పోలింగ్ రోజున పులివెందులలో ఉంటా.. భయపడొద్దు.. తిరగబడండి: జగన్

Andhra
Advertisement
  • ఈ రెండేళ్లు ఓపిక పడితే వచ్చేది జగన్ 2.0 అన్న జగన్
  • అన్యాయం చేసిన అధికారులను వడ్డీతో సహా చెల్లించేలా చేస్తామని హెచ్చరిక
  • పులివెందులలో కార్యకర్తలపై చేయి వేస్తే తనపై వేసినట్లేనని స్పష్టీకరణ
Advertisement
"ఈ రెండేళ్లు ఓపిక పట్టండి.. వచ్చేది జగన్‌ 2.0" అని పార్టీ శ్రేణులకు వైసీపీ అధినేత జగన్ పిలుపునిచ్చారు. పులివెందులలోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన ఆయన... అధికార కూటమిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పులివెందుల నుంచి మొదలయ్యే ధ్వని రాష్ట్రమంతా వినిపించాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని తుడిచిపెట్టేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

"మా టైమ్ వచ్చినప్పుడు, చట్టాన్ని అతిక్రమించి అన్యాయం చేసిన ఏ అధికారినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వారు సర్వీసులో ఉన్నా, ఒకవేళ రిటైర్ అయిపోయినా సరే.. ఎక్కడున్నా తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టి చర్యలు తీసుకుంటాం. వడ్డీతో సహా చెల్లించేలా చేస్తాం" అని తీవ్రంగా హెచ్చరించారు. పులివెందులలో తమ కార్యకర్తలపై చేయి వేస్తే, తనపై చేయి వేసినట్లేనని ఆయన స్పష్టం చేశారు. "మన హక్కులు మనమే కాపాడుకోవాలి. తిరగబడండి" అని పిలుపునిచ్చారు.

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అధికార కూటమి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. "ఎన్నికల్లో 50 శాతం సీట్లలో పోటీ చేస్తున్నది మా అక్కచెల్లెమ్మలే. వారి నామినేషన్లను నడిరోడ్డుపై అడ్డుకుంటున్నారు. అక్కచెల్లెమ్మల చీరలు చించి దాడులు చేశారు. ఇలా చేయడానికి మీకు సిగ్గుందా? వైసీపీ హయాంలోనే మహిళలకు నిజమైన న్యాయం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న పనులకు ఆయనే సిగ్గుతో తలదించుకోవాలి" అని మండిపడ్డారు. 

నామినేషన్ల ప్రక్రియలో అడుగడుగునా అక్రమాలు జరిగాయని జగన్ ఆరోపించారు. "కూటమి నేతలే 17 మున్సిపాలిటీలు ఏకగ్రీవమని ప్రకటించుకున్నారు. నా సొంత నియోజకవర్గమైన పులివెందులలోనే కేవలం 20 వార్డుల్లో నామినేషన్లు వేయగలిగాం. 7 జడ్పీటీసీ స్థానాలకు గాను 4 చోట్ల మాత్రమే పోటీ జరుగుతోంది. స్క్రూటినీ పేరిట 2 మండలాల్లో మా నామినేషన్లను అన్యాయంగా తిరస్కరించారు" అని దుయ్యబట్టారు.

కార్యకర్తలంతా ధైర్యంగా ఉండాలని, వారికి తాను అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రోజున తాను స్వయంగా పులివెందులలోనే ఉంటానని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని అన్నారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని... మీ అన్న మీకు తోడుగా ఉంటాడని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. 
Advertisement

సంబంధిత వార్తలు

YS Jagan Mohan ReddyPulivendulaYSRCPAndhra Pradesh ElectionsJagan 2.0Local Body Polls

More Telugu News

లిటిగేషన్లే ఆ పార్టీ రాజకీయం.. మా రెండున్నరేళ్ల కష్టాన్ని గుర్తించండి: సీఎం చంద్రబాబు

27 Oct, 18:54

మీరు 2.0 అంటే... మేం 10X చూపిస్తాం: జగన్‌కు పవన్ కల్యాణ్ వార్నింగ్

27 Oct, 18:53

రజనీకాంత్ ‘జైలర్ 2’.. హృతిక్ రోషన్ ‘రోడీ థీమ్’ విడుదల

27 Oct, 18:26

నామినేషన్లు వేయడానికి యుద్ధం చేయాల్సి వస్తోంది: వైఎస్ అవినాశ్ రెడ్డి

27 Oct, 18:14

జర్నలిజానికి డేటా చట్టం ముప్పు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన మీడియా సంస్థలు

27 Oct, 18:08

'అంజాన్ సాయే' ( నెట్ ఫ్లిక్స్) సిరీస్ రివ్యూ!

27 Oct, 17:38

మొదలైన తుపాను ప్రభావం.. విశాఖలో విరిగిపడుతున్న చెట్లు, ఉత్తరాంధ్రలో హై అలర్ట్

27 Oct, 17:34

సార్.. తమరు అద్భుతంగా ఆడారు: శిష్యుడి సెంచరీపై యువీ కామెంట్

27 Oct, 17:16

కేటీఆర్, హరీశ్‌ రావు భ్రమల్లో ఉన్నారు: మహేశ్ గౌడ్

27 Oct, 17:15

‘‘ఫ్రీ బస్సు ఎక్కి భార్య వెళ్లిపోయింది’’.. పథకం రద్దు చేయాలంటూ ఎమ్మెల్యేకు వ్యక్తి వినతి!

27 Oct, 17:12

ఇండియాలోనే అసెంబ్లీ.. లగ్జరీ ఎస్‌యూవీపై ఇప్పుడు రూ.34 లక్షలు తగ్గింపు!

27 Oct, 16:47

తుమ్మిడిహెట్టి చర్చలు పెద్ద డ్రామా: బాల్క సుమన్

27 Oct, 16:44

మా ప్లాన్ చాలా సింపుల్.. వైభవ్ తో ఓపెనింగ్ పై అభిషేక్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

27 Oct, 16:24

ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. ఫార్మా, రియల్టీ షేర్లలో జోరు!

27 Oct, 16:23
..More Telugu News