ఆఫీసులో దీపావళి డ్యాన్స్.. ఒక్క వీడియోతో ఇంటర్నెట్ స్టార్‌గా మారిన యువ‌తి!

Offbeat
Advertisement
  • ఆఫీసు దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్
  • 'ఝలా వాలా' పాటకు అదరగొట్టిన ఓషీన్ పాండ్యా
  • ఇన్‌స్టాగ్రామ్‌లో 2 కోట్లకు చేరువలో వ్యూస్
  • ఆమె డ్యాన్స్‌, స్మైల్‌కు నెటిజన్లు ఫిదా
  • ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో వైరల్
Advertisement
ఆఫీసులో జరిగే పండుగ వేడుకల్లో సరదాగా చేసే పనులు ఒక్కోసారి ఊహించని గుర్తింపును తెచ్చిపెడతాయి. చండీగఢ్‌కు చెందిన ఓషీన్ పాండ్యా విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. తన ఆఫీసులో జరిగిన దీపావళి పార్టీలో ఆమె చేసిన డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఆ వీడియోకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 2 కోట్ల (20 మిలియన్లు) వ్యూస్ రావడం విశేషం.

వివరాల్లోకి వెళితే.. ఓషీన్ పాండ్యా తన ఆఫీసు దీపావళి వేడుకల్లో భాగంగా 2012లో వచ్చిన 'ఇషక్‌జాదే' సినిమాలోని 'ఝల్లా వల్లా' పాటకు ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేసింది. నీలం, ఆకుపచ్చ రంగు సంప్రదాయ దుస్తులు ధరించి ఆమె వేసిన స్టెప్పులకు సహోద్యోగులు కేరింతలతో ప్రోత్సహించారు. ఈ సరదా క్షణాలను వీడియో తీసి.. "ఆఫీస్ దీపావళి పార్టీలో ఒక డ్యాన్స్ అయితే చేయాలి కదా" అనే క్యాప్షన్‌తో ఓషీన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది సమయంలోనే వైరల్‌గా మారింది. ఆమె డ్యాన్స్‌లో గ్రేస్, ముఖంలో చిరునవ్వు, పండుగ ఉత్సాహం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. 'ఆమె ఆఫీస్ క్రష్‌గా మారిపోయింది' అంటూ చాలామంది కామెంట్లు చేశారు. లక్షల సంఖ్యలో లైకులు, ప్రశంసలతో ఈ వీడియో ఆఫీసుల్లో జరిగే చిన్న చిన్న సంతోషకరమైన క్షణాలకు ప్రతీకగా నిలిచింది.
Advertisement

సంబంధిత వార్తలు

Oshin PandyaOffice Diwali dance videoViral Instagram danceJhalla Wallah song danceChandigarh girl viral videoOffice Diwali party celebrations

More Telugu News

లాభాల్లో ఎస్‌బీఐ దూకుడు.. మూడు నెలల్లో రూ.23,038 కోట్లు

03 Nov, 15:28

భారత మార్కెట్‌లోకి హోండా తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. 'ఆల్ఫా' పేరుతో డిసెంబర్‌లో ఎంట్రీ!

03 Nov, 15:21

వాసిరెడ్డి పద్మ కూతురు మేఘన ఘన విజయం

03 Nov, 15:18

షారుఖ్ 'కింగ్' సంచలనం.. విడుదలకు ముందే రూ.665 కోట్ల రికార్డు బిజినెస్!

03 Nov, 15:14

‘దమ్కీలు ఇస్తే భయపడేవాళ్లం కాదు’.. అమిత్‌ షాకు మంత్రి అడ్లూరి కౌంటర్‌!

03 Nov, 15:09

మురసు తుపాను: ఏపీకి అండగా ఉంటామన్న అమిత్ షా.. కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు

03 Nov, 15:05

ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. ఇప్పటి వరకు ఎవరికి ఎన్ని?

03 Nov, 14:48

సొంత ఖర్చుతోనే సింధు, లక్ష్యసేన్‌ విజయాలు.. భారత షట్లర్లకు నిధుల కష్టాలు!

03 Nov, 14:44

పెడన మున్సిపల్ చైర్మన్ గా జనసేన అభ్యర్థి జ్యోత్స ఘన విజయం

03 Nov, 14:31

మురసు తుపాను: వచ్చే 4-5 గంటలు కీలకం.. యంత్రాంగానికి సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

03 Nov, 14:22

టెలికాం కంపెనీలకు ట్రాయ్ కొత్త రూల్స్.. కొత్త ఏడాది నుంచి అమ‌లు

03 Nov, 14:20

‘మనమంతా ఒకే గాలి పీలుస్తున్నాం’.. దియా మిర్జా దీపావళి వీడియో వివాదంపై హైకోర్టు ఆగ్రహం

03 Nov, 14:16

హార్లీ డేవిడ్‌సన్‌ 'స్ప్రింట్‌ 440' ఆవిష్కరణ.. ఆరు గేర్లు, 34 కి.మీ మైలేజీ

03 Nov, 13:52

నిరసన స్థలాన్ని శాశ్వతంగా ఆక్రమించలేరు.. వ్యాపార నష్టాలపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

03 Nov, 13:39
..More Telugu News