ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలపై చర్యలు తప్పవు: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
Advertisement
- బిల్లుల కోసం చావడానికి కూడా సిద్ధమేనన్న అనిరుధ్ రెడ్డి
- అనిరుధ్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామన్న మహేశ్ గౌడ్
- నిధుల కొరత రాష్ట్రవ్యాప్తంగా ఉందన్న పీసీసీ చీఫ్
Advertisement
సొంత పార్టీ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనిరుధ్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఈ వ్యవహారాన్ని క్రమశిక్షణ కమిటీకి అప్పగిస్తామని ఆయన స్పష్టం చేశారు. అనిరుధ్ రెడ్డికి త్వరలోనే నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని సూచించారు.
"జడ్చర్లలో నేను చస్తేనే బిల్లులు వస్తాయంటే... నియోజకవర్గ అభివృద్ధి కోసం చనిపోవడానికైనా సిద్ధం" అని అనిరుధ్ రెడ్డి ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సొంత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఉన్న ఈ వ్యాఖ్యలను పార్టీ అధిష్ఠానం సీరియస్ గా తీసుకుంది. ఈ వ్యాఖ్యలపై మహేశ్ గౌడ్ స్పందిస్తూ... నిధుల కొరత ఒక్క జడ్చర్లలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఉందని, ఇలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. ఈ అంశాన్ని పార్టీ క్రమశిక్షణ కమిటీ క్షుణ్ణంగా పరిశీలిస్తుందని తెలిపారు.
నవంబర్ 1న ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ ర్యాలీకి కార్యకర్తలను తరలించేందుకు ప్రత్యేక రైళ్ల కోసం దరఖాస్తు చేస్తే, దక్షిణ మధ్య రైల్వే సాకులు చెప్పి తిరస్కరిస్తోందని మహేశ్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ పేరు చెబితేనే బీజేపీ వణికిపోతోందని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ నుంచి కార్యకర్తలను ఢిల్లీకి తీసుకెళ్లి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.