‘మూడు రోజుల్లో పూర్తి చేస్తా’ అంటాం.. కానీ వారం దాటుతుంది! దీని వెనుక సైకాలజీ ఏంటో తెలుసా?

Lifestyle
Advertisement
  • పనులకు పట్టే సమయాన్ని తక్కువగా అంచనా వేయడమే 'ప్లానింగ్ ఫాలసీ'
  • గత అనుభవాలు తెలిసినా మళ్లీ అదే పొరపాటు చేస్తుండమే దీనిలో లోపం
  • ఆశించిన సమయాన్నే వాస్తవ అంచనాగా భావించడం ఓ కారణం
  • గత అనుభవాలను పరిగణనలోకి తీసుకోకపోవడం మరో కారణం
  • పనులను చిన్న భాగాలుగా విభజించి అదనపు సమయం కేటాయిస్తే సమస్య పరిష్కారం
Advertisement
మనకు ఓ పని అప్పగిస్తే చాలు.. ‘ఇది గంటలో అయిపోతుంది’, ‘మహా అయితే ఒక రోజు పడుతుంది’ అని అంచనా వేసేస్తాం. కానీ తీరా పని మొదలుపెట్టాక అనుకున్న సమయానికి పూర్తికాదు. గతంలోనూ ఇలాంటి పనులకు ఎక్కువ సమయం పట్టిందని తెలిసినా.. మళ్లీ అదే పొరపాటు చేస్తుంటాం. దీనికి బద్ధకం కారణం కాదు.. మన ఆలోచనా విధానంలోనే ఓ లోపం ఉందని మనస్తత్వ శాస్త్రం చెబుతోంది. దీన్నే ‘ప్లానింగ్ ఫాలసీ’ అంటారు.

'ప్లానింగ్ ఫాలసీ' అంటే ఏంటి?
ఓ పనిని పూర్తి చేయడానికి పట్టే సమయాన్ని, ఖర్చును, ఎదురయ్యే ఇబ్బందులను తక్కువగా అంచనా వేయడమే 'ప్లానింగ్ ఫాలసీ'. గతంలో ఇలాంటి పనులు ఆలస్యమైనా.. ఈసారి మాత్రం అనుకున్న సమయానికి పూర్తవుతుందని మనం భావిస్తుంటాం. మన పనుల విషయంలో మనమే ఎక్కువ ఆశావాదంతో అంచనాలు వేస్తాం. ఇతరులు మాత్రం అదే పనికి ఎక్కువ సమయం పడుతుందని అంచనా వేస్తారు.

1979లో మనస్తత్వ శాస్త్రవేత్తలు డేనియల్ కహ్నెమన్, అమోస్ ట్వెర్స్‌కీ ఈ భావనకు పేరు పెట్టారు. తర్వాత రోగర్ బ్యూహ్లర్ సహా పలువురు పరిశోధకులు దీనిపై అధ్యయనాలు చేశారు.

రోజువారీ జీవితంలోనూ ఇదే సమస్య
విద్యార్థులు అసైన్‌మెంట్లను అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోతుంటారు. ఇంటి నిర్మాణం, మరమ్మతుల పనులు అంచనా వేసిన ఖర్చు, సమయాన్ని దాటిపోతుంటాయి. ఉద్యోగాల్లోనూ ప్రాజెక్టులు గడువులోగా పూర్తికావు. కెనడాలో పన్ను చెల్లింపుదారులపై నిర్వహించిన ఓ సర్వేలో.. పత్రాలను గతంలో కంటే వారం ముందే పోస్టు చేస్తామని చెప్పినవారు, చివరకు ఎప్పటిలాగే అదే సమయంలో పంపినట్లు గుర్తించారు.

ఎందుకిలా జరుగుతుంది?
దీనికి ప్రధానంగా మూడు కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. మొదటిది.. మనం కోరుకునే సమయాన్నే వాస్తవ అంచనాగా భావించడం. ‘ఈ పని త్వరగా పూర్తవ్వాలి’ అనుకోవడం వేరు.. నిజంగా ఎంత సమయం పడుతుందో అంచనా వేయడం వేరు. కానీ ఈ రెండింటినీ కలిపేస్తాం.

రెండోది.. ఇతరుల అంచనాల కంటే మన అంచనాలు ఆశాజనకంగా ఉండాలని కోరుకుంటాం. ముఖ్యంగా ఉద్యోగాల్లో తక్కువ సమయం చెబితేనే పని దక్కుతుందనే ఒత్తిడి ఉంటుంది. దీంతో వాస్తవానికి మించి తక్కువ గడువు చెబుతుంటాం.

మూడోది.. గత అనుభవాలను పక్కనపెట్టి, ప్రస్తుతం చేయాల్సిన పనిపైనే దృష్టి పెడతాం. గతంలో ఇలాంటి పనికి ఎన్ని రోజులు పట్టిందో మర్చిపోయి, ఈసారి త్వరగా పూర్తవుతుందని అనుకుంటాం.

ఈ పొరపాటును ఎలా అధిగమించాలి?
గతంలో ఇలాంటి పనులకు ఎంత సమయం పట్టిందో ముందుగా పరిశీలించాలి. ఇతరులు అదే పనిని పూర్తి చేయడానికి తీసుకున్న సమయాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. పెద్ద పనులను చిన్న చిన్న భాగాలుగా విభజించాలి. ఎప్పుడు? ఎక్కడ? పని మొదలుపెట్టాలో ముందే నిర్ణయించుకోవాలి. అనుకోని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని భావించి అదనపు సమయాన్ని కేటాయించాలి.

‘ఈసారి మూడు రోజుల్లో అయిపోతుంది’ అని అనుకునే ముందు.. చివరిసారి ఎంత సమయం పట్టిందో గుర్తు చేసుకోవాలి. ఆశించిన సమయానికి, వాస్తవంగా పట్టే సమయానికి మధ్య తేడాను గుర్తించగలిగితే ప్రణాళికలు మరింత మెరుగవుతాయని ఈ అధ్యయనాలు సూచిస్తున్నాయి.
Advertisement

సంబంధిత వార్తలు

Planning FallacyDaniel KahnemanTime ManagementPsychology of ProcrastinationTask CompletionBehavioral Economics

More Telugu News

మున్సిపల్ పోలింగ్ చాలావరకు ప్రశాంతం.. నివేదికల తర్వాతే రీపోలింగ్‌పై నిర్ణయం: ఎస్ఈసీ పునేఠా

01 Nov, 18:57

గేట్లు మూసేయండి.. రాప్తాడు ఘటన నేపథ్యంలో నారా లోకేశ్ కీలక ఆదేశాలు

01 Nov, 18:02

ఆ విషయాల్లో మేం ఇంకా మెరుగ్గా ఉండాల్సింది.. న్యూజిలాండ్‌తో ఓటమిపై శ్రేయస్‌

01 Nov, 18:01

ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో!

01 Nov, 17:36

‘జ్ఞానేశ్‌ కుమార్‌ తర్వాత మీ వంతే మోదీజీ’.. ఢిల్లీ సభలో రాహుల్‌ గాంధీ హెచ్చరిక!

01 Nov, 17:35

రాబోయే 48 గంటలు కీలకం.. బెంగళూరులో రాప్తాడు బాలికను పరామర్శించిన మంత్రి లోకేశ్

01 Nov, 17:09

రాప్తాడు ఘటనతో 'సినిమా'పై చర్చ.. ఆర్జీవీ ఏమన్నాడంటే!

01 Nov, 17:09

ఏపీకి మరో తుపాను ముప్పు.. ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్న సీఎం చంద్రబాబు

01 Nov, 16:47

భూగర్భంలో దాక్కున్నా బయటకు లాగుతాం.. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌కు ఖర్గే హెచ్చరిక

01 Nov, 16:46

భారత్‌ బౌలర్లపై విరుచుకుపడ్డ కివీస్‌.. 3-2తో సిరీస్‌ ముగింపు

01 Nov, 16:30

ప్రభుత్వ రంగంలో మొదటిసారి.. గువహటిలో ప్రోటాన్ క్యాన్సర్ ట్రీట్‌మెంట్

01 Nov, 16:21

నేటితో 53 ఏళ్లు.. ఐశ్వర్యారాయ్‌ డైట్‌ సీక్రెట్‌ ఇదే..!

01 Nov, 16:15

ఇషాన్‌ కిషన్‌ అరుదైన ఘనత.. సూర్యకుమార్‌ రికార్డు తెరమరుగు!

01 Nov, 16:11

పండ్లు తినడంలో ఈ చిన్న మార్పులు చేసుకోండి.. పోషకాలు పుష్కలం!

01 Nov, 15:52
..More Telugu News