మున్సిపల్ పోలింగ్ చాలావరకు ప్రశాంతం.. నివేదికల తర్వాతే రీపోలింగ్‌పై నిర్ణయం: ఎస్ఈసీ పునేఠా
Advertisement
- రాష్ట్రంలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్
- ఎస్ఈసీ అనిల్ పునేఠా ప్రెస్ మీట్
- పల్నాడు, అనంతపురం జిల్లాల్లో కొన్ని ఘటనలు జరిగాయని వెల్లడి
- విజయవాడలో పోలింగ్ ఆలస్యం కావడంతో సమయం పొడిగింపు
- అధికారుల నుంచి నివేదికలు వస్తేనే చర్యలుంటాయని స్పష్టం చేసిన పునేఠా
Advertisement
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ స్వల్ప ఘటనలు మినహా చాలావరకు ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అనిల్ కుమార్ పునేఠా వెల్లడించారు. పల్నాడు, అనంతపురం జిల్లాల్లో కొన్ని హింసాత్మక ఘటనలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని, వాటిపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీల నుంచి నివేదికలు అందిన తర్వాత రీపోలింగ్‌పై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 48.03 శాతం పోలింగ్ నమోదైందని ఆయన తెలిపారు. ఆదివారం సాయంత్రం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోలింగ్ సరళిని వివరించారు.
పోలింగ్ ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షించామని, ఉదయం నుంచి శ్రీకాకుళం, పల్నాడు, కడప సహా పలు జిల్లాల నుంచి వివిధ పార్టీల ప్రతినిధులు వచ్చి ఫిర్యాదులు అందజేశారని పునేఠా తెలిపారు.
"ఉదయం 13,500 కెమెరాల ద్వారా వెబ్ కాస్టింగ్ పర్యవేక్షించాం. ప్రత్యేకించి పల్నాడు, అనంతపురం జిల్లాల్లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని ఫిర్యాదులు అందాయి. లా అండ్ ఆర్డర్‌కు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని మూడు రోజుల క్రితమే కలెక్టర్లు, ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ప్రశాంత వాతావరణం ఉంటేనే ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకుంటారు" అని ఆయన అన్నారు.
మీడియా సమావేశానికి ముందు తాను నంద్యాల, కడప, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించినట్లు చెప్పారు. చాలా జిల్లాల్లో ఎలాంటి హింస జరగలేదని కలెక్టర్లు నివేదించినట్లు తెలిపారు.
విజయవాడలోని 55వ వార్డులో సాంకేతిక కారణాల వల్ల పోలింగ్ రెండున్నర గంటలు ఆలస్యంగా ప్రారంభమైందని, దీంతో జిల్లా కలెక్టర్ అభ్యర్థన మేరకు అక్కడ పోలింగ్ సమయాన్ని సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు పొడిగించినట్లు పునేఠా వెల్లడించారు. ఓటర్లకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఎన్నికల కమిషన్‌కు ఉన్న అధికారాలను ఉపయోగించి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
పల్నాడు, అనంతపురం జిల్లాల్లో జరిగిన ఘటనలపై పోలింగ్ సిబ్బంది సాయంత్రం రిసెప్షన్ సెంటర్లకు చేరుకున్నాక, ప్రిసైడింగ్ అధికారుల (పీవో) నుంచి లిఖితపూర్వక నివేదికలు తీసుకుంటామని ఎస్ఈసీ స్పష్టం చేశారు.
"నివేదికలు, వెబ్ కాస్టింగ్ ఫుటేజీని పరిశీలించి, ఫిర్యాదుల్లో వాస్తవం ఉందని తేలితే తక్షణమే రీపోలింగ్‌పై ఆదేశాలు జారీ చేస్తాం. రేపు రీపోలింగ్ నిర్వహించి, ఎల్లుండి కౌంటింగ్ చేపట్టాల్సి ఉన్నందున ఈరోజే నిర్ణయం ఉంటుంది. కేవలం ఆరోపణలు, ఫిర్యాదుల ఆధారంగా ఆదేశాలివ్వలేను. నేను ఇచ్చే ప్రతి ఉత్తర్వు న్యాయసమీక్షకు లోబడి ఉంటుంది. కలెక్టర్, ఎస్పీ నుంచి ఆధారం వస్తే వెంటనే చర్యలు తీసుకుంటాను," అని పునేఠా వివరించారు.
గతంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్న అన్నమయ్య జిల్లాలో ఈసారి పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని, మదనపల్లెలో కేవలం మూడు చిన్న ఫిర్యాదులు మాత్రమే వచ్చాయని కలెక్టర్ తెలిపినట్లు చెప్పారు. పులివెందులలో జరిగిన ఒక ఘటనపై నివేదిక అందాల్సి ఉందన్నారు. 70 చోట్ల వైసీపీ ఏజెంట్లు లేరన్న ఫిర్యాదుపై వెంటనే స్పందించి, వారికి పోలీస్ ఎస్కార్ట్ ఏర్పాటు చేయాలని ఎస్పీని ఆదేశించినట్లు తెలిపారు.
తాను నిష్పక్షపాతంగా, నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నానని, టీడీపీ, వైసీపీ రెండు పార్టీలూ తనపై ఫిర్యాదులు చేస్తున్నాయంటే తాను ఎవరికీ కొమ్ము కాయడం లేదని అర్థమని పునేఠా వ్యాఖ్యానించారు. 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 63.8 శాతం పోలింగ్ నమోదైందని, ఈసారి తుది పోలింగ్ శాతం వివరాలు సోమవారానికి వెల్లడవుతాయని ఆయన తెలిపారు.