తీవ్ర తుపానుగా మురసు.. ఏపీ తీరానికి రెడ్ అలర్ట్
Advertisement
- నేటి అర్ధరాత్రి ఒంగోలు వద్ద తీరం దాటే అవకాశం
- గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే సూచన
- నెల్లూరు, ప్రకాశం సహా 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
- తీరంలో ఒకటిన్నర మీటరు ఎత్తున అలలు ఎగిసిపడే ప్రమాదం
Advertisement
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన 'మురసు' తుపాను, తీవ్ర తుపానుగా బలపడింది. ఇది నేటి అర్ధరాత్రి నుంచి రేపు (3వ తేదీ) తెల్లవారుజాము లోపు నెల్లూరు - నర్సాపురం మధ్య, ప్రధానంగా ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
సోమవారం ఉదయం నాటికి ఈ తుపాను ఒంగోలుకు 330 కి.మీ, నెల్లూరుకు 290 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని ఏపీఎస్‌డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని, ఇవి గరిష్ఠంగా 120 కిలోమీటర్ల వేగాన్ని కూడా అందుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, కృష్ణా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా బాపట్ల, కృష్ణా, ప్రకాశం జిల్లాల తీర ప్రాంతాల్లో 1.0 నుంచి 1.5 మీటర్ల ఎత్తున సముద్రపు అలలు (స్టార్మ్ సర్జ్) ఎగిసిపడే ప్రమాదం ఉందని ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది.
ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని అధికారులు స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.