డెమోక్రాట్లు గెలిస్తే ‘మిస్టర్ వీటో’గా మారిపోతా.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
Advertisement
- డెమోక్రాట్లు గెలిస్తే అన్ని నిర్ణయాలను వీటో చేస్తానన్న ట్రంప్
- మరోసారి అధ్యక్షుడిగా పోటీ చేయాలని ఉందని వ్యాఖ్య
- రాజ్యాంగం ప్రకారం మూడోసారి ఎన్నిక కావడం సాధ్యం కాదని అంగీకారం
- తన సిబ్బందిపై విచారణలు జరిగితే ముందస్తు క్షమాభిక్షలు ఇస్తానని వెల్లడి
- డెమోక్రాట్లకు అనుకూలంగా ఉన్నాయంటూ సర్వేలను తప్పుబట్టిన ట్రంప్
Advertisement
అమెరికా మధ్యంతర ఎన్నికల వేళ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో డెమోక్రాట్లు మెజారిటీ సాధిస్తే వారి ప్రతిపాదనలన్నింటినీ వీటో చేస్తానని హెచ్చరించారు. మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందని, అయితే రాజ్యాంగ నిబంధనలు అందుకు అడ్డుగా ఉన్నాయని పేర్కొన్నారు.
న్యూయార్క్ పోస్ట్ కాలమిస్ట్ మిరాండా డివైన్‌తో ‘పాడ్ ఫోర్స్ వన్’ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తమ పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ ఓటమి ఎదురైతే.. ‘మిస్టర్ వీటో’గా మారతానని అన్నారు. నెల లేదా రెండు నెలల పాటు వరుసగా వీటోలు వేస్తే డెమోక్రాట్లు చర్చలకు వచ్చి ఒప్పందానికి అంగీకరిస్తారని వ్యాఖ్యానించారు.
మూడోసారి పోటీపై ఆసక్తి
మరోసారి అధ్యక్షుడిగా పోటీ చేసే అవకాశం వస్తే తప్పకుండా బరిలో ఉండాలని ఉందని ట్రంప్ చెప్పారు. అయితే రాజ్యాంగంలోని నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయని అంగీకరించారు. అమెరికా రాజ్యాంగంలోని 22వ సవరణ ప్రకారం ఒక వ్యక్తి రెండుసార్లకు మించి అధ్యక్షుడిగా ఎన్నికవడానికి వీల్లేదు. ట్రంప్ 2016, 2024 ఎన్నికల్లో విజయం సాధించారు.
ముందస్తు క్షమాభిక్షలు ఇస్తా
కాంగ్రెస్‌పై డెమోక్రాట్లు పట్టు సాధించి తనకు పనిచేసినవారిపై విచారణలు ప్రారంభిస్తే.. వారికి ముందస్తు క్షమాభిక్షలు ఇచ్చేందుకు సిద్ధమని ట్రంప్ వెల్లడించారు. గతంలో జనవరి 6 ఘటనకు సంబంధించి క్షమాభిక్షలు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు.
డెమోక్రాట్లు ఆధిక్యంలో ఉన్నట్లు వెల్లడిస్తున్న సర్వేలను ట్రంప్ కొట్టిపారేశారు. అవి పక్షపాతంతో ఉన్నాయని ఆరోపించారు. రిపబ్లికన్లను సరిగా సర్వే చేయడం లేదని విమర్శించారు. డెమోక్రాట్లు ప్రతినిధుల సభ, సెనేట్‌తో పాటు భవిష్యత్తులో అధ్యక్ష పదవినీ గెలుచుకుంటే దేశం అంతమవుతుందని హెచ్చరించారు.