంత ఖర్చును తానే భరించానని, ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ సంస్థ కూడా సాయం చేసిందని తెలిపింది.
నిధుల కొరత ప్రభావం ఆటగాళ్ల సహాయక సిబ్బందిపైనా పడింది. కోచ్‌ల ఖర్చులు భరించలేక కొందరు వారిని వెంట తీసుకెళ్లలేకపోయారు. ఫ్రెంచ్ ఓపెన్‌లో అష్మితా చాలిహా, డెన్మార్క్ ఓపెన్‌లో తన్వీ శర్మ కోచ్ సహాయం లేకుండానే పోటీపడ్డారు. నిధులు నిలిచిపోవడానికి కారణంపై భిన్న కథనాలు వెలువడ్డాయి. ఆసియా క్రీడల్లో భారత బ్యాడ్మింటన్ జట్టు ప్రదర్శన దీనికి కారణమై ఉండొచ్చని కొందరు అనుమానించినా.. ఆ వాదనను సాయ్ అధికారి ఖండించారు. టోర్నీలకు 30 రోజుల ముందుగా సమర్పించాల్సిన ప్రతిపాదనను బ్యాడ్మింటన్ సంఘం (బీఏఐ) గడువులోగా ఇవ్వకపోవడంతో నిధులు విడుదల కాలేదని వివరించారు.
నిధుల ఇబ్బందుల నేపథ్యంలోనూ భారత ఆటగాళ్లు మంచి ఫలితాలు సాధించారు. జర్మనీలో జరిగిన హైలో ఓపెన్‌లో లక్ష్యసేన్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలవగా, సింధు మహిళల సింగిల్స్ విజేతగా నిలిచింది. ఈ ఏడాది ఆమెకు ఇది రెండో టైటిల్. మరోవైపు, రాబోయే టోర్నీలకు నిధుల సాయం పునరుద్ధరిస్తామని సాయ్ తెలిపినట్లు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పేర్కొంది. అయితే యూరప్ పర్యటనలో ఆటగాళ్లు స్వయంగా పెట్టుకున్న ఖర్చులను తిరిగి చెల్లించబోమని స్పష్టం చేసినట్లు తెలిపింది.