ఏపీలో పరిషత్ పోరు.. ఈ నెల 4,5 తేదీల్లో సెలవు ప్రకటించిన ప్రభుత్వం

Andhra
Advertisement
  • నవంబర్ 5న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్
  • ఎన్నికల ఏర్పాట్ల కోసం 4, 5 తేదీల్లో ప్రభుత్వ సెలవులు
  • ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవు
  • నవంబర్ 7న ఓట్ల లెక్కింపు ప్రక్రియ
  • రాష్ట్రవ్యాప్తంగా బరిలో 50 వేలకు పైగా అభ్యర్థులు
Advertisement
ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఇప్పుడు రాష్ట్ర యంత్రాంగం మొత్తం పరిషత్ ఎన్నికలపై దృష్టి సారించింది. రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు నవంబర్ 5న పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు, ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించింది.

ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పోలింగ్ ఏర్పాట్ల కోసం నవంబర్ 4న, పోలింగ్ నిర్వహణ కోసం నవంబర్ 5న సెలవు దినాలుగా ప్రకటించారు. పోలింగ్ కేంద్రాలుగా ఉపయోగించే పాఠశాలలకు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు ఈ సెలవులు వర్తిస్తాయి. 

కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా పోలింగ్ జరిగే ప్రాంతాల పరిధిలోని ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకు, దుకాణాల్లో పనిచేసే కార్మికులకు కూడా నవంబర్ 5న వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించింది.

వాస్తవానికి ఈ ఎన్నికల పోలింగ్ నవంబర్ 3న జరగాల్సి ఉండగా, మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌లో మార్పుల కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం నవంబర్ 5న పోలింగ్ నిర్వహించి, నవంబర్ 7న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 9,829 ఎంపీటీసీ స్థానాలకు గాను 46,045 మంది, 659 జెడ్పీటీసీ స్థానాలకు 4,770 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీతో పాటు జనసేన, బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో ముగించేందుకు అధికారులు పటిష్ఠ‌మైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

AP GovernmentParishat ElectionsMPTC ZPTC PollingAndhra Pradesh Local Body ElectionsNovember 5 Polling HolidayAP Election Schedule

More Telugu News

చంద్రబాబు వచ్చాక ఏపీని బీహార్‌లా మార్చేశారు: విడదల రజని

02 Nov, 15:38

ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరం ఏదో తెలుసా?

02 Nov, 15:35

రాప్తాడు ఉన్మాది ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల‌ కీలక ప్రకటన.. కాలు కోల్పోనున్న హేమంత్?

02 Nov, 15:27

యువ సంచలనాన్ని నిరుత్సాహపరుస్తున్నారు: టీమిండియాపై శ్రీకాంత్ అసంతృప్తి

02 Nov, 15:21

ఉద్యోగులకు ఈపీఎఫ్‌వో గుడ్‌న్యూస్‌.. పీఎఫ్‌ సేవలు ఇక మీ వాట్సాప్‌లోనే

02 Nov, 15:19

విటమిన్ బీ12 ఎందుకంత కీలకం? లోపిస్తే ఏం జరుగుతుంది?

02 Nov, 15:18

నటనలో 'బాద్‌షా'.. వ్యాపారంలోనూ 'కింగ్'.. షారుఖ్ ఆస్తుల విలువ రూ. 10,000 కోట్లు!

02 Nov, 15:04

48 ప్రభుత్వ స్కూళ్లను దత్తత తీసుకున్న మంచు లక్ష్మి

02 Nov, 15:02

హైదరాబాద్‌ చేరుకున్న అమిత్ షా.. చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం

02 Nov, 15:00

ఈ అర్ధరాత్రి తీరం తాకనున్న 'మురసు' తుపాను.. ఒంగోలుకు 170 కి.మీ దూరంలో కేంద్రీకృతం

02 Nov, 14:57

మంత్రి పదవి ఇవ్వలేదు.. నిధులూ రావడం లేదు.. రేవంత్‌ ప్రభుత్వంపై కోమటిరెడ్డి ఆగ్రహం

02 Nov, 14:38

వైసీపీలో తీవ్ర మనోవేదన అనుభవించా.. 11న పార్టీని ప్రకటిస్తా: విజయసాయిరెడ్డి

02 Nov, 14:34

గ్రోక్ ఏఐతో ఆదాయం కంటే ఖర్చే ఎక్కువ: ఎలాన్ మస్క్

02 Nov, 14:19

దీపావళి ఎలా జరుపుకోవాలో ప్రజలకు తెలుసు.. ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌కు బీజేపీ, శివసేన చురకలు

02 Nov, 14:03
..More Telugu News