కుటుంబ కలహాలతో విషాదం.. అత్త, కొడుకు, కోడలు ఆత్మహత్యాయత్నం
Advertisement
- అనకాపల్లి జిల్లాలో కుటుంబ కలహాలతో విషాదం
- ఒంటిపై పెట్రోల్ పోసుకున్న అత్త, కొడుకు, కోడలు
- స్థానికులు కాపాడి ఆసుపత్రికి తరలింపు
- పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖ కేజీహెచ్‌లో చికిత్స
- ఘటనపై కేసు నమోదు చేసి పోలీసుల దర్యాప్తు
Advertisement
అనకాపల్లి జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దేవరాపల్లి మండలం రైవాడ గ్రామంలో తల్లి, కొడుకు, కోడలు తమ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. ప్రస్తుతం వీరి ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.
వివరాల్లోకి వెళితే.. రైవాడ గ్రామానికి చెందిన చల్లా ఈశ్వరరావు, అతని భార్య నాగమణి, తల్లి వరహాలమ్మ మధ్య గత కొంతకాలంగా తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గతంలో నాగమణి తన భర్త, అత్తపై చోడవరం, దేవరాపల్లి పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు కూడా చేశారు. అయితే, ఆదివారం రాత్రి వీరి మధ్య వివాదం మరోసారి ముదరడంతో ఘర్షణ తీవ్రస్థాయికి చేరింది.
ఘర్షణ అనంతరం, వారు తమ పిల్లలను ఇంటి నుంచి బయటకు పంపి లోపల తలుపులు వేసుకున్నారు. ఆ తర్వాత ఇంట్లో నుంచి హాహాకారాలు రావడంతో స్థానికులు అప్రమత్తమై తలుపులు పగలగొట్టి చూడగా, ముగ్గురూ మంటల్లో కాలిపోతూ కనిపించారు. వెంటనే వారిని రక్షించిన స్థానికులు 108 వాహనంలో తొలుత కె. కోటపాడు ఆసుపత్రికి తరలించారు. అయితే బాధితుల పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖపట్నంలోని కేజీహెచ్‌కు తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితులు కోలుకున్న తర్వాత వారి నుంచి వాంగ్మూలం సేకరించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు.