పులివెందులలో వైసీపీ పోలింగ్ ఏజెంట్లను తరిమికొట్టారు: సతీశ్ కుమార్ రెడ్డి

Andhra
Advertisement
  • పులివెందులలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్న సతీశ్ రెడ్డి
  • చివరకు జగన్ ను కూడా ఇబ్బంది పెట్టారని ఆవేదన
  • వైసీపీపై కూటమి ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని మండిపాటు
Advertisement
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్... ముఖ్యంగా పులివెందులలో, తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అధికార కూటమి ప్రభుత్వం రిగ్గింగ్, దౌర్జన్యాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. పులివెందుల మున్సిపాలిటీ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేసింది.

ఈ అంశంపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి ఓ టీవీ ఛానల్ డిబేట్‌లో మాట్లాడుతూ అధికార కూటమిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పులివెందులలో తమ పార్టీ ఏజెంట్లను సుమారు 70 పోలింగ్ బూత్‌ల నుంచి తరిమికొట్టి యథేచ్ఛగా రిగ్గింగ్ చేశారని ఆయన ఆరోపించారు. ఎన్నికల సరళిని కవర్ చేయడానికి వెళ్లిన 'ఇండియా టుడే' జర్నలిస్టులు అబ్దుల్ బషీర్, వీడియో జర్నలిస్ట్ విజయ్‌పై అధికార పార్టీ వర్గాలు దాడి చేసి కెమెరాను ధ్వంసం చేశాయని ఆయన మండిపడ్డారు.

పులివెందులలో టీడీపీ గూండాల దాడిన తీవ్రంగా ఖండిస్తున్నానని సతీశ్ రెడ్డి చెప్పారు. స్థానిక ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి వైసీపీపై కూటమి ప్రభుత్వం అత్యంత దారుణంగా వ్యవహరించిందని మండిపడ్డారు. పులివెందులలో 80 పోలింగ్ బూత్‌లు ఉంటే... 70 బూత్‌ల నుంచి వైసీపీ ఏజెంట్లను తన్ని తరిమేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఎన్నికల సంఘం, ప్రభుత్వం ఏకమై ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. 

చివరకు తమ పార్టీ అధినేత జగన్ ను కూడా ఇబ్బంది పెడుతున్నారని సతీశ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇది అత్యంత ప్రమాదకరమని చెప్పారు.
Advertisement

సంబంధిత వార్తలు

Satish Kumar ReddyPulivendula Municipal ElectionsYSRCP Polling AgentsAndhra Pradesh Election RiggingIndia Today Journalists AttackTDP Alliance Violence

More Telugu News

'రామాయణ' సినిమాకు భారీ ఊరట.. పైరసీపై బాంబే హైకోర్టు ఉక్కుపాదం

03 Nov, 11:55

విజయవాడ మేయర్ పోరులో వంగవీటి రాధా ఆధిక్యం.. రెండో స్థానంలో ఏబీ వెంకటేశ్వరావు

03 Nov, 11:39

బద్వేలు మున్సిపాలిటీ కూటమి కైవసం.. క్లీన్‌స్వీప్‌తో సంపూర్ణ విజయం

03 Nov, 11:34

ఏపీ కార్పొరేషన్ ఫలితాలు.. టీడీపీ, జనసేన హవా

03 Nov, 10:56

భారత్‌తో వాణిజ్య ఒప్పందం.. ట్రంప్ ప్రభుత్వ జాబితాలో చేర్చడంపై చర్చ

03 Nov, 10:54

ఎవరెస్ట్‌ సమీపంలో ఘోర ప్రమాదం.. ఢీకొన్న హెలికాప్టర్లు.. వీడియో ఇదిగో!

03 Nov, 10:51

ఇతరులకు ఇబ్బంది కాకూడదు.. సూపర్‌ మార్కెట్‌లో ఇలా ప్రవర్తించకండి!

03 Nov, 10:49

ఏపీ లిక్కర్ స్కామ్‌లో అంబటికి ఈడీ సమన్లు.. విచారణకు హాజరుకావాలని ఆదేశం

03 Nov, 10:47

భూమిపైకి జీవం అంతరిక్షం నుంచి రాలేదా? కొత్త అధ్యయనంలో ఆసక్తికర విషయాలు

03 Nov, 10:45

‘మెగా’ ఇంట్లో పెళ్లి బాజాలు​.. సాయి దుర్గా తేజ్ పెళ్లి ఫిక్స్?.. డిసెంబర్‌లో వివాహ ముహూర్తం?

03 Nov, 10:41

ఫ్లోరిడా విమాన ప్రమాదం: చివరి క్షణాల్లో కెప్టెన్ ప్రార్థన, ప్రియుడికి కో-పైలట్ మెసేజ్!

03 Nov, 10:36

ఇక భువనేశ్వర్‌ కెరీర్‌ ముగిసినట్లేనా? అశ్విన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

03 Nov, 10:29

భారత్-పాక్ మ్యాచ్: 34 వేల సీట్లకు 84 లక్షల దరఖాస్తులు.. ఇదే అసలైన క్రేజ్!

03 Nov, 10:27

చలి వాతావరణంలో ఆరోగ్యానికి రక్షణ కవచం.. ఈ చిట్కాలు పాటించండి!

03 Nov, 10:15
..More Telugu News