జగన్ ఆస్తుల కేసు విచారణ ముమ్మరం.. 45 డిశ్చార్జి పిటిషన్లపై విచారణ పూర్తి

Andhra
Advertisement
  • డిశ్చార్జి పిటిషన్లపై దూకుడుగా విచారణ
  • సీబీఐ, ఈడీ కేసులపై కొనసాగుతున్న రోజువారీ విచారణ
  • కేసుల భవిష్యత్తుపై సర్వత్ర ఉత్కంఠ
Advertisement
వైసీపీ అధినేత జగన్ ఆస్తుల కేసుల విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ కేసుల విచారణను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఇండియా సిమెంట్స్‌కు సంబంధించిన ఛార్జిషీట్‌లో దాఖలైన డిశ్చార్జి పిటిషన్లపై వాదనలు ముగిశాయి. అనంతరం, భారతీ సిమెంట్స్ కేసుకు సంబంధించిన పిటిషన్లపై విచారణను న్యాయస్థానం ప్రారంభించింది.

దశాబ్ద కాలంగా ఈ కేసులు విచారణ దశలోనే నిలిచిపోయాయని, వీటిని వేగవంతం చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో విచారణ ప్రక్రియ వేగమందుకుంది. హైకోర్టు ఆదేశాలతో సీబీఐ, ఈడీ కేసులపై న్యాయస్థానం రోజువారీ విచారణ చేపడుతోంది. ఇప్పటివరకు ఆరు సీబీఐ ఛార్జిషీట్లకు సంబంధించి మొత్తం 45 డిశ్చార్జి పిటిషన్లపై విచారణ పూర్తయింది.

జగన్‌తో పాటు విజయసాయిరెడ్డి, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, మోపిదేవి వెంకటరమణ, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య, అయోధ్యరామిరెడ్డి వంటి పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. విచారణ పూర్తయిన ఈ 45 డిశ్చార్జి పిటిషన్లపై సీబీఐ కోర్టు ఒకేసారి తన ఆదేశాలను వెలువరించనుంది. దీంతో ఈ కేసుల భవిష్యత్తుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Advertisement

సంబంధిత వార్తలు

YS Jagan Mohan ReddyDisproportionate Assets CaseCBI Special Court HyderabadDischarge Petitions HearingEnforcement DirectorateIndia Cements Case

More Telugu News

రూ.20 లక్షల కారుకు రూ.61 లక్షల రిపేర్ బిల్లు.. బెంబేలెత్తిన టెక్కీ!

31 Oct, 20:07

బంగాళాఖాతంలో కొత్త వాయుగుండం.. ఇస్రో శాటిలైట్ కెమెరాకు చిక్కిన దృశ్యాలు

31 Oct, 19:53

విండీస్ చేతిలో బంగ్లాదేశ్ ఓటమి.. భారత్ కు అలా కలిసొచ్చింది!

31 Oct, 19:19

రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోంది.. రాప్తాడు ఘటనే నిదర్శనం: జగన్

31 Oct, 19:13

అనీష్, అనశ్వర రాజన్ 'ఇట్లు అర్జున'.. కొత్త రిలీజ్ డేట్ ఖరారు

31 Oct, 19:05

ఉన్మాది దాడిలో గాయపడిన విద్యార్థిని బెంగళూరు తరలింపు.. గ్రీన్ చానల్ ఏర్పాటుకు లోకేశ్ చొరవ

31 Oct, 18:18

ఏపీలో రేపే మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. సర్వం సిద్ధం.. ప్రతి పోలింగ్ కేంద్రంపై కెమెరా నీడ!

31 Oct, 18:13

మూడేళ్లు గడుస్తున్నా ఆ పనులు ముందుకు కదలడంలేదు: కొడంగల్‌లో డీకే అరుణ

31 Oct, 18:11

'డెమోక్రటిక్ సంఘ' నుంచి తప్పుకున్న రెజీనా

31 Oct, 17:52

స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు దుర్మార్గాలు చేస్తున్నారు: పేర్ని నాని

31 Oct, 17:36

87 పరుగుల ఓటమి ఎఫెక్ట్‌.. ఐదో టీ20లో భారత్‌ భారీ మార్పులు?

31 Oct, 17:28

'సైబర్ సెక్యూరిటీ కెప్టెన్'గా మమ్ముట్టి.. సినిమా కాదు.. రియల్!

31 Oct, 17:23

ఆసుపత్రి గదిలో అమ్మ కోసం మధురమైన వేణుగానం.. మనసులు గెలుస్తున్న కేంద్ర మాజీ మంత్రి

31 Oct, 17:16

కడప, పులివెందులలో కూటమి నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారు: అవినాశ్ రెడ్డి

31 Oct, 17:12
..More Telugu News