కొండా సురేఖ బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిందే: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

Telangana
Advertisement
  • గతంలో కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న కొండా సురేఖ
  • వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటే సరిపోదన్న ప్రవీణ్ కుమార్
  • టామ్‌కామ్ సంస్థను మంత్రి వివేక్ దుర్వినియోగం చేస్తున్నారని విమర్శ
Advertisement
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై గతంలో చేసిన వ్యక్తిగత వ్యాఖ్యల విషయంలో మాజీ మంత్రి కొండా సురేఖ షరతులు లేకుండా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. సురేఖ తన వ్యాఖ్యలను కేవలం వెనక్కి తీసుకుంటే సరిపోదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కేటీఆర్‌పై తన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకమైనవి కావని, వాటిని వెనక్కి తీసుకుంటున్నానని కొండా సురేఖ తాజాగా చేసిన ప్రకటనపై ప్రవీణ్ కుమార్ స్పందించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అలాంటి వ్యాఖ్యలు చేయడం నేరమని, ఆమె మాటలు తెలంగాణ మహిళల, రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీశాయని ఆరోపించారు. కేటీఆర్ పెద్ద మనసుతో కోర్టుకు వెళ్లారని, వాస్తవానికి ఆమెపై క్రిమినల్ కేసు పెట్టాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో హరీశ్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌లకు కూడా ఇదే గతి పడుతుందని హెచ్చరించారు.

ఇదే సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామిపై ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. నిరుద్యోగ యువతకు విదేశాల్లో ఉపాధి కల్పించేందుకు ఏర్పాటు చేసిన టామ్‌కామ్ (తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ) సంస్థను మంత్రి వివేక్ దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. జర్మనీలో ఉద్యోగాల పేరుతో ప్రకటనలు ఇచ్చి, ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 4.10 లక్షలు వసూలు చేశారని ఆరోపించారు.

ఉచితంగా ఇవ్వాల్సిన అవకాశాలకు డబ్బులు వసూలు చేయడమే కాకుండా, టామ్‌కామ్ పేరుతో కాకుండా ‘ఫెయిర్ స్ట్రీట్’ అనే ప్రైవేట్ సంస్థ పేరుతో ఒప్పందాలు చేసుకున్నారని తెలిపారు. 200 మంది నుంచి డబ్బులు వసూలు చేసి, 10 మందిని కూడా జర్మనీకి పంపలేదని అన్నారు. మెకాట్రానిక్స్ ఉద్యోగం అని చెప్పి పంపిన ఓ యువకుడికి అక్కడ కత్తి ఇచ్చి బీఫ్, మటన్ కోయమన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి వివేక్ తన కుమారుడు గడ్డం వంశీకృష్ణను ఇలాగే పంపిస్తారా? అని ప్రశ్నించారు.
Advertisement

సంబంధిత వార్తలు

RS Praveen KumarKonda SurekhaKTRVivek VenkataswamyTOMCOM ScamTelangana BRS News

More Telugu News

ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలపై చర్యలు తప్పవు: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

29 Oct, 16:50

నెట్‌ఫ్లిక్స్‌లో చిరంజీవి 'మెగావర్స్' టాక్ షో.. షూటింగ్ ప్రారంభం

29 Oct, 16:38

4-0 కోసం టీమిండియా గురి.. కుల్దీప్‌, వరుణ్‌కు ఛాన్స్‌? న్యూజిలాండ్‌కు మరో షాక్‌ తప్పదా!

29 Oct, 16:24

రెండు రోజుల నష్టాలకు బ్రేక్.. భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

29 Oct, 16:17

బ్యాలెట్ ద్వారా బీజేపీకి బుల్లెట్ దింపాం: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

29 Oct, 16:14

బైక్‌లపై మహిళలు అలా ఎందుకు కూర్చుంటారు?.. సౌకర్యమా, సంప్రదాయమా?

29 Oct, 16:05

అత్యంత విలువైన ఐపీఎల్ ఫ్రాంచైజీగా ముంబై.. ప్రతి ఫ్రాంచైజీ విలువ రూ.14,000 కోట్లకు పైనే!

29 Oct, 16:02

నవంబర్‌ 1 నుంచి కీలక మార్పులు.. గ్యాస్‌ ధరలు, పెన్షన్‌, ఐటీఆర్‌ విషయంలో ఏం జరగబోతోంది?

29 Oct, 15:56

ముంబై ఇండియన్స్‌లో భారీ ప్రక్షాళన.. కోచింగ్ బృందం నుంచి మలింగ ఔట్!

29 Oct, 15:43

ఎరుపెక్కిన ఆకాశం.. హాలీవుడ్ సినిమాను గుర్తుచేస్తున్న దృశ్యాలు.. అర్న‌బ్ తుపాను ప్రభావమేనా?

29 Oct, 15:28

వన్‌ప్లస్‌ ఫోన్లు కొనాలనుకుంటున్నారా? రూ.5 వేల వరకు తగ్గింపు.. ట్యాబ్‌తో ఉచిత గిఫ్ట్‌!

29 Oct, 15:15

పక్షవాతం అని చెప్పాడు.. ఇంజెక్షన్ అనగానే లేచి పరిగెత్తాడు.. సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్న వీడియో!

29 Oct, 15:06

రెబెల్స్ పై వెంటనే వేటు వేయండి: చంద్రబాబు ఆదేశం

29 Oct, 15:03

తిరుమలలో నీటి కొరత లేదు: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

29 Oct, 14:59
..More Telugu News