ప్రేమలో దారుణంగా మోసపోయా: రెజీనా కసాండ్రా

Entertainment
Advertisement
  • ప్రేమలో మోసపోయి డిప్రెషన్‌కు గురయ్యానన్న రెజీనా
  • 2020లో తన జీవితంలో ఈ చేదు అనుభవం ఎదురైందని వెల్లడి
  • ఇతరుల ప్రేమ కన్నా మనల్ని మనం ప్రేమించుకోవడం ముఖ్యమన్న నటి
Advertisement
విభిన్నమైన పాత్రలతో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రెజీనా కసాండ్రా... తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి సంచలన విషయాలు వెల్లడించారు. గతంలో తాను ప్రేమలో దారుణంగా మోసపోయానని, ఆ కారణంగా తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లానని ఆమె తెలిపారు. ప్రస్తుతం నయనతార ప్రధాన పాత్రలో నటించిన ‘మూకుత్తి అమ్మన్ 2’ (తెలుగులో ‘మహాశక్తి’) చిత్ర ప్రచార కార్యక్రమాల్లో ఈ వ్యాఖ్యలు చేశారు.

తన గత ప్రేమ బంధం గురించి మాట్లాడుతూ... "2020లో నా జీవితంలో ఊహించని ఘటన జరిగింది. నేను ప్రేమించిన వ్యక్తి నన్ను మోసం చేయడంతో ఆ బంధం ముగిసిపోయింది. ఆ పరిణామం నన్ను మానసికంగా కుంగదీసింది. చాలా కాలం డిప్రెషన్‌తో బాధపడ్డాను. ఆ బాధ నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది" అని రెజీనా భావోద్వేగానికి గురయ్యారు.

ఈ కష్టకాలం నుంచి బయటపడటానికి తనకు తానే సమయం కేటాయించుకోవడం ఎంతో సహాయపడిందని ఆమె అన్నారు. "ఇతరుల నుంచి ప్రేమను ఆశించే ముందు, మనల్ని మనం ప్రేమించుకోవడం చాలా ముఖ్యం" అని పేర్కొన్నారు. యువతులు లైంగిక వేధింపులు వంటి చేదు అనుభవాలు ఎదుర్కొన్నప్పుడు తమను తాము నిందించుకోవద్దని సూచించారు. బాధను మనసులో దాచుకోకుండా, నమ్మకమైన వారితో పంచుకొని ధైర్యంగా ముందుకు సాగాలని ఆమె సలహా ఇచ్చారు.
Advertisement

సంబంధిత వార్తలు

Regina CassandraRegina Cassandra heartbreakRegina Cassandra depressionMookuthi Amman 2Mahashakti movieRegina Cassandra relationship

More Telugu News

ఆవలింతలు ఎందుకు వస్తాయి? ఎదుటివారు ఆవలిస్తే మనకూ ఎందుకు వస్తుంది?

02 Nov, 12:50

పబ్లిక్‌లో 'కావ్య, కావ్య' అరుపులు.. సిగ్గుతో నవ్వేసిన అనిరుధ్!

02 Nov, 12:43

61 ఏళ్లలోనూ అదే ఫిట్‌నెస్.. షారుక్ ఖాన్ సీక్రెట్ ఇదే!

02 Nov, 12:38

ఇండియా కూటమి ర్యాలీ వల్ల రూ. 11 వేల కోట్ల నష్టం.. ఎవరు చెల్లిస్తారన్న వ్యాపార సంఘాలు

02 Nov, 12:26

ఏఐకి భౌతిక రూపం.. 'మ్యాక్స్' హ్యూమనాయిడ్ రోబోను పరిచయం చేసిన మెటా!

02 Nov, 12:17

రాప్తాడు దాడిలో గాయపడిన బాలిక ఆరోగ్యంపై మంత్రి లోకేశ్‌ కీలక అప్‌డేట్‌

02 Nov, 12:16

నవంబర్ 11 నుంచి కేటీఆర్ బస్సు యాత్ర.. 29న భారీ బహిరంగ సభ

02 Nov, 12:02

పంజాబ్‌లో ఆప్‌కు షాక్‌.. రాజీనామా చేసిన గంటల్లోనే బీజేపీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు!

02 Nov, 11:57

పులివెందుల పులి అన్నారు.. ఓటేయకుండా వెళ్లారు: జగన్‌పై అచ్చెన్న విమర్శలు

02 Nov, 11:48

పోలీసు శాఖకు వన్నె తెచ్చిన వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం సమర్థుడైన అధికారి: సీఎం చంద్రబాబు నివాళి

02 Nov, 11:44

రైలు బోగీల రంగులు వేర్వేరుగా ఎందుకుంటాయో తెలుసా? నీలం, ఎరుపు, తెలుపు వెనుక అసలు కథ ఇదే!

02 Nov, 11:41

మురసు తుపానుపై పవన్ కల్యాణ్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

02 Nov, 11:35

ఓట్‌ చోరీ జరిగితే రాహుల్‌, రేవంత్‌ ఎలా గెలిచారు?: రాంచందర్‌ రావు

02 Nov, 11:30

కుటుంబ కలహాలతో విషాదం.. అత్త, కొడుకు, కోడలు ఆత్మహత్యాయత్నం

02 Nov, 11:22
..More Telugu News