బాత్రూమ్‌లో జారిపడి తలకు గాయం.. బాలీవుడ్ దర్శకుడు సంజయ్ గుప్తా మృతి

Entertainment
Advertisement
  • 59 ఏళ్ల వయసులో బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ గుప్తా కన్నుమూత
  • అక్టోబర్‌ 30న బాత్‌రూమ్‌లో జారిపడి తలకు గాయం
  • మరణవార్తను ధ్రువీకరించిన దర్శకుడు అశోక్‌ పండిట్‌
  • 1994లో ‘ఆతిష్‌’తో సినీ ప్రయాణం ప్రారంభం
  • ‘కాంటే’, ‘కాబిల్‌’తో దర్శకుడిగా గుర్తింపు
Advertisement
ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ గుప్తా (59) కన్నుమూశారు. అక్టోబర్‌ 30న రాత్రి బాత్‌రూమ్‌లో జారిపడటంతో ఆయన తలకు తీవ్ర గాయమై మృతి చెందినట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. దర్శకుడు అశోక్‌ పండిట్‌ కూడా సంజయ్‌ గుప్తా మరణవార్తను ధ్రువీకరించారు. ఇంట్లో తలకు గాయమవడంతో ఆయన మృతి చెందారని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. సంజయ్‌ గుప్తా మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని సంతాపం తెలిపారు.

1994లో ఆదిత్య పంచోలీ, సంజయ్‌ దత్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఆతిష్‌: ఫీల్‌ ద ఫైర్‌’ సినిమాతో సంజయ్‌ గుప్తా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ‘రామ్‌ శాస్త్ర’, ‘ఖౌఫ్‌’, ‘జంగ్‌’ చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు రచయితగా, నిర్మాతగానూ వ్యవహరించారు. ‘కాంటే’, ‘కాబిల్‌’, ‘షూటౌట్‌ ఎట్‌ వడాలా’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

సంజయ్‌ దత్‌తో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉండేది. వీరిద్దరి కలయికలో ‘కాంటే’, ‘ముసాఫిర్‌’, ‘జిందా’, ‘షూటౌట్‌ ఎట్‌ లోఖండ్‌వాలా’ వంటి చిత్రాలు వచ్చాయి. ‘జిందా’ దక్షిణ కొరియా సినిమా ‘ఓల్డ్‌బాయ్‌’కు అనధికారిక రీమేక్‌. ‘షూటౌట్‌ ఎట్‌ లోఖండ్‌వాలా’, ‘దస్‌ కహానియాన్‌’ చిత్రాలను నిర్మించిన ఆయన.. ‘షూటౌట్‌ ఎట్‌ వడాలా’కు దర్శకత్వం వహించి సహ నిర్మాతగానూ వ్యవహరించారు.

ఆయన చివరి చిత్రం ‘ది మిరాండా బ్రదర్స్‌’ 2025లో విడుదలైంది. హర్షవర్ధన్‌ రాణే, మీజాన్‌ జాఫ్రీ నటించిన ఈ సినిమాకు సంజయ్‌ గుప్తా దర్శకత్వం వహించి నిర్మించారు.
Advertisement

సంబంధిత వార్తలు

Sanjay GuptaBollywood DirectorSanjay Gupta DeathKaante DirectorShootout at WadalaSanjay Dutt

More Telugu News

ఇస్రో శాస్త్రవేత్తలకు జగన్ అభినందనలు

31 Oct, 14:40

ఉద్యోగులకు రెండు రోజుల వీక్లీ ఆఫ్‌.. ప్రభుత్వానికి కీలక ప్రతిపాదన

31 Oct, 14:35

చిన్నారి చెల్లిని క్లాస్ రూములో నెత్తుటి మడుగులో చూశాక కన్నీళ్లు ఆగడం లేదు: నారా లోకేశ్

31 Oct, 14:31

డబ్బును ఇలా విభజించి ఇన్వెస్ట్‌ చేయండి.. భవిష్యత్తుకు ఢోకా ఉండదు!

31 Oct, 14:16

ఒకప్పుడు ఫ్యాక్టరీలో సాధారణ కార్మికురాలు.. నేడు చైనాలోనే అత్యంత ధనిక మహిళ!

31 Oct, 14:12

కర్నూలులో ఓ వ్యక్తి ఇంట్లో రూ.76 లక్షల నగదు సీజ్!

31 Oct, 13:55

ఏపీ వ్యాప్తంగా ప్రారంభమైన ఎన్నికల సామగ్రి పంపిణీ.. రేపే పోలింగ్

31 Oct, 13:48

ఫిన్లాండ్‌లో గూగుల్ నిర్వాకం.. అడవిని నరికివేయ‌డంతో ఊళ్లపై పడుతున్న తోడేళ్లు!

31 Oct, 13:44

వన్డేల్లో జడేజా కథ ముగిసినట్టేనా? పుజారా కీలక వ్యాఖ్యలు

31 Oct, 13:39

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తాగునీటి కోసం రూ.120 కోట్లు.. మంత్రి సీతక్క కీలక నిర్ణయం

31 Oct, 13:39

ఐదో బిడ్డ కావాలన్న జేడీ వాన్స్.. అర్ధాంగి ఉష నుంచి ఊహించని వార్నింగ్!

31 Oct, 13:21

రాప్తాడు ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి.. కఠిన చర్యలకు ఆదేశం

31 Oct, 13:11

ఏపీకి ఎస్‌బీఐ ఆపన్నహస్తం.. రూ. 5 కోట్ల భారీ విరాళం

31 Oct, 13:03

తెలంగాణకు ఐదు రోజుల వర్ష సూచన.. పలు జిల్లాలకు ఎల్లో వార్నింగ్

31 Oct, 12:55
..More Telugu News