పులివెందులలో నామినేషన్లు వేసుకోలేకపోయారు.. చొక్కా మడత పెడతారా?: దేవినేని ఉమా
Advertisement
- జగన్ 'చొక్కా మడత' వ్యాఖ్యలపై దేవినేని ఉమా తీవ్ర విమర్శలు
- పులివెందులలోనే నామినేషన్లు వేయలేని దుస్థితిలో వైసీపీ ఉందని ఎద్దేవా
- విపత్తు వేళ అధికారులను బెదిరించడం జగన్ సంస్కారానికి నిదర్శనం
- గతంలో పరదాల చాటున పాలన చేసిన జగన్‌కు విమర్శించే హక్కు లేదు
- తుఫాను బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పనిచేస్తోంది
Advertisement
"చొక్కా మడతపెట్టి 2.0 అంటూ మాట్లాడుతున్న జగన్‌మోహన్‌రెడ్డి, సొంత నియోజకవర్గం పులివెందులలోనే 65 ఎంపీటీసీ స్థానాలకు గాను 64 చోట్ల నామినేషన్లు వేయలేని దుస్థితిలో ఉన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు చొక్కా మడతపెడతానని మాట్లాడటం సిగ్గుచేటు" అని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో విమర్శించారు. తాడేపల్లిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్‌పై విరుచుకుపడ్డారు. చొక్కా మడతపెట్టాల్సింది ప్రజల మధ్య కాదని, తాడేపల్లి, ఇడుపులపాయ లేదా బెంగళూరు ప్యాలెస్‌లలో మడత పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు.
"తోలు ఒలుస్తా, తొక్క తీస్తా అంటూ అధికారులను బెదిరించే జగన్ మాటలు పిచ్చి ప్రేలాపనలు తప్ప మరొకటి కాదు. రాష్ట్రవ్యాప్తంగా 2,043 ఎంపీటీసీ, 77 జెడ్పీటీసీ స్థానాల్లో నామినేషన్లు వేయలేని పార్టీ వైసీపీ. గతంలో ఏ నియోజకవర్గంలో నామినేషన్లు వేయలేకపోతే అక్కడి ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వనని జగనే చెప్పారు. మరి పులివెందుల ఎమ్మెల్యే అయిన జగన్‌కు ఇప్పుడు టికెట్ ఉందా?" అని దేవినేని ఉమా సూటిగా ప్రశ్నించారు. అర్నబ్ తుపానుతో రాష్ట్రం అల్లకల్లోలమవుతుంటే, బాధితులను ఆదుకోవాల్సిన ప్రతిపక్ష నాయకుడు అధికారుల స్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం ఆయన కుట్ర రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు.
గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తుపాను వస్తే జాతీయ రహదారిపై పరదాలు, షామియానాలు కట్టుకుని సమీక్షలు చేసిన జగన్‌కు, క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న చంద్రబాబు గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్శించారు. రైతులు నీళ్లలో నిలబడి గోడు వెళ్లబోసుకుంటుంటే, పరదాల చాటు నుంచి పాలన చేసిన వ్యక్తి ఇప్పుడు రైతుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రాజెక్టుల గురించి కనీస అవగాహన లేకుండా మాట్లాడతున్నారని, టీడీపీ హయాంలో రూ.68 వేల కోట్లతో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల పునాదుల మీదే జగన్ ఐదేళ్లు నీళ్లు నడిపించారని గుర్తుచేశారు. పట్టిసీమను 'ఒట్టి సీమ' అని, పంపులు పీకేస్తానని చెప్పిన జగన్, తన పాలనలో అదే ప్రాజెక్టుతో నీళ్లు ఇవ్వాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు. పురుషోత్తపట్నం, వైకుంఠపురం వంటి ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కేసులు వేయించి, కోర్టుల చుట్టూ తిప్పి రైతాంగానికి అన్యాయం చేశారని ఆరోపించారు.
తుపాను బాధితులకు ప్రభుత్వ అండ
ఒకవైపు జగన్ విమర్శలతో కాలం గడుపుతుంటే, మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తుపాను సహాయక చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టిందని దేవినేని ఉమా తెలిపారు. సీఎం స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, రాత్రింబవళ్లు అధికారులను అప్రమత్తం చేస్తున్నారని చెప్పారు. సుమారు 40 వేల మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని, 84 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని వివరించారు. దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం, బాధితులకు నిత్యావసరాలు అందిస్తున్నామన్నారు. ధాన్యం పంట నష్టపరిహారాన్ని హెక్టారుకు రూ.17 వేల నుంచి రూ.25 వేలకు పెంచామని, మత్స్యకారులు, చేనేత కార్మికులకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించామని తెలిపారు. దెబ్బతిన్న ఇళ్లకు రూ.10 వేల తక్షణ సాయం అందిస్తున్నామన్నారు.
సంక్షేమంలోనూ ముందంజ
విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలు ఆగలేదని దేవినేని ఉమా స్పష్టం చేశారు. కేవలం 27 నెలల్లోనే పింఛన్ల కోసం రూ.79 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం కింద 47 లక్షల మంది రైతులకు ఏటా రూ.20 వేల చొప్పున అందిస్తున్నామని, ఇప్పటికే రూ.12,110 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు. జగన్ ప్రభుత్వంలో రూ.1,700 కోట్ల ధాన్యం బకాయిలను కూడా కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వచ్చాక చెల్లించిందని గుర్తుచేశారు. కష్టకాలంలో ప్రజలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వంపై జగన్ చేస్తున్న కుట్ర రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.